Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
మోచేతులు నల్లగా, గరుకుగా మారి ఇబ్బంది పెడుతున్నాయా ?
ముఖం, చేతులు తెల్లగా మెరుస్తూ ఉన్నా.. చాలామందికి మోచేతులు మాత్రం నల్లగా మారిపోయి ఇబ్బందిపెడుతుంటాయి. గరుకుగా, నల్లగా, పేరుకుపోయినట్లు అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా.. ఈ నలుపుదనం వీడట్లేదని చాలామంది ఫీలవుతూ ఉంటారు. ఆ నలుపు పోగొట్టడానికి ఇంట్లోనే చక్కటి మార్గాలున్నాయి.
READ MORE :స్కిన్ అలర్జీ లేదా చర్మం దురదను నివారించే హోం రెమెడీస్
చేతులు మొత్తం నిగారిస్తున్నా మోచేతులు మాత్రం నల్లగా మారడానికి రకరకాల కారణాలున్నాయి. ముఖం, చేతులపైనే చూపించే శ్రద్ధ మోతులపై పెట్టరు చాలామంది. మోచేతులకు మాయిశ్చరైజర్ రాయడం విషయంలో కూడా చాలా మంది అశ్రద్ధ వహిస్తుంటారు. దీంతో రానురాను నల్లగా, గరుకుగా మారిపోతాయి. అయితే ఆ నలుపును పోగొట్టడానికి ఇక్కడ ఈజీ టిప్స్ ఉన్నాయి. క్రమం తప్పకుండా ప్రయత్నించి చూడండి.. మీ మోతులూ మిమ్మల్ని మురిపించేలా తయారైపోతాయి.

నిమ్మరసం
నిమ్మరసంలో ఉండే సిట్రస్ నలుపు దనం పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. రోజూ స్నానానికి ముందు నిమ్మరసం రాసి, పది నిమిషాలు అలానే వదిలేసి.. తర్వాత కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరినూనె
కొబ్బరినూనె చర్మం మృదువుగా మారడానికి సహాయపడుతుంది. కాబట్టి టీ స్పూన్ కొబ్బరి నూనె, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి మోచేతులు, మోకాళ్లపై మర్ధనా చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మోచేతులు శరీర ఛాయలోకి మారిపోతాయి.

ఆలివ్ ఆయిల్
రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ పంచదార కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల నలుపు, గరుకుదనం తగ్గిపోతాయి.

బాదం
రెండు టీ స్పూన్ల పెరుగులో కొద్దిగా బాదం పొడి కలిపి మోచేతులపై మసాజ్ చేయాలి. కాసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పాల మీగడ
పాల మీగడ సహజ మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. దీనివల్ల చర్మం స్మూత్ గా మారుతుంది. కాబట్టి పాల మీగడలో చిటికెడు పసుపు కలిపి నల్లగా ఉన్న ప్రాంతంలో రాసి శుభ్రం చేసుకోవాలి. కొద్దిరోజుల్లో తేడా కనిపిస్తుంది.

టమోటా
టొమాటో రసాన్ని తీసి తేనె లేదా కొబ్బరి నూనెతో కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి.. బాగా మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఈ చిట్కాతో నలుపుదనం త్వరగా పోతుంది.

నువ్వుల నూనె
నువ్వుల నూనెలో చర్మాన్ని మృదువుగా ఉంచే సుగుణాలు పుష్కలంగా ఉన్నాయి. వారానికోసారి స్నానానికి నువ్వుల నూనె ఉపయోగించడం వల్ల చర్మానికి కావల్సిన ఫ్యాటీ యాసిడ్స్ అంది, మృదువుగా అవుతుంది. స్నానానికి ముందు నువ్వుల నూనెతో మర్దనా చేయడం లేదా స్నానపు నీటిలో నువ్వుల నూనె వేయడం వల్ల ఫలితం ఉంటుంది.

ప్యాక్
స్పూన్ కలబంద గుజ్జు, స్పూన్ పెసర పిండి, చిటికెడు పసుపు, కొద్దిగా నిమ్మరసం, కొంచెం రోజ్ వాటర్ తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఈ పేస్ట్ ని నల్లగా ఉన్న మోచేతులకు అప్లై చేయాలి. నలభై రోజులు క్రమం తప్పకుండా చేస్తే నల్లబడిన చర్మం మామూలు రంగులోకి వస్తుంది.

దోసకాయ
టీ స్పూన్ దోసకాయ రసం, టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులకు రాసి, ఇరవై నిముషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే మోచేతుల నలుపుదనం తగ్గుతుంది.

పాలు
పాలలో.. చర్మఛాయను పెంచే గుణం ఉంది. పావు కప్పు పాలల్లో చెంచా నిమ్మరసం, అరచెంచా పటిక కలిపి ఈ మిశ్రమాన్ని మోచేతులపై మర్దనా చేయాలి. క్రమం తప్పకుండా చేయడం వల్ల.. నలుపుతో పాటు గరుకుదనం తగ్గుతుంది.
ఇలా క్రమం తప్పకుండా ఈ చిన్నచిన్న చిట్కాలు ఉపయోగిస్తే.. మోచేతులు మృదువుగా మారడమే కాకుండా శరీరరంగులో కలిసిపోతాయి.



Click it and Unblock the Notifications