Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
చర్మ సౌందర్యానికి పాలు...ఉపయోగించే విధానం
చర్మ సంరక్షణలో మాయిశ్చరైజర్స్ మరియు క్లెన్సర్ మనం అనుకున్నంత ఫలితాన్ని అందివ్వకపోవచ్చు. సహజ చర్మ రక్షణ కోసం పాలను ఉపయోగించుకోవచ్చు . పాలతోటి చర్మానికి క్లెన్సింగ్ మరియు మాయిశ్చరైజర్ చేయడం చాలా సులభం .
నిజానికి, చర్మ సంరక్షణలో పాలను ఉపయోగించడం కొన్ని వేల సంవత్సరాల నుండి వాడుకలో ఉన్నది . పాలను అంత విరివిగా చర్మ సంరక్షణలో ఉపయోగించడానికి ముఖ్య కారణం చర్మంలో చాలా త్వరితంగా...ఎఫెక్టివ్ గా బ్రైట్ నెస్ ను తీసుకొస్తుంది.
కాబట్టి, అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం పాలను వివిధ రకాలుగా ఉపయోగించడం వల్ల చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . అయితే అందం కోసం పాలను ఏవిధంగా ఉపయోగించాలో తెలియకపోతే...మీకోసం కొన్ని సింపుల్ టిప్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.
అయితే వీటిని మీరు ప్రయత్నించడాినకి ముందు డెర్మటాలజిస్ట్ (చర్మ సంరక్షణ నిపుణు)లను సంప్రదించండి. పాలను మీ రెగ్యులర్ బ్యూటీ కోసం ఉపయోగించడం వల్ల మీ చర్మ తత్వానికి బాగా సూట్ అవుతుంది..సౌందర్యాన్ని పెంచుతుంది.

క్లెన్సింగ్:
మీ చర్మం మరింత సున్నితంగా ఉంటే, ఏ క్లెన్సింగ్ ప్రొడక్ట్ అయినా చర్మానికి చిరాకు పెట్టిస్తుంది. కానీ, పాలతో తయారుచేసిన క్లెన్సర్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మరింత ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. పాలు అన్ని చర్మ తత్వాలకు మ్యాచ్ అవుతుంది . పాలను చర్మ సంరక్షణ కోసం ఉపయోగించడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అరకప్పు పాలతో మీ ముఖాన్ని శుభ్రచేసి ఫలితాన్ని చూడండి..

ఎక్స్ ఫ్లోయేటింగ్:
పాలలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ వల్ల ముఖంలో ముడుతలు మాయం అవుతాయి. పాలను మీరు ఎక్సఫ్లోయేట్ ఏజెంట్ గా ఉపయోగించుకోవచ్చు . సింపుల్ గా కాటన్ బాల్ ను పాలలో డిప్ చేసి ముఖం మీద అప్లై చేస్తూ మసాజ్ చేయాలి.

సాప్ట్నర్:
మీ ముఖం మరియు శరీరాన్ని పాలు ఉపయోగించి మసాజ్ చేయాలి. మరియు పాలతోటి స్నానం చేయాలి. దాంతో మీ చర్మం సాఫ్ట్ గా మరియు కాంతివంతంగా కనబడుతుంది.

మాస్క్:
ఇతర పదార్థాలతో కలిపి ఫేస్ మాస్క్ గా వేసుకోవడం వల్ల మరింత ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఒక చెంపా పెరుగు తీసుకొని ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

మొటిమలు:
ముఖంలో ఉండే మొటిమలు మరియు మచ్చలను పాలు చాలా గ్రేట్ గా తొలగిస్తుంది, చర్మానికి హైడ్రేషన్ అందిస్తుంది మరియు చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. అలాగే రాత్రుల్లో చర్మానికి కొద్దిగా పాలను అప్లై చేయాలి. తర్వాత రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి.

బాత్:
ఒక కప్పు పాలను బకెట్ నీటిలో మిక్స్ చేసి ఆ నీటితో స్నానం చేయాలి. దాంతో మీరు ఫ్రెష్ గా కనబడుట మాత్రమే కాదు చర్మం అందంగా బ్రైట్ గా కనబడుతుంది.

పాదాలు:
మీ పాదాలను రిలాక్స్ చేసుకోవాలి. వాటికి క్లెన్సింగ్ అవసరం. అందుకో ఒక కప్పు పాలను బేసిన్ లో పోసి హాట్ వాటర్ పోసి ఆ నీటిలో మీ పాదాలను 20 నిముషాలు నానబెట్టుకోవాలి. చాలా సౌకర్యవంతంగా వ్యత్యాసాన్ని మీరే గమనిస్తారు.



Click it and Unblock the Notifications