Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
రోజ్ హిప్ సీడ్ ఆయిల్లోని అమేజింగ్ బ్యూటీ సీక్రెట్స్...
హిమాలయా ప్రాంతాల్లో మస్క్ రోజ్ (రోజా మస్చాట)ను ఫ్లవర్స్ ను పండిస్తారు. ముఖ్యంగా ఈ పంటను శీతాకాలం, వర్షాకాలంలో వీటిని ఎక్కువగా పండిస్తారు . ఈ ఫ్లవర్స్ చాలా సున్నితంగా కలువళ్లాంటి తెలుపు రంగులో పూస్తాయి. వీటి సువాసన అత్యద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మొక్కలో పువ్వులతో పాటు కాచే కాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందుకే ఈ మొక్కలకు చాలా పాపులారిటి ఉన్నది.
రోజ్ హిప్: ఇది కేవలం యాంటీబయోటిక్స్ లా పనిచేస్తుంది కాబట్టి, కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారించడంలో ఇది ఒక ఉత్తమ నేచురల్ హోం రెమెడీ. దీన్ని ఒక యాంటీబయోటిక్ లా కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రస్తుతంలో ఆరోగ్య మరియు సౌందర్య ఉత్పత్తుల్లో ఈ మొక్క, పువ్వులు, మరియు రోజ్ పండుకు చాలా గిరాకీ ఉన్నది.
READ MORE:మీ చర్మాన్ని ప్రకాశవంతము చేసే సుగంధ నూనెలు
ఈ యొక్క కాండం నుండి పూచి పువ్వు మరియు కాయ(రోజ్ హిప్)లో విటమిన్స్ అధికంగా ఉన్నాయి. అందుకే రోజ్ హిప్ సీడ్ ఆయిల్ బ్యూటీ ప్రొడక్ట్స్ లో చాలా పాపులారిటీ సంపాధించుకొన్నది. సెలబ్రెటీలు, మరియు మోడల్స్ మరియు సౌందర్యరారాదులకు మరియు డెర్మటాలజిస్ట్ లు..వీరంత ఈ రోజ్ హిప్ ఆయిల్ ప్రకాశవంతమైన అందమైన చర్మం పొందడానికి బ్యూటీ సీక్రెట్ పదార్థంగా దీన్ని ఉపయోగిస్తున్నారు.
READ MORE:జిడ్డు మరియు సున్నిత చర్మానికి ఫేషియల్ ఆయిల్స్
రోజ్ హిప్ ఆయిల్ ఏం చేస్తుంది. అసలు రోజ్ హిప్ ఆయల్ అంటే ఏమిటి? రోజ్ ప్లాంట్ యొక్క స్టెమ్ నుండి కాచిన కాయలను నీడలో ఎండ బెట్టి వాటి నుండి నూనె తీస్తారు. ఈ నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఆయిల్ ఆరోగ్యకరమైన జుట్టు, చర్మ మరియు నెయిల్ సంరక్షణకు గ్రేట్ గా సమాయపడుతుంది.అదేలాగో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం.....

వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది
ట్రాన్స్ రిటినోయిక్ యాసిడ్స్, రోజ్ హిప్ ఆయిల్ లో ఉండే నేచరల్ విటమిన్ ఎ ముఖంలో ముడుతలు, సన్నని చారలను మరియు గీతలను మరియు ఏజ్ స్పాట్స్ ను నివారిస్తుంది. మరియు ఇతర థెరఫిక్ ఆయిల్స్ లాగే ఈ ఆయిల్ ను కూడా వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. రోజ్ హిస్ సీడ్ ఆయిల్ నల్లని చర్మంను తెల్లగా మార్చుతుంది . ముఖంలో జిడ్డును తొలగిస్తుంది. అందమైన చర్మసౌందర్యం కోరుకొనే వారు రోజ్ హిప్ ఆయిల్ ను రెగ్యులర్ గా ఉపయోగించుకోవచ్చు.

స్ట్రెచ్ మార్స్క్ నివారిస్తుంది
రోజ్ హిప్ సీడ్ ఆయిల్లో ఎక్కువగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు చర్మం యొక్క స్థితిస్థాపకతను(స్కిన్ ఎలాసిటిని )పెంచుతుంది . ఈ ఆయిల్ ను రెగ్యులర్ గా స్కిన్ కేర్ లో ఉపయోగించినట్లైతే బరువు పెరగడం వల్ల మరియు ప్రెగ్నెన్సీలో ఏర్పడ్డ స్ట్రెచ్ మార్క్స్ నివారిస్తుంది. ఏలాంటి స్ట్రెచ్ మార్స్ అయినా ఈ రోజ్ హిప్ సీడ్ ఆయిల్ అప్లై చేసి నివారించుకోవచ్చు.

మొటిమలు మరియు మచ్చలను నివారిస్తుంది.
అదే విధంగా కొల్లాజెన్ ట్రీట్మెంట్ లో దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే ట్రాన్స్ రెటినోయిక్ యాసిడ్ చర్మంను కాంతివంతంగా మార్చడానికి తగిన సామర్థ్యంను చర్మానికి అందిస్తుంది . ఈ రోజ్ హిప్ సీడ్ ఆయిల్ ను ప్రతి రోజూ ముఖానికి రెండు సార్లు అప్లై చేస్తే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం చూడవచ్చు .కొన్నిమెండి మచ్చలు మరియు చారలు కొన్ని నెలల్లో శాశ్వతంగా తొలగిపోతాయి.

క్రోనిక్ డ్రైనెస్ ను నివారిస్తుంది:
రోజ్ హిప్ సీడ్ ఆయిల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల చర్మం హెల్తీగా మరియు స్ట్రాంగ్ గా ఉంటుంది . ఎందుకంటే కొందరి శరీరంలో ఇఎఫ్ఎ సరిగా విడుదల కాకకపోవడం వల్ల ఫ్యాట్స్ తీసుకోవడం లేదా చర్మం గ్రహించడం జరుగుతుంది. ఈ రోజ్ హిప్ సీడ్ ఆయిల్ చర్మంలోని ఫ్యాట్స్ లోకి షోశింపబడి చర్మంకు తగినంత తేమను అంధించి చర్మ కాంతివంతంగా, డ్రై లేదా దురద కలగకుండా ఉంటుంది. చర్మం డ్రైనెస్ కు కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం, స్కిన్ అలర్జీ, కెమిక్ ఎక్స్ ఫోజర్, మరియు ఇతర ఎన్విరాన్మెంటల్ సమస్యల వల్ల చర్మం పొడిబారడాన్నినివారిస్తుంది.

ఎర్రిని చర్మం మరియు చీకాకను నివారిస్తుంది
రోజ్ హిప్ సీడ్ ఆయిల్లో ఉండే లినోలిక్ యాసిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుగా మార్పు చెందడం వల్ల, ఇది రెడ్ నెస్ మరియు చర్మ యొక్క ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. మరియు చర్మంలో అకారణంగా ఏర్పడ్డ మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. కొన్ని రకాల చర్మ సమస్యలకు ఈ రోజ్ హిప్ సీడ్ ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

మచ్చలను మాయం చేస్తుంది
రోజ్ హిప్ సీడ్ ఆయిల్ ఒక ఎఫెక్టివ్ ఆస్ట్రిజెంట్ . ఎప్పుడైతే దీన్ని మాయిశ్చరైజింగ్ క్లెన్సర్ గా ఉపయోగించినప్పుడు, ఇది చర్మాన్ని సాఫ్ట్ గా మరియు కాంతివంతంగా మార్చుతుంది . చర్మరంద్రాలును శుభ్రపరుస్తుంది మరియు స్కిన్ సెల్స్ క్లియర్ చేస్తుంది. మైక్రోఫైబర్ క్లాత్ సహాయంతో రోజ్ హిప్ సీడ్ ఆయిల్ ను అప్లై చేస్తే మరింత ఉత్తమ ఫలితానలు పొందవచ్చు.

గోళ్ళు స్ట్రాంగ్ గా పెరుగుతాయి
గోళ్ళు చిట్లడం, సరిగా పెరగకపోవడం, లేదా పొడిబారి కనిపించడం, నెయిల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు మంచి పరిష్కారం మార్గం. ట్రోపికల్ క్రీమ్ ద్వారా ఇలాంటి సమస్యలకు చికిత్సనందిస్తుంటారు.. ఈ ట్రోపికల్ కెమికల్ క్రీమ్స్ కంటే రోజ్ హిప్ సీడ్ ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. గోళ్ళు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. ఈ ఆయిల్ ను ముఖం కాళ్ళు, చేతులు మరియు గోళ్ళకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ నూనెలో ఎండే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్ క్వాలిటీ మరియు స్కిన్ టోన్ ను పెంచుతుంది. గోళ్ళకు మాయిశ్చరైజర్ గా మరియు బలోపేతం చేస్తుంది. అంతే కాదు అందంగా కనబడేలా చేస్తుంది.

జుట్టుకు పోషణను అందిస్తుంది:
రోజ్ హిప్ సీడ్ ఆయిల్ చాల త్వరగా షోషణ చెందుతుంది . పొడి జుట్టు, చిక్కు, మరియు పొట్టు రాలే జుట్టుకు ఇది ఫర్ఫెక్ట్ హోం రెమెడీ. లైట్ వెయిట్ ఆయిల్. ఇలా వెయిట్ లేకుండా, జిడ్డులేకుండి జుట్టును కాంతివంతంగా కనబడేలా చేస్తుంది. అందుకే దీన్ని ఎక్కువగా హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తుంటారు . రోజ్ హిప్ సీడ్ ఆయిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ తెల్లజుట్టును నివారిస్తుంది మరియు ఫోలిసెల్స్ లో హైడ్రోజెన్ పెరాక్సైడ్ ఉత్పత్తి కాకుండా నివారిస్తుంది.

కాలుష్య ప్రభావం వల్ల డ్యామేజ్ అవ్వకుండా రక్షణ కల్పిస్తుంది
థెరఫీలలో ఉపయోగించే ఆయిల్స్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది యూవీ రేడియేషన్ ను మరియు ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ ను వ్యతిరేకిస్తుంది . దాంతో ఫ్రీరాడిలక్స్ ను నివారించుకోవచ్చుని కొన్ని పరిశోధన ద్వారా వెల్లడైనది . రోజ్ హిప్ సీడ్ ఆయిల్ చర్మానికి పోషణ, అందాన్ని అందివ్వడం మాత్రమే కాదు, ఇది స్కిన్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది . మరియు ఈ నూనెలో ఉండే విటిమిన్స్ మిరయు యాంటీఆక్సిడెంట్స్ సన్ డ్యామేజ్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది మరియు చర్మంలో కొత్తకణాల పునరుత్పత్తికి తోడ్పడుతుంది.

రోజ్ హిప్ సీడ్ ఆయిల్
ప్రస్తుత రోజుల్లో రోజ్ హిప్ సీడ్ ఆయిల్ ఆరోగ్య పరంగా మరియు సౌందర్యపరంగా చాలా పాపులర్ అయింది. ఎప్పుడైతే దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తామో...అప్పుడు అందంగా మరియు ఎఫెక్టివ్ గా... స్ట్రాంగ్ అండ్ హెల్తీ గా కనబడుటకు సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications











