Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
కుంకుమ పువ్వుతో కుందనపు బొమ్మలా మెరిసిపోండిలా...
బ్యూటీ ప్రొడక్ట్స్ లో అద్భుతమైనటువంటి వస్తువు కుంకుమ పువ్వు. సౌందర్యానికి కుంకుమ పువ్వు ఉపయోగించడం వల్ల ముఖంలో గులాబీ మెరుపులు మెరవాల్సిందే. కుంకుమ పువ్వు ఒకరకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఈ భూభాగం లో అత్యంత ఆకర్షనీయమైనది , ఖరీదైనది , అద్భుత ఔషధ గుణాలు కలిగినది కుంకుమపువ్వు. కుంకుమ పువ్వును ఇంగ్లీషులో శాఫ్రాన్ అంటారు.
గర్భిణులు కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే పిల్లలు తెల్లగా పుడతార'ని అంటుంటారు. గర్భిణీ స్త్రీలు ప్రతిదినం కొద్దిగా కుంకుమ పువ్వును, పటిక పంచదార కలిపిన ఆవుపాలతో తీసుకుంటే పుట్టబోయే పిల్లలు మంచి తేజస్సుతో పుడతారని చాలా మంది భావన. ఇది అపోహేనని కొందరు కొట్టిపారేస్తారు. ఏది నిజమో కచ్చితంగా తెలియకపోయినా... రంగూరుచీవాసనా ఉన్న అరుదైన సుగంధద్రవ్యమే కుంకుమపువ్వు. అందుకే అది అందరికీ 'ప్రియమైన' ఎర్ర బంగారం..!
ఇండియన్ ఉమెన్స్ ఫాలో అయ్యే టాప్ 10 అమేజింగ్ బ్యూటీ సీక్రెట్స్
కుంకుమపువ్వు సౌందర్యానికి, ఆరోగ్యానికీ కూడా ఉపయోగిస్తుంది. కుంకుమపువ్వు చర్మపు వర్చస్సును, కాంతిని పెంచుతుంది. చర్మానికి మంచి రంగును కలిగించి, చర్మపు సౌందర్యానికి తోడ్పడుతుంది. కుంకుమ పువ్వు రంగు పదార్ధంగాను, సువాసనకారిగాను అనేక తినుబండారాలు, తాంబూలంలోనూ వాడతారు.
కుంకుమ పువ్వులో గొప్పఆరోగ్యప్రయోజనాలు
కుంకుమ పువ్వు గంధంలా తయారుచేసి మొహానికి రాస్తే మొటిమలు తగ్గి, చర్మం సున్నితంగా ఆకర్షణీయంగా తయారవుతుంది. తాజా చర్మంతో ముఖం చర్మంలో మెరుపును తీసుకొస్తుంది. కాబట్టి కుంకుమ పువ్వుతో కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు ఇంట్లోనే ఎలా తయారు చేసుకొని అప్లై చేయాలో తెలుసుకుందాం...

కుంకుమ పువ్వు:
ఇది చాలా సులభమైన ఫేస్ ప్యాక్. దీన్ని కొద్దినిముషాల్లోనే తయారు చేసేయవచ్చు. ఇక కుంకుమ పువ్వు, పాలు కలిస్తే ముఖంలో లేతగులాబీ మెరుపులు మెరవాల్సిందే. ఎందుకంటే చర్మానికి పాలు ఎంత అద్భుతమైన మార్పును తీసుకొస్తాయో.. కుంకుమ పువ్వు అంత కంటే రెంటింపు మార్పును తీసుకొస్తుంది కనుక. ఇది మెటిమలు మచ్చలు పోగొడుతుంది. పాలను బాగా కాచి అందులో కుంకుమపువ్వు వేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానిక పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకొంటే మెరిసే చర్మం మీ సొంత అవుతుంది దీన్ని ప్రతి రోజూ లేదా వారినికి రెండు మూడు సార్లు అప్లై చేసుకోవచ్చు.

కుంకుమ పువ్వు -తులసి ఆకులు:
కుంకుమ పువ్వులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వల్ల మొటిమల్ని కూడా దరిచేరనీయవు. ముఖంపై ఎక్కువగా మొటిమలు ఉన్నవారు చిటికెడు కుంకుమపూలు తీసుకొని అందులో 3-4 తులసి ఆకులు జత చేసి బాగా మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎక్కడైతే మొటిమలున్నాయో అక్కడ అప్లై చేసి ఆరే వరకూ వేచి ఉండి, తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. ఈ విధంగా ప్రతి రోజూ చేస్తుంటే కొద్ది రోజుల్లోనే మొటిమలు మాయం అయిపోతాయి.

కుంకుమపువ్వు మరియు సాండిల్ వుడ్ పౌడర్:
బ్యూటీ ఉత్పత్తుల్లో మరో అద్బుతమైన వస్తువు. మంచి గంధం. చాలా రకాల ఫేస్ ప్యాక్ లు సాండిల్ వుడ్ తోనే తయారు చేస్తారు. ఇది సున్నితమైన, ఆయిల్ చర్మం కలవారి చాలా మంచిది. ఇది సన్ టాన్, మొటిమలు మచ్చలనుండి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి క్లియర్ మరియు గ్లోయింగ్ స్కిన్ కోరుకొనే వారు సాండిల్ వుడ్ పౌడర్ లో కుంకుమపువ్వు మిక్స్ చేసి కొద్దిగా పాలు చేసి మిక్స్ చేసి ముఖం, మెడకు పట్టించి శుభ్రం చేసుకోవాలి.

మీగడ-కుంకుమ పువ్వు:
చర్మం ప్రకాశవంతంగా ఉన్నప్పటికీ సన్ ట్యాన్ ఉంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం ఉంది. చెంచా మీగడలో కొద్దిగా కుంకుమపువ్వు కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే రెండింటినీ బాగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని ట్యాన్ ఉన్న చోట అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే సన్ ట్యాన్ క్రమంగా తగ్గుముఖం పట్టి సాధారణ చర్మంలా ప్రకాశవంతంగా మారిపోతుంది

బొప్పాయి మరియు కుంకుమపువ్వు:
బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. అలాకోరుకొనే వారు ఈ హోం మేడ్ కుంకుమపువ్వు ఫేస్ ప్యాక్ ను ప్రయత్నించండి. ఒక మిక్సింగ్ బౌల్లో బొప్పాయి ముక్కలు, పాలు, తేనె మరియు కుంకుమపువ్వును వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి పదిహేను నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

రోజ్ వాటర్-కుంకుమ పువ్వు:
చర్మాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత టోనర్ రాసుకోవడం మామూలే. అయితే కుంకుమపువ్వులను కూడా సహజసిద్దమైన టోనర్ లా ఉపయోగించుకోవచ్చు. రోజ్ వాటర్ లో కుంకుమపువ్వులను కలిపి కాసేపు పక్కన పెట్టాలి. తర్వాత రోజ్ వాటర్ రంగు మారాక ఒక కాటన్ బాల్ తీసుకుని అందులో మంచి ముఖమంతా అప్లై చేసుకోవాలి. అలాగే కొంత మంది మహిళలు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా కుంకుమపువ్వు కలుపుకొంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల చర్మం ఎక్కువ కాలం పాటు యవ్వనంగా ఉంటుంది.

పసుపు,-కుంకుమపువ్వు-పాలమీగడ:
డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడానికి పాలమీగడలో రెండు రేకలు, చిటికెడు పసుపు వేసి ముఖానికి పట్టించి చల్లటినీళ్లతో కడిగేసుకొంటే మృత చర్మం తొలగిపోతుంది. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన చర్మతత్వం. ఏ రకమైన చర్మతత్వానికైనా కానీ తగిన పోషణ అందించి కాంతిమంతంగా చేయడానికి కుంకుమ పువ్వు తోడ్పడుతుంది.

కుంకుమపువ్వు మరియు తేనె:
ఒక స్పూన్ నిండుగా తేనె తీసుకొని అందులో కొన్ని కుంకుమపువ్వు రేకులన వేయాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి శుభ్రంగా ఉన్న ముఖానికి అప్లై చేయాలి. తేనె మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. మరియు చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. కుంకుమపువ్వులో ఉండే రిఫ్రెషింగ్ లక్షణాలు చర్మం మెరవడానికి సహాయపడుతుంది . ఈ మాస్క్ ను నెలకొకసారి ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది

ఆలివ్ ఆయిల్ మరియు కుంకుమపువ్వు:
ఆలివ్ ఆయిల్లో కొద్దిగా కుక్కుమ పువ్వు వేసి బాగా మిక్స్ చేయాలి. మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కొన్ని నిముషాలు మసాజ్ చేయాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఫలితంగా ముఖం సాఫ్ట్ గా మరియు స్మూత్ గా తయారవుతుంది.
చూసారుగా ఇలా చెప్పకుంటూ పోతే కుంకుమపువ్వుల వల్ల సౌందర్యపరంగా కూడా ఎన్ని లాభాలుంటాయో..! అయితే ఇన్ని ప్రయోజనాలున్న ఈ కుంకుమపువ్వులను కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కొనాల్సి ఉంటుంది. లేదంటే కల్తీ జరిగి కొత్త సమస్య తలెత్తవచ్చు.



Click it and Unblock the Notifications