ఆయిల్ స్కిన్ నివారించడానికి టాప్ 12 హోం మేడ్ టోనర్స్

మన చర్మాన్ని రొటీన్ గా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం . చర్మం సంరక్షణ కోసం తీసుకొనే జాగ్రత్తల్లో స్కిన్ టోనింగ్ గురించి ఎంత మందికి తెలుసు? చర్మ సంరక్షణ కోసం క్లెన్సింగ్ మరియు టోనింగ్ చేసుకోవడం రెండూ తప్పనిసరిగా చేసుకోవల్సిన చర్మ సంరక్షణలో ముఖ్యమైనటువంటి క్లీనింగ్ పద్దతులు . ఎందుకంటే చర్మ అందంగా సౌందర్య వంతంగా కనబడాలంటే స్కిన్ క్లెన్సింగ్, టోనింగ్ మరియు ఎక్స్ ఫ్లోయేట్ చేయడం వల్ల మీ చర్మం అందంగా అద్భుతంగా మారుతుంది.

READ MORE: వర్షాకాలంలో ముఖం జిడ్డుగా అగుపిస్తున్నదా....?

అదే ఆయిల్ స్కిన్ విషయంలో మరిన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది . మనం రెగ్యులర్ గా స్నానం చేసినట్లుగానే ఆయిల్ స్కిన్ నివారించడం కోసం రెగ్యులర్ టోనింగ్ చాలా ముఖ్యం. ఆయిల్ స్కిన్ కోసం రెగ్యులర్ టోనింగ్ ఎందుకు అవసరం? స్కిన్ టోనింగ్ వల్ల చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ గ్రహిస్తుంది. ముఖ చర్మంలో మురికిని తొలగిస్తుంది. అందుకే రెగ్యులర్ టోనర్ అవసరం. చర్మం మెరిసేలా కాంతివంతంగా కనబడేలా చేస్తుంది మరియు మొటిమలను లేకుండా చేస్తుంది!

READ MORE: ఆయిల్ స్కిన్ కు గొప్ప పరిష్కారం: హోం మేడ్ ఫేస్ మాస్క్

ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ఖరీదైనవి మాత్రమే కాదు, దీర్ఘకాలంలో చర్మానికి హాని కలిగించే కెమికల్స్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి, అలా జరగకుండా ఉండాలన్నా, డబ్బు ఆధా చేయాలన్నా....మీరు కొన్ని సింపుల్ హోం మేడ్ టోనర్స్ ను కనుగొని చర్మానికి టోనర్ గా వేసుకోవాలి. అలాంటి హోం రెమెడీస్ మన వంటగదిలో కూడా ఉండవచ్చు. అయితే ఆయిల్ స్కిన్ కు టోనర్ గా ఉపయోగపడేవి మాత్రమే ఎంపిక చేసుకొని టోనర్ గా ఉపయోగించుకోవాలి . ఇవి చాలా సింపుల్ హోం రెమెడీస్, చౌకైనవి మాత్రమే కాదు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి...మరి అవేంటో చూద్దాం.....

వైట్ వెనిగర్ :

వైట్ వెనిగర్ :

వైట్ వెనిగర్ మరియు నీళ్ళు సమంగా తీసుకొని మిక్స్ చేసి , అందులో కాటన్ డిప్ చేసి ముఖాన్ని తుడుచుకోవాలి.

పుదీనా ఆకులు:

పుదీనా ఆకులు:

పుదీనా ఆకులను వేడి నీళ్ళలో మిక్స్ చేసి , ఈ మిశ్రమాన్ని చల్లబరచాలి, తర్వాత ఆ నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. లేదా కాటన్ ను ఆ నీటిలో డిప్ చేసి ముఖాన్ని తుడవాలి.

నిమ్మరసం, పుదీ, హాజల్ :

నిమ్మరసం, పుదీ, హాజల్ :

ఒక చెంచా నిమ్మరసం, ఒక మింట్ టీ బ్యాగ్, రెండు చెంచాల హాజల్ తీసుకొని వేడి నీళ్ళలో వేసి మిక్స్ చేసి ఉడికించాలి. మొదట టీ బ్యాగ్ ను వేడి నీళ్ళలో వేసి కొద్దిసేపు బాయిల్ చేయాలి . టీబ్యాగ్ ను తొలగించి తర్వాత నిమ్మరసం మరియు హాజల్ ను మిక్స్ చేసి నీటిని మరిగించాలి . మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి తర్వాత చల్లార్చి అందులో కాటన్ బాల్ డిప్ చేసి ముఖం మరియు మెడను శుభ్రం చేసుకోవాలి.

కలబంద:

కలబంద:

అలోవెర రసాన్ని పూర్తిగా తీసుకొని నేరుగా ముఖానికి అప్లై చేయాలి. ఇది గ్రేట్ టోనర్ గా పనిచేస్తుంది. మరియు ఇది సన్ బర్న్ మరియు రాషెస్ ను నివారిస్తుంది.

కీరదోస +పెరుగు:

కీరదోస +పెరుగు:

ఫ్రెష్ గా ఉండే కీరదోసకాయను మెత్తగా తురుముకొని, పెరుగుతో మిక్స్ చేసి , ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి . 10నిముషాల తర్వాత శుభ్రం చేసుకోండం వల్ల ఆయిల్ స్కిన్ తొలగించి నేచరల్ ఎక్సలెంట్ స్కిన్ తో ఫ్రెష్ గా కనబడుతారు.

 కర్పూరం+రోజ్ వాటర్:

కర్పూరం+రోజ్ వాటర్:

రోజ్ వాటర్లో ఒక చిటికెడు కర్పూరం మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజులో రెండు మూడు సార్లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ టోనర్ ఆయిల్ స్కిన్ మరియు మొటిమలున్న స్కిన్ కు చాలా అద్భుతంగా సహాయపడుతుంది

ఐస్ కోల్డ్ వాటర్ :

ఐస్ కోల్డ్ వాటర్ :

ఐస్ కోల్డ్ వాటర్ లేదా ఐస్ క్యూబ్ . ఐస్ క్యూబ్స్ ను ముఖానికి అప్లై చేస్తూ సున్నితంగా మసాజ్ చేసుకోవచ్చు . ఇది ఒక అద్భుతమైన నేచురల్ ఫేస్ ప్యాక్ ..

 రోజ్ వాటర్:

రోజ్ వాటర్:

ముఖానికి ప్రతి రోజూ రోజ్ వాటర్ ను అప్లై చేయడం వల్ల చర్మానికి కొన్ని అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది . ఆయిల్ ఫ్రీ చేస్తుంది. చర్మంను సాఫ్ట్ గా మరియు రేడియంట్ గా మార్చుతుంది.

పీచ్ +ఆలీవ్ ఆయిల్+ బాదం ఆయిల్:

పీచ్ +ఆలీవ్ ఆయిల్+ బాదం ఆయిల్:

రెండు పీచ్ ఫ్రూట్స్ తీసుకొని తొక్క తొలగించాలి. ఈ ఫ్రూట్ కు ఆలివ్ ఆయిల్ మరియు బాదం ఆయిల్ మిక్స్ చేసి మ్యాష్ చేయాలి. ఒక స్పూన్ క్రీమ్ జోడించి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. కొన్ని నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది క్లియర్ మరియు ఫ్రెష్ స్కిన్ ను అందిస్తుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

కొద్దిగా నిమ్మరసం లేదా నిమ్మతొక్కతో ముఖం మీద మర్దన చేయాలి . ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది మరియు ఇది ముఖంలో జిడ్డులేకుండా చేస్తుంది.

 ఎగ్ వైట్:

ఎగ్ వైట్:

ఎగ్ వైట్ ను తీసుకొని ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

టమోటో జ్యూస్ +తేనె:

టమోటో జ్యూస్ +తేనె:

టమోటో జ్యూస్ మరియు తేనెను సమంగా తీసుకోవాలి. దీన్ని చిక్కటి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ఇది బెస్ట్ హోం మేడ్ టోనర్ గా ఆయిల్ స్కిన్.

Story first published: Saturday, July 11, 2015, 16:11 [IST]
Desktop Bottom Promotion