For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీనేజ్ లో బాధించే మొటిమలు మాయం చేసే ఆయుర్వేద చిట్కాలు

|

టీనేజ్‌ ఉన్నవారిని ఎక్కువగా బాధించే సమస్యలలో మొటిమలు ఒకటి. మొటిమలు మహిళల సౌందర్యాన్ని సవాల్‌ చేసే సమస్య. మగ వారిలో కుడా కనిపించవచ్చును . పింపుల్స్ సాధారణంగా 12 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకూ రావడం జరుగుతుంది.

మృదుత్వంతో మెరిసిపోవాల్సిన ముఖంపై చిన్న మొటిమ వస్తే.. అమ్మాయిల కంగారు అంతాఇంతా కాదు. అది తగ్గేదాకా రకరకాల ట్రీట్మెంట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ ను ప్రయత్నిస్తారు. చాలామందిని వేధించే ఈ మొటిమలు ఎందుకు వస్తాయి.. నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే ఇతర సమస్యలు గురించి వివరంగా తెలుసుకుందాం.....

మొటిమల నివారణకు ఆయుర్వేదంతో శాశ్వత పరిష్కారం..!

కౌమారదశలో ప్రవేశించే వారికే మొటిమల సమస్య ఉంటుందనుకుంటారు చాలామంది. నిజానికి, నలభై ఏళ్లు పైబడినవారికీ వస్తాయివి. కేవలం ముఖంపైనే కాదు.. చేతులు, ఛాతి, వీపు వంటి భాగాలపైనా మొటిమలు వస్తాయి. నాలుగు స్థాయుల్లో వేధించే ఈ సమస్య తీవ్రత కొందరిలో ఎక్కువగా ఉంటుంది. మొటిమలు వచ్చి తగ్గడంతో పాటు.. కొందరికి మచ్చలు పడితే.. మరికొందరికి గుంటల దాకా దారితీస్తాయి. అవి తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఎంతో బాధించే వీటి రాకకు కారణాలు అనేకం.

హార్మోన్లలో చోటుచేసుకునే మార్పులు.. చర్మంలో నూనె గ్రంథుల పనితీరు, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. పరోక్షంగా ఒత్తిడితోనూ కొన్నిసార్లు వస్తుంటాయి. పీసీఓడీ (పాలిసిస్టిక్‌ ఓవరీస్‌) సమస్య, కొన్నిరకాల ఉత్ప్రేరకాలు, గర్భనిరోధక మాత్రలు, క్షయకు వాడే మందులు.. వంటివీ ఈ సమస్యకు దారితీస్తాయి.

మందారం ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం...

మరి ఈ సమస్య నుండి బయటపడటం ఎలా? ఉంది పరిష్కార మార్గం.టీనేజ్ లో మొటిమలను నివారించుకోవడానికి ఆయుర్వేదం బాగా పనిచేస్తుంది. ఆయుర్వేదం ద్వారా మొటిమలను నివారించుకోవడం చాలా సింపుల్ టాస్క్. అందుకు ఎక్కువ డబ్బు ఖర్చుచేయాల్సిన పనిలేదు మరియు క్రీములు, లోషన్స్, మెడిసిన్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మొటిమలను నివారించుకోవడానకి మీ వంటగదిని వెదికితే చాలు. పరిష్కారం మీ కళ్ల ముందే దొరుకుతుంది.

ఆయుర్వేద చికిత్సలో టీనేజ్ వారిలో మొటిమలను నివారించుకోవడానికి వంటగదిలోని పసుపు, వేప, లేదా తులసి వంటివి గ్రేట్ గా సహాయపడుతాయి. అయితే వీటిని ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకుంటే చాలు. ముఖ్యంగా ఈ ఆయుర్వేదం చికిత్స ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మరియు ప్రమాదాలు ఉండవు . మరియు టీనేజ్ లో మెటిమల నివారణకు ఆయుర్వేద చికిత్సలేంటో ఒకసారి చూద్దాం...

మొదట ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి:

మొదట ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి:

చాలా మంది ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి చల్లటి నీరు ఉపయోగిస్తుంటారు. ఇలా చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ఇది ఆయిల్ ను ఉత్పత్తి చేస్తుంది. దాంతో మొటిమలు ప్రారంభం అవుతాయి. మీ ముఖంను రోజుకు 3నుండి 4సార్లు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంలో ఆయిల్ కంట్రోల్ చేస్తుంది మరియు పొడిగా ఉంచుతుంది.

డైట్ లో బిట్టర్ పదార్థాలు చేర్చుకోవాలి:

డైట్ లో బిట్టర్ పదార్థాలు చేర్చుకోవాలి:

ఆయుర్వేదం ప్రకారం మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో బిట్టర్ (చేదుగా )ఉండే ఆహారాలు హేర్బ్స్ మరియు వెజిటేబుల్స్ చేర్చుకోవడం ద్వారా శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టివేయడంతో రక్తం శుభ్రపరుస్తుంది మరియు స్కిన్ ఆయిల్ నెస్ కు కారణం అయ్యే సెబమ్ ఉత్పత్తి కాకుండా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మీ డైట్ లో వేప లేదా కాకర వంటివి చేర్చుకోవడం మంచిది. మరియు ఒంట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా తొలగించడానికి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

తులసి పేస్ట్ ను అప్లై చేయాలి:

తులసి పేస్ట్ ను అప్లై చేయాలి:

టీనేజ్ లో వచ్చే మొటిమలను నివారించడంలో తులసి గ్రేట్ గా సహాయపడుతుంది. తులసిని పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి. లేదా తులసి ఆకులను పౌడర్ చేసి, పేస్ట్ చేసి వారంలో 3 సార్లు అప్లై చేయాలి. అలాగే కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి, నిల్వచేసుకొని టోనర్ లా ఉపయోగించుకోవచ్చు.

యోగ:

యోగ:

యోగ వల్ల అనేక ప్రయోజనాలున్నాయి, వాటిలో మొటిమల నివారణ కూడా ఒకటి. ప్రయోజనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే దీన్ని ప్రయత్నించాల్సిందే. నోటి నిండా గాలి పీల్చి పెట్టుకోవాలి.కొద్ది సేపు అలాగే ఉంచి తర్వాత బయటకు నిధానంగా ఊదాలి. ఇలా ప్రతి రోజూ 10 నుండి 12 సార్లు చేసి చూడండి , ఫలితం మీకే తెలుస్తుంది.

పసుపుతో చికిత్స:

పసుపుతో చికిత్స:

టీనేజ్ లో వచ్చే మొటిమల నివారణ చికిత్సలో పసుపులేకుండా ఆయుర్వేద చికిత్స జరగదు. పసుపు, మరియు అల్లం సమంగా తీసుకొని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను రాత్రి పడుకొనే ముందు మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. క్రమంగా 3 రోజులపాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

టమోటో జ్యూస్:

టమోటో జ్యూస్:

టీనేజ్ లో మొటిమలను నివారణకు ఎలాంటి ఆయుర్వేద చికిత్స తీసుకొన్న చివరిగా రాత్రి పడుకొనే ముందు ముఖానికి టమోటో జ్యూస్ తో మసాజ్ చేసి పడుకోవడం వల్ల మొటిమల తాలుకు మచ్చలు కూడా మాయం అవుతాయి.

సాండిల్ ఉడ్ పేస్ట్ :

సాండిల్ ఉడ్ పేస్ట్ :

ప్రతి ఒక్క ఆయుర్వేద చిట్కా మొటిమలను తొలగించడంలో గొప్పగా సహాయపడుతాయి. వేపనీటిని ఉపయోగించి శాండి ఉండ్ పౌడర్ ను పేస్ట్ లా చేసుకోవాలి. వేపనీటిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా పోగొడుతుంది. సాండిల్ ఉడ్ పౌడర్ చర్మాన్ని నునుపుగా మార్చుతుంది మరియు నేచురల్ గ్లోను అందిస్తుంది.

English summary

Treating Teenage Acne Through AyurvedaG: Beauty Tips in Telugu

Teenage is the time when attack of pimples and acne increases. The hormones are mainly responsible for it. Moreover, the dust and pollution can make the situation worse. In ayurveda, problems of acne at teenage is known as ‘Youvana Pidaka’, where ‘Youvana’ is youth and ‘Pidaka’ stands for skin irritation. Treating acne through ayurveda is a very simple task. You don’t need to spend a lot on crèmes, lotions and medicines. Search your kitchen to get ingredients to treat acne.
Desktop Bottom Promotion