Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రోజ్ వాటర్ లోని సౌందర్య రహాస్యం: ఉపయోగించే విధానం
పుష్పాల్లో రాజసాన్ని ఒలికించే పుష్పంగా గులాబీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఔషధ గుణాలనే కాదు... తన సొగసులతో ఇటు భక్తినీ, ప్రేమసాగరాలనీ దాటించ గల సత్తా గులాబీ సొంతం అంటే ఆశ్చర్యం కలగక మానదు.గులాబీల హంగామా అంతా ఇంతా కాదు. అన్ని రకాల సౌందర్యపోషక ఉత్పత్తుల్లో గులాబీలు లేని ఉత్పత్తి లేదంటే అతిశయోక్తి అంతకన్నా కాదు. సెంట్ల తయారీలో కూడా గులాబీ అగ్రగామి అన్న విషయం అందరికీ విధి తమే. వాడిపోయినా, వాడిగా ఉన్నా గులాబీ తన రాజసాన్ని మాత్రం కోల్పోదు. దాని గుణాలు ఎన్నటికీ వాడిపోవు. కాబట్టి దీన్ని సౌదర్య సాధనాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
రోజ్ వాటర్ తో అనేక ప్రయోజనాలున్నాయి. ఈ సువాసనభరితమైన ద్రవంలో ఔషధ మరియు సౌందర్య గుణాలు పుష్కలంగా ఉన్నాయి . ఈ రోజ్ వాటర్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.ఇందులో కూడా వివిధ రకాల విటమిన్స్ ఉన్నాయి. రోజ్ వాటర్ గురించి మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యాంటీ సెప్టిక్ మరియు యాంటీబ్యాక్టిరియాలో లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి .
కొంత మంది రోజ్ వాటర్ బెనిఫిట్స్ ఉండటం వల్ల చాలా మంది చర్మ సౌందర్యంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు . మరియు జుట్టు సంరక్షణకు కూడా చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. రోజ్ వాటర్ అన్ని రకాల చర్మ సంరక్షణకు సహాయపడుతుంది. మీ చర్మం దురదగా ఉంటే ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాదు, ఇది ఆయిల్ స్కిన్ ను నివారిస్తుంది . ఇది చర్మాన్ని కాంతి వంతంగా మార్చుతుంది. కొంత మంది కళ్ళ ఉబ్బును నివారించడానికి కూడా రోజ్ వాటర్ ను ఉపయోగిస్తారు. రోజు వాటర్ లోని మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోవడానికి

సన్ బర్న్ :
సన్ బర్న్ అయిన ప్రదేశంలో కొద్దిగా రోజ్ వాటర్ ను అప్లై చేస్తే సన్ బర్న్ నుండి ఉపశమనం కలుగుతుంది.

టోనర్:
రోజ్ వాటర్ ను టోనర్ గా ఉపయోగించడం వల్ల ఇది ముఖంలో ముడుతలను మరియు మచ్చలను నివారిస్తుంది. అయితే కళ్ళలో రోజ్ వాటర్ పడకుండా చూసుకోవాలి.

కీటకాలు కుడితే :
రోజ్ వాటరు కీటకాలు కుట్టిన ప్రదేశంలో అప్లై చేస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది.

ఐ మేకప్ తొలగిస్తుంది :
ఐ మేకప్ తొలగించడానికి కొద్దిగా రోజ్ వాటర్ అప్లై చేయాలి . రోజ్ వాటర్ మరియు జోజోబా ఆయిల్ రెండూ ఈక్వెల్ గా తీసుకొని అప్లై చేసి కాటన్ తో తుడవాలి.

ఫేస్ వాష్:
మొటమలు మరియు మచ్చలను వల్ల చర్మ దురదగా అనిపిస్తుంటే కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసిన నీటితో ముఖానికి శుభ్రం చేసుకోవాలి. ఇది ఇరిటేషన్ తగ్గిస్తుంది .

శరీర దుర్వాసన:
జాస్మిన్ ఆయిల్లో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి మీ శరీరానికి అప్లై చేయడం వల్ల, శరీరం యొక్క దుర్వాసనను నివారిస్తుంది .



Click it and Unblock the Notifications