For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ సౌందర్యానికి రంగు రంగుల సోపుల కంటే సహజమైన శెనగపిండే మేలు...

|

వావ్! శెనగపిండి స్కిన్ కేర్ సోపులలో ఒక ప్రత్యామ్నాయ ఎఫెక్టివ్ సోప్ శెనపిండి . శెనగపిండిలో దాగి ఉన్న బ్యూటీ అండ్ హెల్త్ బెనిఫిట్స్ మనందరికి బాగా తెలిసినవే.. కొన్నివేల సంవత్సరాల నుండి శెనగపిండిని బ్యూటీ వస్తువుగా ఉపయోగిస్తున్నారు . ఎవరైతే చర్మ సంరక్షణను ఎక్కువగా ఇష్టపడుతారో. వారు చర్మానికి శెనపిండిని కూడా ఎక్కువగా ఇష్టపడుతారు. ఎందుకంటే శెనపిండిలో సోప్స్ మరియు ఫేస్ వాష్ ల కంటే మరింత ఎఫెక్టిగా పనిచేస్తుంది కాబట్టి.

సోపులతో పోల్చితే, శెనపిండి కొన్ని వందల రెట్లు మంచిది. సోపులకు ప్రత్యామ్యాయంగా శెనగపిండిని ఉపయోగించినప్పుడు, దాని వల్ల మీరు పొంద ప్రయోజనాలను తెలుసుకొన్నట్లైతే ఆశ్చర్యం కలగకమానదు. చర్మ సంరక్షణ కోసం శెనగిపిండిని ఉపయోగించడం వల్ల ఎలా సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఇతర దుష్ప్రభావాలు కానీ ఉండవు. సోపులలో కెమికల్స్ అధికంగా ఉండటం వల్ల ఇవి చర్మ సంరక్షణకు అంత మంచివి కావు . ఈ రసాయనిక లక్షణాలు అలర్జీలు మరియు ఇరిటేషన్ ను కలిగిస్తాయి.

కాబట్టి, శెనపిండితో ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల స్కిన్ సెల్స్ కు ఎలాంటి డ్యామేజ్ కలగకుండా నేచురల్ టెక్చర్ ను అందిస్తుంది . శెనపిండిని ఒక్కటినే నేరు అప్లై చేయవచ్చు లేదా ఇతర స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ను జోడించి కూడా ఉపయోగించుకోవచ్చు . మరి సోపుల కంటే శెనగపిండి బెటర్ అనడానికి ఖచ్చితమైన కారణాలేంటో ఈ క్రింది లిస్ట్ ద్వారా తెలుసుకుందాం...

1. సన్ టాన్ నివారిస్తుంది:

1. సన్ టాన్ నివారిస్తుంది:

సోపులను ముఖానికి వాడటం వల్ల సన్ టాన్ తొలగించడంలో ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ, ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి శెనపిండిని ఉపయోగించడం వల్ల సన్ టాన్ తొలగించడంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలను కూడా చాలా ఎఫెక్టివ్ గా అందిస్తుంది.

2. డెడ్ స్కిన్ సెల్స్ ను ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది.

2. డెడ్ స్కిన్ సెల్స్ ను ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది.

శెనగపిండి ఒక మంచి స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. అందుకే శెనపిండి చర్మ సంరక్షణకు ఎంతో అవసరం బ్యూటీషియన్లు సహా నిర్ధారిస్తున్నారు.

3. స్కిన్ లైటనింగ్:

3. స్కిన్ లైటనింగ్:

శెనగపిండిలోని బ్లీచింగ్ లక్షణాలు బ్లషింగ్ లాగా పనిచేస్తుంది. మీరు నేచురల్ బ్లీచ్ ను ఉపయోగించాలంటే తప్పనిసరిగా చర్మానికి శెనగపిండి ఉపయోగించాల్సిందే . చర్మం కాంతివంతంగా మార్చుతుంది. అందుకే కెమికల్స్ ఉన్న సోపుల కంటే శెననపిండే ఉత్తమం.

4. మొటిమలను నివారిస్తుంది:

4. మొటిమలను నివారిస్తుంది:

సోపుల కంటే, శెనపిండితో ముఖాన్ని ఎందుకు శుభ్రం చేసుకోవాలన్న ఆలోచన, ఆశ్చర్యం మీకు కలగవచ్చు. అందుకు కారణం లేకపోలేదు. శెనపిండితో మొటిమలు, మచ్చలను నేచురల్ గా తగ్గించుకొనే అవకాశాన్ని మీరు పొందవచ్చు. ముఖ్యంగా స్కిన్ డీహైడ్రేషన్ కూడా తగ్గిస్తుంది.

5. నల్ల మచ్చలను నివారిస్తుంది:

5. నల్ల మచ్చలను నివారిస్తుంది:

రసాయనాలు ఉప్పయోగించిన సోపుల కన్నా శెనపిండిని బ్యూటీ సంరక్షణలో ఉపయోగించుకోవడం వల్ల సర్ ఫ్రైజింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. బ్లీచింగ్ యాక్షన్ వల్ల ఏర్పడ్డ నల్లమచ్చలను తొలగించడంలో , చేతుల మీద ఉన్న డార్క్ స్పాట్స్ తొలగించడానికి శెనగపిండి గ్రేట్ గా సహాయపడుతుంది.

6. బ్లాక్ హెడ్స్ నివారిస్తుంది:

6. బ్లాక్ హెడ్స్ నివారిస్తుంది:

ముఖంలో ఒక్క సారి ఏర్పడ్డ బ్లాక్ హెడ్స్ తొలగించడానికి చాలా కష్టం అవుతుంది. బ్లాక్ హెడ్స్ ను నివారించడానికి శెనగపిండి గ్రేట్ గా సహాయపడుతుంది.

7. చర్మ రంద్రాలను టైట్ చేస్తుంది:

7. చర్మ రంద్రాలను టైట్ చేస్తుంది:

శెనపిండి వల్ల మరో బ్యూటీ బెనిఫిట్. చర్మ రంద్రాలను శుభ్రం చేసి, అవి మూసుకొనేలా చేస్తుంది. బ్యూటీ ట్రీట్మెంట్ తీసుకొన్న తర్వాత చాలా మంది శెనపిండిని ఉపయోగించి చర్మ రంద్రాలు మాయం చేసుకుంటారు. శెనగిపిండి మాస్క్ వల్ల చర్మం రంద్రాలు కుచించుకుపోతాయి .

8. ఆయిల్ తగ్గిస్తుంది:

8. ఆయిల్ తగ్గిస్తుంది:

స్కిన్ క్లీనింగ్ కోసం ఉపయోగించే రసాయనిక సోపుల వల్ల చర్మంలో జిడ్డు పోక, డీహైడ్రేసన్ మరియు చర్మం నిర్జీవంగా కనబడుతుంది . శెనపిండితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖంలో నూనె ఉత్పత్తి కాకుండా..జిడ్డును నివారిస్తుంది.

9. చర్మంను స్మూత్ గా మార్చుతుంది:

9. చర్మంను స్మూత్ గా మార్చుతుంది:

శెనపిండిలో ఉండే ఎక్సప్లోయేట్ లక్షణాలు చర్మంను స్మూత్ గా మరియు సాఫ్ట్ గా మార్చడానికి సహాయపడుతాయి . అదే సోపు ఉపయోగించడం వల్ల చర్మం రఫ్ గా మరియు డీహైడ్రేట్ గా మారుతుంది.

10. సురక్షితమైనది మరియు నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్:

10. సురక్షితమైనది మరియు నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్:

శెనగపిండితో ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల చర్మానికి ఎలాంటి హానీ ఉండదు. ఎందుకంటే శెనపిండిలో ఎలాంటి రసాయనాలు, ఉండవు. వందశాతం నేచురల్ అండ్ సేఫ్ ప్రొడక్ట్ ఇది

English summary

Wash Face With Besan Powder Instead Of Soap: Beauty Tips in Telugu

Besan powder is one of the most common and effective alternatives for skin care soaps. Besan is well-known for its beauty and health benefits. Those who love to care their skin, would love besan more than soaps and facewashes.
Story first published: Monday, November 2, 2015, 11:53 [IST]
Desktop Bottom Promotion