Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ముఖంలో గులాబి మెరుపులు పొందడానికి 10 బీట్ రూట్ ఫేస్ మాస్క్ లు !
ఆరోగ్యానికి సహాయపడే సూపర్ ఫుడ్స్ లో బీట్ రూట్ ఒకటి. బీట్ రూట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగడం వల్ల కోలన్ శుభ్రం చేస్తుంది. రక్తం ప్యూరిఫై చేస్తుంది. రక్తప్రసరణను క్రమబద్దం చేస్తుంది. బీట్ రూట్ ను ఫేస్ మాస్క
ఆరోగ్యానికి సహాయపడే సూపర్ ఫుడ్స్ లో బీట్ రూట్ ఒకటి. బీట్ రూట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగడం వల్ల కోలన్ శుభ్రం చేస్తుంది. రక్తం ప్యూరిఫై చేస్తుంది. రక్తప్రసరణను క్రమబద్దం చేస్తుంది. బీట్ రూట్ ను ఫేస్ మాస్క్ గా అప్లై చేస్తే చర్మం కొత్తగా కనబడుతుంది. చర్మంలో మ్రుత కణాలు తొలగిపోయి, కొత్త చర్మం ఏర్పడుతుంది??
చర్మ రంద్రాలను శుభ్రం చేసి, ష్రింక్ చేస్తుంది. చర్మంను కాంతివంతంగా ప్రకాశవంతంగా మార్చుతుంది. అంతే కాదు, ఇంకా అనేక రకాలుగా ప్రయోజనాలను అందిస్తుంది!
బీట్ రూట్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది చర్మంలో కొల్లాజెన్ లెవల్స్ పెంచుతుంది, ఇది స్కిన్ ఎలాసిటి పెంచి, స్కిన్ ను సపెల్ గా, స్మూత్ గా మార్చుతుంది.
బీట్ రూట్ లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది స్కిన్ ఇన్ఫ్లమేషన్ నివారిస్తుంది, ఇన్ఫెక్షన్స్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది, నిర్జీవమైన చర్మాన్ని తొలగిస్తుంది.ఇంకా బీట్ రూట్ విటమిన్ సి కి పవర్ హౌస్ వంటిది . ఇది ఫ్రీరాడికల్స్ ను నివారించి, స్కిన్ పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది, ముత్రకణాలను తొలగించి, క్లియర్ స్కిన్ అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
బీట్ రూట్ ను ఉపయోగించి చర్మంలో పింకిస్ గ్లో ను పొందవచ్చు . రెగ్యులర్ గా అప్లై చేయకపోయినా, వారంలో ఒక సారి బీట్ రూట్ స్కిన్ కు అప్లై చేస్తుంటే, చర్మంలో గులాబీ మెరుపులు పూయిస్తుతంది. అందుకోసం కొన్ని బీట్ రూట్ ఫేస్ మాస్క్ లను ఏలా వేసుకోవాలో తెలపబడినది .
చిట్కా: చర్మంలో డీప్ గా రేడియంట్ గా మార్చడానికి బీట్ రూట్ ను నేరుగా రక్తంలోకి పంపాలి. అలా జరగాలంటే రెగ్యులర్ గా బీట్ రూట్ జ్యూస్ తాగాలి. అలాగే ఎక్సటర్నల్ గా కూడా అప్లై చేసుకోవచ్చు.

ఇన్ స్టాంట్ రేడియంట్ మాస్క్
రెండు టేబుల్ స్పూన్ల బీట్ రూట్ జ్యూస్ ను ఒక బౌల్లోకి తీసుకుని, అందులో తేనె మిక్స్ చేసి, కాటన్ డిప్ చేసి, ముఖానికి , మెడకు అప్లై చేయాలి. ఈ హోంమేడ్ బీట్ రూట్ మాస్క్ అప్లై చేసిన 20 నిముషాల తర్వాత క్లీన్ టవల్ తో తుడిచేయాలి.

స్కిన్ వైటనింగ్ మాస్క్:
ఒక టేబుల్ స్పూన్ శెనగపిండి తీసుకుని, అందులో బీట్ రూట్ జ్యూస్, ప్లెయిన్ యోగర్ట్ మిక్స్ చేయాలి. రెండూ బాగా కలిసే వరకూ మిక్స్ చేయాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా రోజా పువ్వు రేకులు పేస్ట్ వేసి, మొత్తం బాగా మిక్స్ చేసి, ముఖం, మెడకు ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడిగేసుకోవాలి

చర్మంను కాంతివంతంగా మార్చే మాస్క్:
ఒక టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, ఒక టేబుల్ స్పూన్ బీట్ రూట్ జ్యూస్ తీసుకుని ముఖం, మెడకు అప్లై చేయాలి. ఇది డ్రై గా మారే వరకూ ఉండి, కొద్దిగా నీళ్ళు చిలకరించి,వదులైయ్యాక, స్క్రబ్ చే సి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

డార్క్ సర్కిల్ మాస్క్:
ఒక టీస్పూన్ బీట్ రూట్ జ్యూస్ తీసుకుని అందులో కొన్ని చుక్కల బాదం ఆయిల్ మిక్స్ చేయాలి, దీన్ని కళ్ళ క్రింద అప్లై చేసి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత క్లీన్ టవల్ ను తడిచేసి, శుభ్రంగా తుడిచేసుకోవాలి.

లిప్ ప్లంపర్ :
పెదాలు నిండుగా, పింక్ కలర్ లో అందంగా కనబడాలంటే, ఈ సింపుల్ రెమెడీని ట్రై చేయవచ్చు. ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా చేసిన బీట్ రూట్ జ్యూస్ ను ఫ్రిజ్ లో పెట్టి, అరగంట తర్వాత బయటకు తీసి, పెదాలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. రాత్రుల్లో నిద్రించడానికి ముందు అప్లై చేస్తే మరింత ఎఫెక్టివ్ ఫలితం ఉంటుంది. తర్వాతి రోజు ఉదయం సాప్ట్ టవల్ తో స్క్రబ్ చేసి క్లీన్ చేసుకోవాలి.ఈ మాస్క్ ను రోజూ కూడా వేసుకోవచ్చు

డ్రై స్కిన్ మాస్క్ :
ఒక టీస్పూన్ పచ్చిపాలు, ఒక టీస్పూపన్ బీట్ రూట్ జ్యూస్, 5 చుక్కల బాదం ఆయిల్ మిక్స్ చేయాలి. మూడు బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని,ముఖం, మెడకు అప్లై చేసి,మసాజ్ చేయాలి. 5 నిముషాలు మసాజ్ చేసిన తర్వాత 10 నిముషాలు అలాగే ఉండనిచ్చి, తర్వాత ప్లెయిన్ వాటర్ తో కడిగేసుకోవాలి.

ఆయిల్ స్కిన్ మాస్క్:
బీట్ రూట్ ను రెండు ముక్కలుగా కట్ చేసి, 5 నిముషాలు బాయిల్ చేయాలి. తర్వాత స్మూత్ గా పేస్ట్ చేసి, అందులో ఒక టేబుల్ స్పూన్ ముల్తాని మట్టిని మిక్స్చేసి, ముఖం, మెడకు ప్యాక్ వేసుకోవాలి. పూర్తి డ్రైగా మారిన తర్వాత గోరువెచ్చని వాటర్ తో శుభ్రపరచుకోవాలి.

స్కిన్ బ్రైటనింగ్ మాస్క్ :
ఒక పార్ట్ బీట్ రూట్ జ్యూస్ కు, ఒక పార్ట్ ఆరెంజ్ జ్యూస్ ను మిక్స్ చేయాలి. ఈ జ్యూస్ మిశ్రమంలో కాటన్ డిప్ చేసి, ముఖం మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ అలసిన చర్మాన్ని , నిర్జీవమైన చర్మాన్ని బ్రైట్ గా మార్చుతుంది.

డీటానింగ్ మాస్క్:
ఒక టేబుల్ స్పూన్ బీట్ రూట్ జ్యూస్ లో ఒక టేబుల్ స్పూన్ సోర్ క్రీమ్ మిక్స్ చేయాలి. దీన్ని అప్లైచేయడానికి ముందు ముఖం శుభ్రంగా కడిగి, తర్వతా శుభ్రంగా కడగాలి. ఈ బీట్ రూట్ ఫేస్ మాస్క్ ను వారంలో రెండు సార్లు వేసుకుంటే టానింగ్ సమస్య ఉండదు.

టోనర్:
మరో సులభమైన చిట్కా, ఒక టేబుల్ స్పూన్ బీట్ రూట్ జ్యూస్ కు, ఒక టేబుల్ స్పూన్ క్యాబేజ్ జ్యూస్, టీస్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి, ఐస్ ట్రేలో పోసి ఫ్రిజ్ లో పెట్టాలి, ఇది ఐస్ లాగా మారిన తర్వాత , బయటకు తీసి, ముఖానికి అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. దాంతో చర్మం ఇన్ స్టాంట్ గా ఫ్రెష్ గా , కాంతి వంతంగా మారుతుంది.



Click it and Unblock the Notifications