For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిస్టర్ హ్యాండ్సమ్ కావాలంటే.. అబ్బాయిలకు ఈ హ్యాబిట్స్ కంపల్సరీ..!!

By Swathi
|

రకరకాల వెబ్ సైట్స్, రకరకాల బ్లాగ్స్, రకరకాల మ్యాగజైన్స్ లో ఎక్కువగా ఆడవాళ్ల కోసమే బ్యూటీ టిప్స్ ఉంటాయి. మరి మగవాళ్ల సంగతేంటి ? ఆడవాళ్లు మాత్రమే కాదు.. మగవాళ్లు కూడా.. అందానికి ప్రాధాన్యత ఇస్తారు. అందంగా కనిపించాలని ఆరాటపడతారు. వాళ్ల లుక్కే.. వాళ్లలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది.

మ‌గ‌వాళ్ల ఫోర్‌హెడ్‌పై 5గీత‌లుంటే వందేళ్లు..! మరి గీతలే లేకపోతే ??

గంటల తరబడి పని, ఒత్తిడిలో మునిగిపోతారు అబ్బాయిలు. దీనివల్ల వాళ్ల అందం గురించి మరిచిపోతూ ఉంటారు. తక్కువ సమయం, అన్ హెల్తీ డైట్, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల.. వాళ్ల స్కిన్ టోన్ మారుతూ ఉంటుంది. నిర్జీవంగా కనిపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు హ్యాండ్సమ్ గా మార్చుకోవడం పెద్ద కష్టమైన పనేంకాదు.

పురుషుల మెరుగైన ఆరోగ్యానికి ఉత్తమ ఆహారాలు

అలాగనీ సలాన్ కి వెళ్లి ఖర్చుతో కూడిన కాస్మొటిక్ ట్రీట్మెంట్స్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. రోజూ కొన్ని అలవాట్లు అలవరుచుకుంటే.. హెల్తీ డైట్ వంటి కొన్ని అలవాట్లతో.. మీరు కూడా మిస్టర్ హ్యాండ్సమ్ అనిపించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. స్మార్ట్ లుక్ కోసం అబ్బాయిలు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో చూసేయండి..

ముఖంపై అన్ వాంటెడ్ హెయిర్

ముఖంపై అన్ వాంటెడ్ హెయిర్

గడ్డం పెంచుకోవడం ఈరోజుల్లో అబ్బాయిలు పాలో అయ్యే ట్రెండ్. అయితే అనవసరమై ప్రాంతాల్లో ఉండే అవాంచిత రోమాలు మాత్రం మీ లుక్ ని దెబ్బతీస్తాయి. కాబట్టి.. వాటిని రిమూవ్ చేసుకుని, స్టైలిష్ గడ్డం పెట్టుకుంటే.. స్మార్ట్ గా కనిపిస్తారు.

పళ్ల శుభ్రత

పళ్ల శుభ్రత

రోజుకి రెండుసార్లు బ్రష్ చేయడం వల్ల మీ పళ్లు తెల్లగా, మెరుస్తూ ఉంటాయి. మీరు నవ్వినప్పుడు తెల్లగా కనిపించే పళ్లు మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి.

హైడ్రేట్

హైడ్రేట్

రోజూ మీరు సరైన మోతాదులో నీళ్లు తాగాలి. ఈ అలవాటు మిమ్మల్ని హెల్తీగా, చర్మాన్ని నిగారింపుగా మారుస్తుంది.

భంగిమ

భంగిమ

కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు సరైన భంగిమలో కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని కాన్ఫిడెంట్ గా, ఎట్రాక్టివ్ గా కనిపించేలా చేస్తాయి.

ఫిట్టెడ్ క్లోత్స్

ఫిట్టెడ్ క్లోత్స్

మీ పర్సనాలిటీ కరెక్ట్ గా ఫిట్ అయ్యే డ్రెస్సింగ్ చేసుకుంటే.. మీరు చాలా స్మార్ట్ గా కనిపిస్తారు. లూజ్ గా, మీకు సూటవని బట్టలు వేసుకుంటే.. అసహ్యంగా ఉంటుంది.

చర్మ సంరక్షణ

చర్మ సంరక్షణ

క్లెన్సింగ్, స్క్రబ్, మాయిశ్చరైజింగ్ వంటి అలవాట్లను రోజూ అలవాటు చేసుకోండి. ఈ హ్యాబిట్ మీ చర్మాన్ని హెల్తీగా, గ్లోయింగ్ గా మారుస్తుంది.

పెదాలు

పెదాలు

పెదాలు పొడిబారకుండా, పగలకుండా చూసుకోవాలి. కాబట్టి లిప్ బామ్, లిప్ మాయిశ్చరూజర్ వాడటం మరిచిపోకండి.

జుట్టు

జుట్టు

స్టైలిష్ హెయిర్ అబ్బాయిల్లో స్పెషల్ ఎట్రాక్షన్. కాబట్టి మీ ఫేస్ ని బట్టి ఎలాంటి హెయిర్ స్టైల్ బావుంటుందో.. అలా చేయించుకుంటే.. మిస్టర్ హ్యాండ్సమ్ మీరే అయిపోవచ్చు.

వ్యాయామం

వ్యాయామం

సిక్స్ ప్యాక్ ఉండాల్సిన అవసరం లేదు. ఫిట్ గా ఉండటం వల్ల.. మీరు చాలా ఎట్రాక్టివ్ గా కనిపిస్తారు. కాబట్టి రెగ్యులర్ గా ఫిట్ నెస్ పై కేర్ తీసుకోవాలి.

సన్ స్క్రీన్

సన్ స్క్రీన్

అబ్బాయిలు ఎక్కువగా ఎండలో తిరగాల్సి ఉంటుంది. స్పోర్ట్స్, వర్క్, జాగింగ్ ఇలా ఏదో రకంగా.. సన్ ఎక్స్ పోజర్ ఉంటుంది. కాబట్టి.. మంచి సన్ స్క్రీన్ లోషన్ వాడటం వల్ల ట్యాన్, పిగ్మెంటేషన్, ఇతర చర్మ సమస్యలు నివారించవచ్చు. అందంగా కనిపించవచ్చు.

English summary

10 Daily Habits That Can Improve Men's Looks

10 Daily Habits That Can Improve Men's Looks. We come across various beauty blogs, with hundreds of beauty tips, but most of them concentrate on the beauty requirements of women. So, what about men? It is equally important for men to feel good about their looks and gain confidence.
Story first published:Saturday, April 30, 2016, 15:20 [IST]
Desktop Bottom Promotion