Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
స్కిన్ సాప్ట్ గా..షైనీగా మెరిపించే హోం మేడ్ మాయిశ్చరైజర్స్..!!
మార్కెట్లో వివిధ రకాల మాయిశ్చరైజర్స్ అందుబాటులో ఉన్నాయి, వీటిని మనం ఇంట్లోనే స్వయంగానే తయారుచేసుకోవచ్చు. ఇవి చర్మానికి సురక్షితమైనవి. ఈ హోం మేడ్ మాయిశ్చరైజర్స్ లో ఫ్రెష్ న్యూట్రీషియన్స్ ఉంటాయి, కాబట్ట
అందంగా కనబడాలంటే, చర్మం ఎప్పుడూ తేమగా, కాంతివంతంగా కనబడాలి, అప్పుడే అందంగా కనబడుతారు. డ్రై స్కిన్ వల్ల ఉన్న అందమంతా పాడవుతుంది, జీర్జీవంగా కనబడుతారు, అంతే కాదు డ్రై స్కిన్ కారణంగా వయస్సైన వారిలా కూడా కనబడేలా చేస్తుంది. కాబట్టి, చర్మంను ఎప్పటికప్పుడు తేమగా, హెల్తీగా ఉంచుకోవడం చాలా అవసరం. అయితే నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఆయిల్ స్కిన్ ఇలా అన్ని రకాల చర్మతత్వాలకు మాయిశ్చరైజింగ్ అవసరమని చాలా మందికి తెలియదు
బ్యూటిఫుల్ స్కిన్ పొందడానికి సీజన్ తో సంబంధం లేకుండా మాయిశ్చరైజింగ్ అవసరం. ప్రతి రోజూ స్కిన్ కు మాశ్చరైజర్ ను అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా కనబడతుంది. మాశయిశ్చరైజర్ వల్ల చర్మంలోపలి వరకూ తేమ అందుతుంది. సూర్య రశ్మి వల్ల యూవి కిరణాలు చర్మంలోకి వెళ్లి వింటర్లో కూడా చర్మాన్ని డ్రైగా మార్చుతుంది, దాంతో చర్మం మరింత డ్రైగా మారి, చర్మం డ్యామేజ్ అవుతుంది. ఈ డ్రై స్కిన్ వల్ల చర్మంలో దురద, డ్రై ప్యాచెస్, మరియు ఇతర చర్మ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టీ ఈ సమస్యలన్నింటినీ దూరం చేసుకోవాలంటే, రెగ్యులర్ గా తప్పనిసరిగా మాశ్చరైజర్ ను అప్లై చేయాలి.
మార్కెట్లో వివిధ రకాల మాయిశ్చరైజర్స్ అందుబాటులో ఉన్నాయి, వీటిని మనం ఇంట్లోనే స్వయంగానే తయారుచేసుకోవచ్చు. ఇవి చర్మానికి సురక్షితమైనవి. ఈ హోం మేడ్ మాయిశ్చరైజర్స్ లో ఫ్రెష్ న్యూట్రీషియన్స్ ఉంటాయి, కాబట్టి, చర్మానికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది
స్కిన్ కు నేచురల్ గా మాయిశ్చరైజర్ ను ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం:

హోం మేడ్ బట్టర్ :
ఇంట్లో స్వయంగా తయారుచేసుకునే బట్టర్ చాలా సురక్షితమైనది, పాలమీగడ, పెరుగు మీగడతో బట్టర్ ను తయారుచేసుకోవచ్చు. మీగడను ఒక కప్పులో తీసి ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో మాయిశ్చరైజింగ్ లక్షణాలు అధికంగా ఉంటాయి . దీన్ని అవసరమైనప్పుడు లేదా రోజు బాడీ మొత్తానికి అప్లై చేసుకుంటే చర్మం స్మూత్ గా, షైనీగా మెరుస్తుంటుంది. బట్టర్ ను ఫ్రెష్ గా అప్లై చేస్తే మరింత ఫర్ఫెక్ట్ రిజల్ట్ పొందుతారు.

బట్టర్ మిల్క్ (మజ్జిగ):
బట్టర్ మిల్క్ లో న్యూట్రీసియన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, మజ్జిగను తాగడం మాత్రమే కాదు, ఎక్స్ టర్నల్ గా అప్లై చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇది చర్మంలోకి త్వరగా షోశింపబడి చర్మంను సాప్ట్ గా, స్మూత్ గా మార్చుతుంది. అదనంగా ముడుతలను మాయం చేస్తుంది, చర్మానికి తగిన తేమను అందిస్తుంది.

మిల్క్ క్రీమ్ :
డ్రైగా, డల్ గా మారిన చర్మం చూడటానికి అధ్వాన్నంగా కనబడుతుంది. అయితే పరిష్కారం మీ ఫ్రిజ్ లోనే ఉంది. గ్లోయింగ్ స్కిన్ పొందడానికి మిల్క్ క్రీమ్ (పాల మీగడను) చర్మానికి అప్లై చేస్తే చాలు . మిల్క్ క్రీమ్ చర్మంలో ఫెయిర్ నెస్ తీసుకొస్తుంది, మరియు డార్క్ సర్కిల్స్ ను తొలగిస్తుంది. స్కిన్ టాన్ తొలగిస్తుంది. రెగ్యులర్ గా మిల్క్ క్రీమ్ అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. మాయిశ్చరైజింగ్ డ్రై స్కిన్ నివారించుకోవడానికి ఫర్ఫెక్ట్ హోం రెమెడీ.

నువ్వుల నూనె:
డ్రై స్కిన్, దురద పెట్టే చర్మానికి డీప్ గా హైడ్రేషన్ అందివ్వాలి, అందుకు నువ్వుల నూనె గ్రేట్ గా సహాయపడుతుంది . నువ్వుల నూనె చర్మం త్వరగా గ్రహిస్తుంది, ఎక్కువ సమయం ఉంటుంది,చర్మంను షైనీగా, సాప్ట్ గా మార్చుతుంది . నువ్వుల నూనెను రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే, చర్మానికి అదనపు మాయిశ్చరైజింగ్ ఫలితాలను అందిస్తుంది.

బాదం ఆయిల్ :
బాదం ఆయిల్లో విటమిన్ ఇ, ఎ లు పుష్కలంగా ఉంటాయి. అద్భుతమైన ఆరోమా వాసన కలిగి ఉంటుంది., ఇది చర్మానికి గ్రేట్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. రాత్రుల్లో నిద్రించే ముందు అప్లై చేస్తే మరింత ఎఫెక్టివ్ ఫలితాలు పొందవచ్చు.

ఆలివ్ ఆయిల్ :
చర్మానికి త్వరగా మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది, అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది, డ్యామేజ్ అయిన చర్మానికి 5 నిముషాలు అప్లై చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది. రాత్రి నిద్రించడానికి ముందు అప్లై చేసి ఉదయం ఫ్రెష్ గా స్నానం చేయాలి.

చల్లగా ఉండే పాలు :
చల్లటి పాలను చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. చర్మానికి హైడ్రేషన్ అందివ్వడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చర్మ రంద్రాల్లోకి త్వరగా గ్రహిస్తుంది, దాంతో చర్మానికి ఎక్కువ మాయిశ్చరైజింగ్ లక్షణాలను అందిస్తుంది,. అరగంట తర్వాత గోరువెచ్చని పాలతో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరి నూనె:
అన్ని రకాల చర్మ తత్వాలకు గ్రేట్ గా పనిచేస్తుంది. కొబ్బరి నూనె స్కిన్ ను సాప్ట్ గా మార్చే ఎక్సలెంట్ హోం రెమెడీ. ఈ నూనెను కనీసం వారానికొసారి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. త్వరలో స్మూత్ అండ్ సాప్ట్ స్కిన్ ను గమనిస్తారు .

క్యారెట్ జ్యూస్ , మిల్క్ క్రీమ్ :
క్యారెట్ కళ్ళకు చాలా మేలు చేస్తుంది. ఈ విషయం మనందరికీ తెలిసినదే. మీకు తెలుసా, ఇది చర్మానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. క్యారెట్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది, ఇది చర్మంలో మెరుపు తీసుకొస్తుంది. క్యారెట్ జ్యూస్ లో ఒక టీస్పూన్ మిల్క్ క్రీమ్ తీసుకుని, అందులో క్యారెట్ జ్యూస్ మిక్స్ చేసి, చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. కొన్ని నిముషాలు మసాజ్ చేసిన తర్వాత టవల్ తో తుడిచేయాలి.

అలోవెర జెల్ :
అలోవెర జెల్ చర్మానికి స్మూతింగ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తుంది, ఇది చర్మానికి గ్రేట్ రెమెడీ. అలోవెర జెల్ ల్లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి, చర్మంను సాప్ట్ గా మాయిశ్చరైజింగ్ గా మార్చతుంది



Click it and Unblock the Notifications











