For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ సహజ చర్మం రెండింతలు ఫెయిర్ అండ్ గ్లోగా కనిబడాలంటే..!!

అన్ని రకాల ఆయుర్వేదిక్ గ్లిజరిన్ మాస్క్ లు చర్మాన్ని సురక్షితంగా ఉంచుతాయి. టాక్సిక్ కెమికల్స్ ఉండవు, మంచి ఫలితాన్ని అందిస్తాయి.

By Lekhaka
|

చర్మం అందంగా , కాంతివంతంగా కనబడటుకు బ్యూటీ కోసం ఉపయోగించే మాయిశ్చరైజర్ నుండి బాడీలోషన్ వరకూ ఎంపిక చేసుకునే సమయంలో ఒక రెండు నిముషాలు వాటి లేబుల్ ను జాగ్రత్తగా పరిశీలించినట్లైతే దాని మీద లేబుల్స్ ఉంటాయి. ప్రతి లేబుల్లో గ్లిజరిన్ తప్పనిసరిగా ఉంటుంది? ప్రతి లేబుల్లో గ్లిజరిన్ ఎందుకుంది అని కాస్త ఆశ్చర్యానికి గురిచేయొచ్చు?

ఎందుకో తెలసుకోవాలంటే, రెగ్యులర్ లైఫ్ లో హెర్బల్ గ్లిజరిన్ ఫేస్ మాస్క్ ఎందుకు ఉపయోగిస్తారు తెలుసుకుందాం...

సహజంగా గ్లిజరిన్ అనేది మొక్కకు సంబంధించిన నాన్ శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇది చర్మం సమస్యలను నయం చేయడంలో, చర్మానికి తగినంత తేమను అందివ్వడంలో, చర్మానికి పోషణను అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

రంగు, రుచిలేని ఒక ప్లెయిన్ వాటర్ లా ఉండే లిక్విండ్ చర్మంలోనికి చాలా త్వరగా అబ్సార్బ్ అవుతుంది. ఇది చర్మంలో నీటిశాతాన్ని నింపుతుంది. దాంతో చర్మం ఎప్పుడు హైడ్రేషన్ లో ఉంటుంది. చర్మం తేమగా ఉందంటే, చర్మంలో ఏజింగ్ లక్షణాలు కనబడవు. చర్మానికి నిరంతరం తేమను అందిస్తుంటుంది. చర్మ రంద్రాలను శుభ్రం చేస్తుంది. ఇది అన్ని రకాల చర్మ తత్వాలకు సూటబుల్ అవుతుంది.

ఇంకా చెప్పాలంటే, గ్లిజరిన్ లో యాంటిసెప్టిక్, డిస్ ఇన్ఫెక్ట్ మరియు బ్యాక్టీరియాసిడ్స్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది చర్మంలో ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ ను కంట్రోల్లో ఉంచుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. చర్మంలో ఎలాంటి మచ్చలు మొటిమలు లేకుండా చేస్తుంది.

ఇన్ని గుణాలున్న ఈ మ్యాజికల్ లిక్విడ్ ను హోం మేడ్ గ్లిజరిన్ మాస్క్ ను చర్మంను కాంతివంతంగా మార్చుకోవడానికి ఏవిధంగా ఉపయోగిస్తారో తెలుసుకుందాం.

అన్ని రకాల ఆయుర్వేదిక్ గ్లిజరిన్ మాస్క్ లు చర్మాన్ని సురక్షితంగా ఉంచుతాయి. టాక్సిక్ కెమికల్స్ ఉండవు, మంచి ఫలితాన్ని అందిస్తాయి.

స్కిన్ బ్రైటనింగ్ ఫేస్ మాస్క్ :

స్కిన్ బ్రైటనింగ్ ఫేస్ మాస్క్ :

ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్, మరో టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి, అందులోనే కొద్దిగా నిమ్మరసం జోడించాలి.ఈ మూడు బాగా కలగలిసే వరకూ మిక్స్ చేయాలి. కాటన్ ప్యాడ్ తీసుకుని అందులో డిప్చేసి, ముఖం, మెడకు అప్లై చేసి, పైకి క్రిందికి మసాజ్ చేయాలి. ఈ చిట్కాను రాత్రుల్లో ఫాలో అయితే మరింత ప్రయోజనం ఉంటుంది. ఉదయం నిద్రలేచేసరికి చర్మం కాంతివంతంగా వెలిగిపోతుంటుంది.

యాంటీఏజింగ్ మాస్క్:

యాంటీఏజింగ్ మాస్క్:

రెండు విటమిన్ క్యాప్స్యూల్స్ తీసుకుని , అందులోని జెల్ ను తీసి బౌల్లో వేసుకోవాలి. ఇంపుడు ఇందులో వెజిటేబుల్ గ్లిజరిన్ జెల్ ను జోడించాలి. ఈ రెండూ బాగా కలగలిసే వరకూ కలుపుతుండాలి. దీన్ని ముఖం, మెడకు పల్చగా అప్లై చేయాలి, అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కుని, మెత్తటి టవల్ తో ముఖం తుడవాలి.

క్లియరింగ్ మాస్క్:

క్లియరింగ్ మాస్క్:

తేనె మరియు గ్లిజరిన్ ను సమంగా తీసుకుని, మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి, మెడకు అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత , చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ హెర్బల్ మాస్క్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల అలసిన, నిర్జీవంగా ఉన్న చర్మంలో తిరిగి కాంతిని తీసుకొస్తుంది.

డ్యామేజ్డ్ సెల్ రిపేరింగ్ మాస్క్:

డ్యామేజ్డ్ సెల్ రిపేరింగ్ మాస్క్:

గుడ్డులోని తెల్ల సొనను బౌల్లో తీసుకుని, అందులో ఒక టీస్పూన్ గ్లిజరిన్ మిక్స్ చేయాలి. ఈ రెండూ బాగా మిక్స్ అయ్యే వరకూ మిక్స్ చేయాలి. దీన్ని ముఖం, మెడకు అప్లై చేయాలి. డ్రై అయ్యే వరకూ ఉండి, తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఈ మాస్క్ లో ఉండే ప్రోటీన్స్, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తాయి. కొత్తగా చర్మ కణాలను ప్రోత్సహిస్తాయి.

స్కిన్ హైడ్రేటింగ్ మాస్క్ :

స్కిన్ హైడ్రేటింగ్ మాస్క్ :

గందం పౌడర్, శెనగపిండి, ఒక్కోక్కో టీస్పూన్ తీసుకుని, అందులో సరిపడా గ్లిజరిన్ మిక్స్ చేసి, పేస్ట్ లా తయారుచేయాలి. పేస్ట్ తయారయ్యాక , దీన్ని ముఖం, మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖం, మెడకు అప్లై చేసి, ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ స్కిన్ బ్రైటనింగ్ గ్లిజరిన్ మాస్క్ ను వారంలో రెండు సార్లు వేసుకుంటే చాలు, చర్మం స్మూత్ గా తయారవుతుంది.

ఇన్ స్టాంట్ గ్లోయింగ్ మాస్క్ :

ఇన్ స్టాంట్ గ్లోయింగ్ మాస్క్ :

కొద్దిగా గ్లిజరిన్ తీసుకుని, వాటర్ లో వేసి మిక్స్ చేయాలి. తర్వాత కాటన్ ప్యాడ్ ను అందులో డిప్ చేసి, ముఖం, మెడకు అప్లై చేసి , అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

డెడ్ స్కిన్ పీల్:

డెడ్ స్కిన్ పీల్:

ఒక బౌల్ తీసుకుని, అందులో ఎగ్ వైట్, తీసుకుని, ఫోర్క్ తో బాగా బీట్ చేయాలి. నురుగ వచ్చే వరకూ మిక్స్ చేస్తుండాలి. తర్వాత అందులో కొద్దిగా తేనె, గ్లిజరిన్ మిక్స్ చేసి, దీన్ని పూర్తిగా డ్రై అయ్యే వరకూ ఉండనివ్వాలి. చర్మం టైట్ గా మారిన తర్వత స్మూత్ గా పీల్ చేయాలి, ఇది చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. చర్మంను స్మూత్ గా మార్చుతుంది.

స్పాట్ క్లియరింగ్ మాస్క్ :

స్పాట్ క్లియరింగ్ మాస్క్ :

బాగా పండిన అరటిపండును మెత్తగా పేస్ట్ చేసి, అందులో ఒక టీస్పూన్ గ్లిజరిన్ మిక్స్ చేసి, రెండు బాగా కలగలిసే వరకూ బీట్ చేయాలి. ఈ మాస్క్ ను ముఖం మరియు మెడకు అప్లై చేయాలి. పూర్తిగా డ్రై అయ్యే వరకూ ఉండనిచ్చి, తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ హెర్బల్ గ్లిజరిన్ ఫేస్ మాస్క్ ను వారంలో రెండు సార్లు ఉపయోగిస్తే చర్మంలో మార్పును గమనిస్తారు.

మొటిమలను క్లియర్ చేసే ఫేస్ మాస్క్ :

మొటిమలను క్లియర్ చేసే ఫేస్ మాస్క్ :

ఒక టీస్పూన్ వేపపౌడర్ తీసుకుని అందులో కొద్దిగా గ్లిజరిన్ మిక్స్ చేయాలి. మెత్తగా పేస్ట్ అయ్యే వరకూ చేసి, దీన్ని ముఖం మొత్తం అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

స్కిన్ స్మూతింగ్ మాస్క్:

స్కిన్ స్మూతింగ్ మాస్క్:

ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్ తీసుకుని, అందులో అలోవెర జెల్ మిక్స్ చేయాలి. దీన్ని ముఖం, మెడకు అప్లై చేయాలి. ఇది చర్మంలో స్ట్రెచ్ అయ్యే వరకూ ఉండి, పూర్తిగా డ్రైగా మారిన తర్వాత మరోసారి రిపీట్ చేయాలి. రెండో సారి డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

English summary

10 Herbal Glycerin Masks For 2 Times Fairer Skin

Glycerin is basically a plant derived triglyceride, a chain of non-saturated fatty acids, which heal, repair, hydrate and nourish the skin. The colourless viscous liquid gets easily absorbed in the skin, helps the skin retain its water, which in turn keeps the skin hydrated!
Story first published: Friday, December 2, 2016, 17:59 [IST]
Desktop Bottom Promotion