For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పై పెదవి మీద అవాంఛిత రోమాలు తొలగించే హెర్బల్ మాస్క్

అప్పర్ లిప్ హెయిర్ ను తొలగించుకోవడం కోసం ఎన్నోచిట్కాలను ఉపయోగించి ఉంటారు, అయితే హెర్బల్ హెయిర్ మాస్క్ ను మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? నొప్పి లేకుండా అప్పర్ లిప్ హెయిర్ ను తొలగిండానికి హెర్బల్ రెమెడీస

By Super Admin
|

అప్పర్ లిప్ హెయిర్(పై పెదవి మీద సన్నని వెంట్రుకలు)నులుగురిలో వెళ్లడానికి ఇబ్బంది కలిగిస్తున్నాయి, ఇది చాలా బాధాకరమైన విషయం. వాక్సింగ్ ఉపయోగించడం, వల్ల చర్మంను ఎవరో పట్టి పీకుతున్నట్లు బాధకలుగుతుంది.

అప్పర్ లిప్ హెయిర్ ను తొలగించుకోవడం కోసం ఎన్నోచిట్కాలను ఉపయోగించి ఉంటారు, అయితే హెర్బల్ హెయిర్ మాస్క్ ను మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? నొప్పి లేకుండా అప్పర్ లిప్ హెయిర్ ను తొలగిండానికి హెర్బల్ రెమెడీస్ సహాయపడుతాయి.

బహుమూలల్లో లేదా భుజాల మీద ఉన్న సన్నని వెంట్రుకలను లాంగ్ స్లీవ్స్ ఉన్న టీషర్ట్స్ తో కవర్ చేసుకోవచ్చు. అయితే అలా అప్పర్ లిప్ హెయిర్ ను కవర్ చేయడానికి కుదరదు. కాబట్టి, ప్రతి ఒక్కరూ ముఖంలో చూడగానే పెదాలు, పెదాల మీద ఉండే సన్నవెంట్రుకలే కనబడుతాయి. ఇలా కనడబటం వల్ల నలుగురిలో చాలా అసహ్యంగా ఉంటుంది. అలా ఉండకూడదనుకుంటే కొన్ని నేచురల్ రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

10 Herbal Masks To Remove Upper Lip Hair

లేదంటే శరీరంలో మేల్ హార్మోన్లను తగ్గించుకోవడం వల్ల ఇటువంటి అప్పర్ లిప్ హెయిర్ తొలగించుకోడానికి సులభమవుతుంది. థ్రెడ్డింగ్ వల్ల ఆ ప్రదేశం రఫ్ గా లేదా చర్మం వదులుగా మారుతుంది. చర్మం రంగులో మార్పు వస్తుంది.అలాగే వాక్సింగ్ కూడా సెన్సిటివ్ ఫేషియల్ స్కిన్ ను బర్న్ చేస్తుంది. !

వీటితో పోల్చినప్పుడు హెర్బల్ ఫేస్ మాస్క్ తో ఫేషియల్ హెయిర్ ను తొలగించుకోవడం సురక్షితం, మరియు సులభం కూడా . హెర్బల్ రెమెడీస్ ఆలస్యంగా ఫలితాలను చూపించినా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అటువంటి హెర్బల్ రెమెడీస్ కొన్నింటిని ఈ క్రింది విధంగా ..

 పసుపు, పాలు:

పసుపు, పాలు:

ఒక టీస్పూన్ పసుపులో కొద్దిగా పచ్చిపాలు మిక్స్ చేసి, చిక్కటి పేస్ట్ లా తయారుచేయాలి. దీన్నీ పెదాల మీద అప్లై చేయాలి. డ్రై అయ్యే వరకూ అప్లై చేసి, తర్వాత స్ర్కబ్ చేసి, కడిగేసుకోవాలి. ఈ ప్రొసెస్ ను రిపీట్ చేస్తుంటే అప్పర్ లిప్ హెయిర్ పెరగకుండా నివారిస్తుంది.

గుడ్డు:

గుడ్డు:

ఎగ్ వైట్ ఒక టీస్పూన్ తీసుకుని అందులో కార్న్ స్ట్రార్చ్ పౌడర్, షుగర్ మిక్స్ చేయాలి. ఇది బంకగా లిక్విడ్ గా ఏర్పడే వరకూ మిక్స్ చేస్తుండాలి. తర్వత దీన్ని అప్పర్ లిప్ ఏరియాలో అప్లై చేయాలి. ఇది పూర్తిగా డ్రై అయ్యే వరకూ అలాగే ఉంచి తర్వాత తొలు తీసినట్లు తియ్యాలి.

పంచదార, నిమ్మరసం:

పంచదార, నిమ్మరసం:

ఒక టీస్పూన్ షుగర్, అర టీస్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు తీసుకోవాలి. వీటిని తక్కువ మంట మీద వేడి చేయాలి. పంచదార కరిగే వరకూ వేడి చేసి, తర్వాత ఈ పదార్థాన్ని చల్లారనివ్వాలి. తర్వాత దీన్ని అప్పర్ లిప్ ఏరియాలో అప్లై చేసి, డ్రైగా మారిన తర్వాత స్ర్కబ్ చేసి, కడిగేసుకోవాలి.

బియ్యం పిండి, పెరుగు:

బియ్యం పిండి, పెరుగు:

అప్పర్ లిప్ హెయిర్ తొలగించుకోవడానికి మరో హెర్బల్ రెమెడీ. ఒక టీస్పూన్ బియ్యం పిండి, సమంగా పెరుగు తీసుకుని, రెండింటిని మిక్స్ చేయాలి. మొత్తం డ్రై అయ్యే వరకూ అలాగే ఉంచాలి. తర్వాత స్ర్కబ్ చేయాలి. తర్వాత వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

 పొటాటో జ్యూస్:

పొటాటో జ్యూస్:

బంగాళదుంప తొక్క తీసి, సన్నగా తురిమి, మిక్సీలో వేసి పేస్ట్ చేసి, రసాన్ని పిండుకోవాలి. ఈ పొటాటో జ్యూస్ ను అప్పర్ లిప్ మీద అప్లై చేసి, రాత్రంతా అలాగే ఉండనివ్వాలి. తర్వాత రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి. ఈ హెర్బల్ మాస్క్ ను ప్రతి రోజూ రాత్రి అప్లై చేస్తుంటే ఎఫెక్టివ్ రిజల్ట్ చూడొచ్చు.

బొప్పాయి, పసుసు:

బొప్పాయి, పసుసు:

బాగా పండిన బొప్పాయిని తీసుకుని, మెత్తగా చేసి, అందులో చిటికెడు పసుపు మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని అప్పర్ లిప్ మీద అప్లై చేయాలి. తర్వాత స్ర్కబ్ చేసి, నీటితో కడిగేసుకోవాలి. ఇది అప్పర్ లిప్ హెయిర్ తగ్గించడమే కాకుండా , బ్లీచింగ్ గా పనిచేస్తుంది.

గ్రీన్ గ్రామ్:

గ్రీన్ గ్రామ్:

పెసళ్ళు ను మెత్తగా పౌడర్ చేసి, కొన్ని చుక్కల నిమ్మరసం, కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి, స్మూత్ గా పేస్ట్ చేయాలి. దీన్ని అప్పర్ లిప్ మీద అప్లై చేసి, తర్వాత శుభ్రం చేసుకోవాలి.

బ్రౌన్ షుగర్:

బ్రౌన్ షుగర్:

ఒక కప్పు బ్రౌన్ షుగర్, రెండు టేబుల్ స్పూన్ల వాటర్ తో మిక్స్ చేసి,రెండు పదార్థాలను కరిగే వరకూ వేడి చేయాలి. చిక్కగా మారిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నట్లే వాక్సిన్ ను అప్పర్ లిప్ కు అప్లై చేయాలి. తర్వాత వెంటనే దానికి మీద వాక్సింగ్ స్ట్రిప్ ను ప్రెస్ చేసి, తర్వాత వెంట్రుకలుపెరిగే వ్యతిరేఖ దిశలో రిమూవ్ చేయాలి.

శెనగపిండి:

శెనగపిండి:

ఒక టీస్పూన్ శెనగపిండిలో, ఒక టీస్పూన్ పసుపు మిక్స్ చేయాలి .తర్వాత పాలతో చిక్కటి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను అప్పర్ లిప్ మీద అప్లై చేయాలి. ఇది డ్రై అయ్యే వరకూ ఉండి తర్వాత స్ర్కబ్ చేసి, కడిగేసుకోవాలి.

స్పేర్మింట్ టీ:

స్పేర్మింట్ టీ:

అప్పర్ లిప్ హెయిర్ ను నేచురల్ గా తగ్గించుకోవడంలో ఈ స్పేర్మింట్ టీ గొప్పగా సహాయపడుతుంది. స్పేర్మింట్ టీలో స్ట్రాంగ్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి, ఈ టీని రోజూ తాగడం వల్ల శరీరంలో హెయిర్ గ్రోత్ ను తగ్గిస్తాయి.

English summary

10 Herbal Masks To Remove Upper Lip Hair

Threading upper lip hair? Yes, it is mind-numbingly painful! Using scalding hot wax? It can feel like someone is peeling your skin off! What if we say there are herbal masks for upper lip hair that will take care of fur-fine moustache minus the pain?
Story first published: Monday, October 17, 2016, 18:32 [IST]
Desktop Bottom Promotion