For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మచ్చలు పడకుండా మొటిమలు నివారించే హెర్బల్ రెమెడీస్..!

గడ్డం, ముక్కు భాగాల్లో మొటిమలు తొలగించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. వాటిని ఒక్కసారి ట్రై చేశారంటే.. పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరికిందని భావిస్తారు.

By Swathi
|

మీ ముక్కు, గడ్డంపై ఎక్కువగా, తరచుగా మొటిమలు వస్తున్నాయా ? మీ ముఖాన్ని ముట్టుకుంటే.. చాలా బంకబంకగా ఉందా ? అయితే గడ్డం, ముక్కు భాగాల్లో మొటిమలు తొలగించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. వాటిని ఒక్కసారి ట్రై చేశారంటే.. పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరికిందని భావిస్తారు.

Herbal Remedies To Get Rid Of Pimples

కొవ్వు ఉండే గ్రంథులు బ్యాక్టీరియాతో బ్లాక్ అయినప్పుడు.. మొటిమలు ఏర్పడతాయి. అలాగే దుర్వాసన వస్తుంది. వీటిని అలాగే వదిలేస్తే.. చాలా నొప్పి కలిగిస్తాయి. ఇవి కేవలం ముఖంపైన మాత్రమే కాదు.. మెడ వెనక, మెడపై, భుజాలపై కూడా వస్తాయి. ఇలాంటప్పుడు మైల్డ్ క్లెన్సర్ తీసుకుని రోజుకి రెండుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ముఖాన్ని ముట్టుకోకూడదు. స్మోకింగ్ మానేయాలి. బయటకు వెళ్లడానికి రెండు గంటల ముందైనా.. సన్ స్క్రీన్ అప్లై చేయాలి. సరైన మోతాదులో నీళ్లు తాగితే.. శరీరంలోని మలినాలు బయటకు తొలగిపోతాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు, చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్స్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి.

వీటితో పాటు కొన్ని హెర్బల్ రెమెడీస్ ఫాలో అయితే.. న్యాచురల్ మీ ముఖంపై మొటిమలు తొలగించుకోవచ్చు. మరి అవేంటో చూద్దామా..

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ తీసుకుని కాటన్ బాల్ పై వేయాలి. దాన్ని మొటిమలపై అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల.. వాపు తగ్గుతుంది, మొటిమ మచ్చలేకుండా పోతుంది.

పేస్ట్

పేస్ట్

టూత్ పేస్ట్ లో మెంథాల్ ఉంటుంది. ఇది మొటమలను వెంటనే డ్రై చేస్తుంది. కాబట్టి పేస్ట్ ని మొటిమపై రాసుకోవాలి. రాత్రంతా అలాగే వదిలేసి.. ఉదయం శుభ్రం చేసుకోవాలి. అంతే మీరే వాపు తగ్గినట్టు గమనిస్తారు.

తేనె

తేనె

తేనెలో ఇన్ఫెక్షన్ నివారించే సత్తా ఉంటుంది. ఇది చర్మంపై ఉండే క్రిములను తొలగిస్తుంది. చర్మ సమస్యలను తేలికగా నివారిస్తుంది. 1 టేబుల్ స్పూన్ తేనెలో అంతే మోతాదులో దాల్చిన చెక్క పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించాలి. తర్వాత 5 నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయాలి.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లిలో సల్ఫర్ ఉంటుంది. ఇది మొటిమను డ్రైగా మారుస్తుంది. ఒక వెల్లుల్లి తీసుకుని పేస్ట్ చేయాలి. అందులో ఒక టీస్పూన్ తేనె కలపాలి. దీన్ని మొటిమపై అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

నిమ్మరసం

నిమ్మరసం

నిమ్మరసంలో యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. చర్మంపై సూక్ష్మ జీవులను తొలగిస్తుంది. నిమ్మరసంలో ఉండే ఆస్ట్రిజెంట్ అదనపు ఆయిల్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది. ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిలో, సరిపడా నిమ్మరసం కలపాలి. మెత్తటి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని మొటిమపై అప్లై చేసి.. రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయం నీటితో శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ మీది సెన్సిటివ్ స్కిన్ అయితే.. అప్లై చేయకపోవడం మంచిది.

ఆవిరి పట్టడం

ఆవిరి పట్టడం

ఆవిరిపట్టుకోవడం వల్ల చర్మ రంధ్రాలు తెరచుకుంటాయి, టాక్సిన్స్ తొలగిపోతాయి, మలినాలు తొలగిపోతాయి, మొటిమలు తగ్గిపోతాయి. వారానికి ఒకసారి 10 నుంచి 15 నిమిషాలు ఆవిరిపట్టుకోవాలి. ఎసెన్షియల్ ఆయిల్ ని కొన్ని చుక్కల ఆ నీటిలో కలుపుకోవడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా డెడ్ స్కిన్ లేయర్ ని తొలగిస్తుంది. ఆయిల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల మొటిమలు రాకుండా అడ్డుకోవచ్చు. 1 టీస్పూన్ బేకింగ్ సోడాలో, అంతే మోతాదులో నీళ్లు కలుపుకోవాలి. మెత్తటి పేస్ట్ అయిన తర్వాత మొటిమలపై అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత స్క్రబ్ చేసి.. శుభ్రం చేసుకోవాలి.

దోసకాయ రసం

దోసకాయ రసం

దోసకాయలో పొటాషియం, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపు తగ్గిస్తాయి. ముందుగా దోసకాయ తొక్కతీసి,అర కప్పు రసం తీసుకోవాలి. అందులో అరకప్పు నీళ్లు కలపాలి. ఈ మిశ్రమంతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ రెమెడీని రోజూ ఫాలో అవడం వల్ల మొటిమలు తగ్గిపోయి క్లియర్ స్కిన్ పొందవచ్చు.

బొప్పాయి

బొప్పాయి

బొప్పాయిలో పపెయిన్, విటమిన్ ఏ ఉంటాయి. ఇవి చర్మంలో పేరుకున్న దుమ్ముని తొలగిస్తాయి. చర్మాన్ని స్మూత్ గా మారుస్తాయి. బాగా పండిన బొప్పాయి ముక్క తీసుకుని, కాస్త పసుపు కలిపి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించాలి. బాగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. మొటిమలు మాయం అవుతాయి.

ఐస్

ఐస్

ఈ న్యాచురల్ ఇంగ్రిడియంట్ మొటిమలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఐస్ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మ రంధ్రాలను మూసేస్తుంది. చర్మంలో పేరుకున్న దుమ్ము, ధూళిని తొలగిస్తుంది. మొటిమలను శాశ్వతంగా నివారిస్తుంది.

English summary

10 Herbal Remedies To Get Rid Of Pimples On The Chin & Nose!

10 Herbal Remedies To Get Rid Of Pimples On The Chin & Nose! Quick, effective and safe herbal remedies to get rid of pimples on nose and chin!
Story first published: Friday, December 23, 2016, 11:54 [IST]
Desktop Bottom Promotion