Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డార్క్ స్పాట్స్ కి గుడ్ బై చెప్పే.. న్యాచురల్ రెమిడీస్
ముఖం మీద మచ్చలు అనేక కారణాలవల్ల రావచ్చు. వివిధ రకాల ఆరోగ్య కారణాలు, ఒత్తిడి, మెలానోసైట్స్ కి సంబంధించిన సమస్యలు, విటమిన్ లేదా మినరల్ లోపం, ప్రేగుల్లో తలెత్తే సమస్యలు, ఎండలో ఎక్కువగా తిరగడం ఇలా బోలెడు కారణాలు. అసలు ఇవి రావడానికి గల మూల కారణాన్ని బట్టి మచ్చల పరిమాణం, రంగు ఉంటాయి. ఈ మచ్చలు శరీరంలో ఎక్కడైనా రావచ్చు. చేతులు, ముఖం, మెడ, భుజాలు, మాడు ఇలా ఎక్కడైనా ఈ మచ్చలు వచ్చే అవకాశం ఉంది.
చాలా మంది ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి మేకప్ లేదా కన్‌సీలర్లు ఉపయోగిస్తారు. కానీ ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఇవి అసలు సమస్యని నిర్మూలించలేవు. వీటిల్లో అనేక రకాల హానికారక రసాయనాలుంటాయి. కాబట్టి సహజ సిద్ధమైన పదార్ధాలతో ఎలాంటి దుష్ఫలితాలూ ఉండవు.
ఇవి ఉపయోగించి చూశాకా కూడా నల్ల మచ్చలలో ఎలాంటి మార్పూ రాకపోతే మెలనోమా లాంటి సమస్య కాదు అని నిర్ధారించుకోవడానికి వైద్యుడిని సంప్రదించాలి. మరిక ఆలశ్యమెందుకు?? నల్ల మచ్చలని నివారించే 10 సహజ సిద్ధ పదార్ధాలని ఇచ్చాము చూడండి.

1.నిమ్మ:
నిమ్మలో ఉన్న బ్లీచింగ్ గుణాలవల్ల బ్యూటీ నిపుణులు నల్ల మచ్చల నివారణకి నిమ్మకాయని సూచిస్తారు.నిమ్మ చెక్కతో నల్ల మచ్చల మీద డైరెక్టుగా రుద్దవచ్చు.

2.మజ్జిగ:
మీది కనుక సెన్సిటివ్ చర్మమయితే నల్ల మచ్చలు,పిగ్మెంటేషన్ నివారణకి మజ్జిగ మంచి మందు.మజ్జిగలో నిమ్మరసం లేదా టమాటా రసం కలిపితే మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

3.ఓట్స్:
మృత కణలాని తొలగించడానికి ఓట్స్ ప్రసిద్ధి.ఓట్స్ ని పెరుగుతో కలిపి గ్రైండ్ చేసి మీ ముఖానికి మాస్క్ లాగ వేసుకోవాలి.

4.బాదం:
రాత్రి పాలల్లో బాదం నానబెట్టి పొద్దున్నే మెత్తటి పేస్టులా రుబ్బి కాస్త తేనె కలిపి ముఖానికి పట్టించాలి.

5.గంధం:
గ్లిజరిన్, రోజ్ వాటర్తో కలిపిన గంధం నల్ల మచ్చల మీద ప్రభావవంతంగా పని చేస్తుంది.ముఖాన్ని శుభ్రపరచుకుని ఈ మాస్క్ ని వేసుకోండి.

6.బంగాళదుంప:
కళ్ళ క్రింద నల్లటి వలయాలు లేదా ముఖం మీద నల్ల మచ్చలు ఉంటే బంగాళదుంప మీకు ఉపయోగపడుతుంది.బంగాళదుంప ముక్కని నల్ల మచ్చల మీదరుద్దడం లేదా తురిమిన బంగాళ దుంపని మచ్చల మీద పూయవచ్చు.

7.పెరుగు:
పెరుగు చక్కటి బ్లీచింగ్ ఏజెంట్. ఇది తక్షణమే నల్ల మచ్చలు, ఇతర మచ్చల మీద పనిచేసి చర్మానికి కొత్త కాంతినిస్తుంది.మచ్చలున్న చోట పెరుగుని పూసి ఆరాకా నీటితో కడుక్కోవాలి.

8.ఆలో వెరా:
ఆలో వెరాలో ఉన్న సహజ సిద్ధమైన మాయిశ్చరైజింగ్ గుణాలవల్ల దీనిని విరివిగా వాడతారు.పిగ్మెంటేషన్, నల్ల మచ్చల నివారణలో కూడా ఇది బాగా ఉపయోగ పదుతుంది.మీ చర్మం యొక్క టోన్‌ని సమం చేసి నల్ల మచ్చల చికిత్సలో కూడా ఉపయోగపదుతుంది.

9.పసుపు:
అనాదిగా స్త్రీల అందం వెనుక ఉన్న రహస్యం పసుపు. ఇది చాలా రకాల చర్మ సమస్యలకి పరిష్కారం కూడా.వయసు వల్ల వచ్చే మచ్చలు, నల్లటి మచ్చలు, కమిలిన చర్మం ఇలా ఏదైనా సరే పసుపు మంచి పరిష్కారం.

10.బొప్పాయి:
బొప్పాయి లో పపైన్ అనే ఎంజైము ఉంటుంది.ఇది చర్మం లోని మృత కణాలని తొలగించి చర్మానికి తాజా కాంతిని కలుగ చేస్తుంది.నల్లటి మచ్చలు పోగొట్టే 10 పదార్ధాలలో ఇది కూడా ఒకటి.



Click it and Unblock the Notifications