Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
శెనగపిండితో సింపుల్ బ్యూటీ ఫేస్ ప్యాక్స్ తో స్కిన్ లోమిరాకిల్స్ చేంజెస్
సున్ని పిండి, పెసరపిండి, శెనగపిండి ఇవి మన ఇండియాలో చాలా పాపులర్ అయినటువంటి సౌందర్య సాధానాలు. వీటిని, వేల సంవత్సరాల నుండి సౌందర్య ఉత్పత్తిగా ఉపయోగిస్తున్నార. సున్నిపిండి శరీరానికి మర్ద చేసిన స్నానం చేసేవారు. అలాగే శెనగపిండి కూడా చాలా విరవిగా ఉపయోగిస్తారు. శెనగిపిండితో ఫేస్ ప్యాక్ కూడా వేసుకుంటారు. ఈ సాంప్రదాయకరమైన శెనగపిండిని ఒక్క చర్మ సంరక్షణలోనే కాదు, కేశ సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. కేశాలకు శెనగిపిండి ఉపయోగించడం వల్ల చుండ్రు వదలడంతో పాటు, ఇతర జుట్టు సమస్యలు కూడా వదులుతాయి. ఇక చర్మ సంరక్షణలో శెనగిపిండి ఒకగొప్ప ఔషదం అనే చెప్పాలి. ఎందుకంటే ఇది మొటిమలు, దానికి తాలుకూ మచ్చలు, చారలు, నల్ల మచ్చలు, స్కిన్ ప్యాచ్ వంటి వాటిన్నింటిని చాలా సులభంగా తొలగిస్తుంది.
శెనగ పిండి చర్మ సంరక్షణకు ఏవిధంగా పనిచేస్తుందో అందరికీ తెలసిన విషయమే. అందుకే ఎక్కువగా ఫేస్ మాస్క్ లుగా శెనగపిండి వేసుకొంటుంటారు. ఇది ఇప్పటి ఆచారమో... పద్దతో కాదు. పూర్వ కాలం నుండి వస్తున్న పద్దతే మన పూర్వ కాలంలో కూడా శెనగపిండి, సున్నిపిండిని నలుగు పెట్టుకొని తర్వాత స్నానం చేసేవారు. శెనగపిండిలో అనేక బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది గ్రేట్ మాయిశ్చరైజర్ గా మరియు ఎక్స్ ఫ్లోయేటర్ మరియు మొటిమలను తొలగించడంలో మరియు జిడ్డు చర్మాన్ని పోగొట్టడంలో, ఫేషియల్ హెయిర్ గ్రోత్ గా, నల్లగా మారిన భుజాలు మరియు మెడ. మరియు పొడి బారిన, నిర్జీవమైన కేశాలకు అన్నింటికి శెనగపిండి మంచి ప్రయోజనం చేకూర్చుతుంది.
ఖరీదైన రసాయనిక ఉత్పత్తులను పక్కన పెట్టి, శెనగపిండి ఉపయోగించి, అనేక బ్యూటీ ప్రయోజనాలను పొందడానికి ఇది ఒక చక్కటి అవకాశం. పెసరపిండి కానీ, లేదా శెనగపిండి కానీ, లేదా సున్నిపిండికానీ ఏదైనా సరే ఉపయోగించినప్పుడు మంచి ఫలితాలను పొందవచ్చు. పెసర పిండి, చర్మ సంరక్షణకు ఒక బెస్ట్ ప్రొడక్ట్ గా ఉపయోగించవచ్చు. శెనగిపిండిని బాడీ స్ర్కబ్ గా సాధారణంగా ఉపయోగిస్తుంటారు. ప్రస్తుత రోజుల్లో మన భారతీయ మహిళలు ఎక్కువగా హెర్బల్ రెమడీస్ ను ఉపయోగించడానికి శ్రద్ద చూపిస్తున్నారు. వీటితో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కనుక వీటి మీద ఎక్కువ మంది ఆసక్తిని కనబరుస్తున్నారు. మరో ప్రయోజనం ఈ నేచురల్ హెర్బల్ ప్రొడక్ట్స్ కోసం ఎక్కువగా ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. మరియు దీర్ఘకాలం కొనాల్సిన పనిలేదు. ఇవి సహజంగానే ఎల్లప్పుడు మన వంటగదిలో నిత్యవసర వస్తువులుగా ఉంటాయి. కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి శెనగపిండిలో అద్భుత ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..

శెనగపిండి ఫేయిల్ హెయిర్ తొలగిస్తుందిం :
ఒక టేబుల్ స్పూన్ శెనగపిండిలో కార్న్ స్టార్చ్ , షుగర్ మిక్స్ చేయాలి. దీనికి కొద్దిగా గుడ్డు మిక్స్ పేస్ట్ చేసి ఈ పేస్ట్ ను ఫేషియల్ హెయిర్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారిలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

స్కిన్ సాప్ట్ గా మారుతుంది:
ఒక టేబుల్ స్పూన్ శెనగపిండిలో రెండు చెంచాలా కోకనట్ క్రీమ్, రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్ మిక్స్ చేసి మసాజ్ చేయాలి. ముఖం మెడకు మసాజ్ చేసి 10 నిముసాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో స్కిన్ సాప్ట్ గా మారుతుంది.

ముడుతలను నివారిస్తుంది:
ఒక బౌల్లో శెనగపిండి, ఎగ్ వైట్ మరియు ముల్తాని మట్టి మిక్స్ చే సి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి.ముఖం మెడ మొత్తం అప్లై చేసి మసాజ్ చేయాలి. 30 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంలో మెడ మీద మొటిమలు మచ్చలు తొలగిపోతాయి.

చర్మం కాంతివంతంగా మార్చుతుంది:
శెనగపిండిలోని ఒక గొప్ప బ్యూటీ బెనిఫిట్ ఏంటంటే చర్మాన్ని టైట్ చేస్తుంది. స్కిన్ టైటనింగ్ కోసం ఉపయోగించే వాటిలో శెనగపిండి, నిమ్మరసం అద్భుతంగాపనిచేస్తాయి. ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా శెనపిండి రెండింటిని పేస్ట్ లా చేసి, ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. లేదా పచ్చిపాలతో శుభ్రం చేసుకోవాలి. ఇలా ఒక వారం రోజుల పాటు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు.

గ్లోయింగ్ స్కిన్ :
ఒక టేబుల్ స్పూన్ శెనపిండిలో ఒక టేబుల్ స్పూన్ పాలు మిక్స్ చేసి ఈ పేస్ట్ కు కొద్దిగా నిమ్మరసం రోజ్ వాటర్ మిక్స్ అప్లై చేయాలి. 15నిముషాలు ప్యాక్ ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది గ్లోయింగ్ స్కిన్ పొందడానికి ఒక బెస్ట్ హోం మేడ్ బేసిప్ ఫేస్ ప్యాక్ .

డార్క్ స్పాట్స్ మరియు పింపుల్ మార్క్స్ ను తొలగిస్తుంది :
మొటిమలతో పోరాడటం అనేది చాలా ఇబ్బందికరమైన సమస్య, కానీ, మొటిమలను దూరంగా ఉంచడంలో శెనగపిండి ఒక అద్భుతమైన సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది. అందుకు రెండు చెంచాలా శెనగపిండిలో, రెండు టీస్పూన్ల అలొవెర జెల్ మిక్స్ చేసి ముఖం మెడకు అప్లై చేయాలి. 30 గంట తర్వాత ముఖం శుభ్రం చేసుకుంటి ముఖంలో మొటిమలు మరియు మొటిమల తాలుకు మచ్చలు తొలగిపోతాయి .

స్కిన్ పిగ్నెటేషన్ :
శెనపిండిలో బేకింగ్ సోడా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మరో బౌల్లో శెనగపిండి, పసుపు మిక్స్ చేసి పెట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసి తర్వాత ఈ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి బాగా మర్ధ నచేయాలి.అర గంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

డ్రై స్కిన్ నివారించే బేసన్ స్క్రబ్:
అరటిపండు గుజ్జులో ఒక టీస్పూన్ తేనె మరియు రెండు టేబుల్ స్పూన్ శెనగపిండి మిక్స్ చేసి పేస్ట్ చేసి ముఖానికి మెడకు అప్లై చేసి స్క్రబ్ చేయాలి. 30నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇది చర్మానికి పోషణను అందిస్తుంది. మాయిశ్చరైజ్ చేస్తుంది.

స్మూత్ అండ్ క్లియర్ స్కిన్ కోసం బేసన్ స్క్రబ్ :
పాలలో ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ నానబెట్టాలి. తర్వాత అందులోనే కొద్దిగా శెనగపిండి వేసి స్మూత్ గా స్క్రబ్ చేయాలి. 10 నిముషాలు మర్ధన చేసిన తర్వాత అలాగే ఉండి 20 నిముషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇది చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి చర్మానికి స్మూత్ నెస్ ను పాలిష్ ను అందిస్తుంది.

మొటిమలు మరియు మచ్చలను తొలగిస్తుంది
ఒక టీస్పూన్ శెనగపిండిలో , ఒక టీస్పూన్ గందం మిక్స్ చేసి అందులోనే పెరుగు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది చర్మ రంద్రాలను శుభ్రం చేసి, మలినాలను, డెడ్ స్కిన్ తొలగిస్తుంది. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications











