For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్లో పెదాల పగుళ్లను నివారించే సూపర్ హైడ్రేటింగ్ హోం రెమెడీస్ ..!!

పెదాలకు మాయిశ్చరైజింగ్ అందివ్వడానికి లిప్ బామ్స్ ఉపయోగిస్తుంటాము, అయితే ఇవి మాత్రమే సరిపోవు, వింటర్ లో పెదాలు చాలా త్వరగా డ్రైగా మారుతాయి. అంతే కాదు, పగుళ్ళు, పొక్కుకట్టడం, వాటిని పీలకడం వల్ల రక్తస్రా

By Lekhaka
|

చలికాలం వచ్చేసింది! ఈ చలికాలంలో చర్మం త్వరగా డ్రైగామారుతుంది, ముఖ్యంగా పెదాలు పగులుతాయి. పెదాలు త్వరగా డ్రైగా , ప్లాకీగా మారుతుంది. దీన్ని వెంటనే నివారించుకోకపోతే కొద్ది రోజుల తర్వాత పెదాల చర్మం మరీ డ్రైగా మారిన తర్వాత రక్తస్రావం, గాయం అవుతుంది.

ఇలాంటి పగుళ్ళు ఉన్న పెదాల మీద లిప్ స్టిక్ అప్లై చేస్తే మరింత డ్రైగా మారుతాయి.కాబట్టి, పెదాల పగుళ్ళకు కారణం స్కిన్ లో మాయిశ్చరైజింగ్ కోల్పోవడం, చర్మానికి కావల్సినంత మాయిశ్చరైజింగ్ ను అందించి , పాడైనచర్మకణాలను రిపేర్ చేయడానికి తగిన హైడ్రేషన్ ను అందివ్వాలి.

పెదాలకు మాయిశ్చరైజింగ్ అందివ్వడానికి లిప్ బామ్స్ ఉపయోగిస్తుంటాము, అయితే ఇవి మాత్రమే సరిపోవు, వింటర్ లో పెదాలు చాలా త్వరగా డ్రైగా మారుతాయి. అంతే కాదు, పగుళ్ళు, పొక్కుకట్టడం, వాటిని పీలకడం వల్ల రక్తస్రావం జరగుతుంది, అందుకోసం కొన్ని లిప్ కేర్ జాగ్రత్తలతో పాటు, కొన్ని హెర్బల్ లిప్ మాస్క్ లను మీకు పరిచయం చేస్తున్నాము.

లిప్ కేర్ కోసం తీసుకోవల్సిన జాగ్రత్తలు:

రూల్ నెం 1: పెదాలు డ్రైగా మారినప్పుడు, పెదాలను కొరకడం, లేదా చర్మంను పీకడం చేయకూడదు.

రూల్ నెం 2: పెదాలను నాలుకతో అస్తమానం తడపకూడదు, మరింత డ్రైగా మార్చుతుంది, మరియు పెదాలు మరింత డార్క్ గా మార్చుతుంది.

రూల్ నెం 3: పెదాలను ఎప్పుడూ టచ్ చేయకూడదు.

రూల్ నెం 4: ఎస్ఎఫ్ పి లక్షణాలున్న లిప్ బామ్స్ ను ఎంపిక చేసుకోవడం వల్ల పెదాల్లో తేమకోల్పోకుండా ఉంటుంది.

ఇక పెదాలకు తగిన పోషణ, హైడ్రేషన్ ను అందించే సూపర్ హైడ్రేటింగ్ లిప్ ఫిక్సెస్ ఈ క్రింది విధంగా...

తేనె, పెట్రోలియం జెల్లీ:

తేనె, పెట్రోలియం జెల్లీ:

ఒక టీస్పూన్ పెట్రోలియం జెల్లీలో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేయాలి. ఈ రెండూ బాగా కలిసే వరకు మిక్స్ చేయాలి. దీన్ని రాత్రుల్లో నిద్రించడానికి ముందు పెదాలకుఅ అప్లై చేసి , ఉదయం బ్రష్ చేసి , స్ర్కబ్ చేసి శుభ్రం చేసుకోవడం వల్ల డెడ్ స్కిన్ లేయర్స్ తొలగిపోతాయి.తేనెలోని మాయిశ్చరైజింగ్ గుణాలు రోజంతా పెదాలు తేమగా ఉండేట్లు చేస్తుంది.

బాదం ఆయిల్ :

బాదం ఆయిల్ :

ఒక టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ ను తక్కువ మంట మీద వేడి చేయాలి. తర్వాత అంుదలో ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసి, ఫోర్క్ తో బాగా బీట్ చేయాలి. దీన్ని చిన్న జార్ లో స్టోర్ చేసి, దీన్ని పెదాల మీద మసాజ్ చేయాలి. దీన్ని ప్రతి సారి పెదాల మీద అప్లైచేయొచ్చు. ఇందులో విటమిన్ ఇ, తేనెలోని తేమగుణాలు, యాంటీఆక్సిడెంట్స్ డ్రైగా మారిన పెదాలకు మాయిశ్చరై.జింగ్, పోషణను అందిస్తాయి. ఇది ఇతర లిప్ బామ్స్ కంటే పది రెట్లు ఎక్కువగా పనిచేస్తుంది.

క్లీన్ గా ఉండే క్లాత్:

క్లీన్ గా ఉండే క్లాత్:

ఒక శుభ్రమైన క్లాత్ తీసుకుని, వాట్ వాటర్ లో డిప్ చేయాలి. తర్వాత ఎక్సెస్ వాటర్ ను పిండేసి, లైట్ గా కూల్ గా అయ్యే వరకూ ఉండి, తర్వాత దీన్ని పెదాల మీద ప్రెస్ చేయాలి. కొన్ని సెకండ్లు పెదాల మీద అలాగే ఉండనివ్వాలి. ఇలా ఒక అయిదు నిముషాలు క్రమంగా చేయాలి. ఇది రెగ్యలర్ గా మాయిశ్చరైజర్ అందిస్తుంది, ఈ సింపుల్ ట్రిక్ వల్ల స్మూత్ అండ్ సాప్ట్ లిప్స్ మీ సొంతం అవుతాయి.

పంచదార, ఆలివ్ ఆయిల్:

పంచదార, ఆలివ్ ఆయిల్:

ఒక టేబుల్ స్పూన్ పంచదార, అరటేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, తర్వాత పేస్ట్ అయిన తర్వాత దీన్ని పెదాలకు అప్లై చేసి సర్క్యులర్ మోషన్ లో మర్ధన చేయాలి. దీన్ని కొన్ని నిముషాల పాటు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ మాస్క్ డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది,

కోకబట్టర్, కొబ్బరి నూనె:

కోకబట్టర్, కొబ్బరి నూనె:

ఈ నేచురల్ పదార్థాలు పెదాలకు నేచురల్ మాయిశ్చరైజర్, పోషణను అందిస్తాయి,పగిలిన పెదాలను నయం చేస్తుంది. కొక టీస్పూన్ కోకబట్టర్ లో కొన్ని చుక్కల కొబ్బరి నూనె మిక్స్ చేసి, పేస్ట్ లా అయిన తర్వాత, దీన్ని పెదాల మీద మసాజ్ చేయాలి. రాత్రి నిద్రించే సమయానికి ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఐస్ రబ్:

ఐస్ రబ్:

డ్రైగా మారిన పెదాల మీద ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేయడం వల్ల పెదాలకు మాయిశ్చరైజింగ్ అందుతుంది, స్మూత్ గా తయారవుతాయి, రక్తప్రసరణ మెరుగుపడుతుంది. పెదాలు సాప్ట్ గా అందంగా తయారవుతాయి . రోజ్ వాటర్ ఐస్ క్యూబ్ ను కూడా ప్రయత్నించవచ్చు.

మిల్క్ క్రీమ్, కుంకుమపువ్వు:

మిల్క్ క్రీమ్, కుంకుమపువ్వు:

అరటీస్పూన్ మిల్క్ క్రీమ్ లో కొద్దిగా కుంకుమ పువ్వు మిక్స్ చేయాలి. దీన్ని హెర్బల్ లిప్ మాస్క్ గా వేసుకోవచ్చు. దీని వల్ల పెదాల రంగు మారుతుంది సాప్ట్ లిప్స్ సొంతం అవుతాయి. రాత్రి నిద్రించడానికి ముందు అప్లైచేస్తే మరింత మంచిది.

షీబట్టర్, ఆలివ్ ఆయిల్ , బీట్ రూట్ జ్యూస్:

షీబట్టర్, ఆలివ్ ఆయిల్ , బీట్ రూట్ జ్యూస్:

ఒక టీస్పూన్ షీ బట్టర్, ఆలివ్ ఆయిల్, బీట్ రూట్ జ్యూస్, మిక్స్ చేసి, రాత్రి నిద్రించడానికి ముందు పెదాలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఉదయం స్ర్కబ్ చేసి క్లీన్ చేసి, సాప్ట్ టవల్ తో శుభ్రం చేసుకోవాలి.

కీరదోసకాయ:

కీరదోసకాయ:

కీరదోసకాయ తొక్కతీసి, జ్యూస్ తీసీ, రిఫ్రిజరేటర్ లో 15నిముషాలు పెట్టాలి. తర్వాత జ్యూస్ లో కాటన్ ప్యాడ్ డిప్ చేసి, పెదాల మీద అప్లై చేసి, మసాజ్ చేయాలి. ిది పెదలాకు నేచురల్ మాయిశ్చరైజింగ్ గుణాలనుఅ ందిస్తుంది. ఎన్ని సార్లు చేస్తే అంత మంచిది.

నీళ్ళు ఎక్కువ తాగాలి:

నీళ్ళు ఎక్కువ తాగాలి:

చర్మానికి తగిన హైడ్రేషన్ అందివ్వడంలో నీళ్ళు ప్రధాన పాత్రపోషిస్తాయి. ఇది హెచ్ 20 పెదాలు పగలకుండా సహాయపడుతుంది. రోజుకు సరిపడా నీళ్ళు ఎక్కువగా తాగుతుండాలి.

English summary

10 Super-Hydrating Lip Fixes For Winter!

Winter is coming! And so is the season for dry and lack-lustre skin. The real problem area though is the lips. They are dry, flaky, with skin dangling off sometimes with an open bleeding wound.
Desktop Bottom Promotion