For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎండకు కమిలిన చర్మానికి సింపుల్ అండ్ ఈజీ టిప్స్

By Swathi
|

సమ్మర్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని సన్ స్క్రీన్ లోషన్స్ వాడినా.. చర్మం నిర్జీవంగా, కమిలిపోయినట్టు ఉంటుంది. ఇక బయట తిరిగేవాళ్ల సంగతి చెప్పనక్కరలేదు. చాలా వేడిగా తాకే సూర్యకిరణాల కారణంగా.. చర్మం నల్లగా మారిపోతుంది. పెచ్చులు పెచ్చులుగా ఏర్పడినట్టు ఉంటుంది.

ఇక వేసవిలో ఎండతీవ్రతను తట్టుకోలేక కొంతమంది బీచ్ లు, పిక్ నిక్స్ అంటూ షికార్లకు వెళ్తారు. వెళ్లడం, ఎంజాయ్ చేయడం వరకు బాగానే ఉంటుంది. కానీ.. ఎండతీవ్రతకు చర్మంపై తీవ్ర దుష్ర్పభావం పడుతుంది. వెంటనే.. చర్మంపై నల్లటి ప్యాచ్ లు ఏర్పడతాయి. కాబట్టి.. ఎండకు కమిలిని చర్మాన్ని ట్రీట్ చేయడానికి క్రీముల కంటే.. సింపుల్ హోం రెమిడీస్ ఫాలో అవడం మంచిది. ఇవి న్యాచురల్ గా మీ స్కిన్ టోన్ ని మెరుగుపరుస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే.. ఆ బ్యూటీ టిప్స్ చూసేద్దాం..

చల్లటి నీటి స్నానం

చల్లటి నీటి స్నానం

ఎండకు కమిలిన చర్మాన్ని ట్రీట్ చేయడానికి ఇది చక్కటి పరిష్కారం. రోజుకి రెండుసార్లు చల్లని నీటితో.. స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

బంగాళదుంపలు

బంగాళదుంపలు

పచ్చి బంగాళదుంపల రసం తీసి.. ఎండకు కమిలిన చర్మంపై రాసుకుంటే.. త్వరిత ఉపశమనం పొందవచ్చు.

అలోవెరా

అలోవెరా

అలోవెరాలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలుంటాయి. కాబట్టి అలోవెరా జెల్ ని ఫ్రిడ్జ్ పెట్టుకుని.. తరచుగా.. చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మ సమస్యలు నివారించవచ్చు.

కూల్ మిల్క్

కూల్ మిల్క్

చల్లటి పాలు ఎండకు కమిలిన చర్మానికి సింపుల్ టిప్. కాబట్టి సన్ బర్న్ అయిన ప్రాంతంలో కూల్ మిల్క్ లో ముంచిన టవల్ తో మసాజ్ చేసుకుంటే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

దోసకాయ

దోసకాయ

కొన్ని దోసకాయ ముక్కలు తీసుకుని.. మిక్సీలో వేయాలి. ఈ మిశ్రమాన్ని ఎండకు కమిలిన చర్మానికి అప్లై చేస్తే.. వెంటనే ఉపశమనం పొందవచ్చు.

పుదీనా

పుదీనా

పుదీనా.. న్యాచురల్ కూలింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. కాబట్టి.. రోజూ ఒక గ్లాసు మింట్ జ్యూస్ తీసుకుంటే మంచి ఫలితం పొందవచ్చు.

వెనిగర్

వెనిగర్

ఒక కాటన్ బాల్ తీసుకుని వెనిగర్ లో ముంచి తీసి... చర్మానికి రాసుకుంటే.. కమిలిన చర్మాన్ని నివారించి.. గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు.

బ్లాక్ టీ

బ్లాక్ టీ

బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కొన్ని చుక్కల బ్లాక్ టీని కమిలిన చర్మానికి అప్లై చేస్తే వెంటనే పరిష్కారం ఇస్తుంది.

ఓట్ మీల్ బాత్

ఓట్ మీల్ బాత్

ఎండకు కమిలిన దురద పుట్టించే చర్మానిిక ఓట్ మీల్ బాత్.. చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. కాబట్టి.. రోజుకి ఒకసారైనా.. ఓట్ మీల్ బాత్ చేయండి.

సన్ స్క్రీన్

సన్ స్క్రీన్

కమిలిన తర్వాత సన్ స్క్రీన్ లోషన్ రాయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి.. బయటకు వెళ్లాల్సిన వచ్చినప్పుడు ముందుగా.. సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేస్తే... మంచి ఫలితం పొందవచ్చు.

English summary

10 Tips to get rid of sunburn: Simple tips to get rid of Sunburn

10 Tips to get rid of sunburn: Simple tips to get rid of Sunburn. Here are a few remedies to get rid of the sunburn naturally.
Desktop Bottom Promotion