Just In
- 5 hrs ago
Today Rasi Phalalu :ఓ రాశి నిరుద్యోగులు ఈరోజు మరింత కష్టపడాలి..!
- 15 hrs ago
Vastu Tips:నిద్రించే వేళ ఇవి అస్సలు దగ్గర ఉంచుకోవద్దు...! ఎందుకంటే చెడు ఫలితాలొస్తాయట...!
- 16 hrs ago
కోవిడ్ సమయంలో భయపెట్టిన మంకీ పాక్స్: ఈ రెండింటి మద్య లక్షణాలు ఇవే..
- 19 hrs ago
స్త్రీలు గర్భస్రావం గురించి మూఢనమ్మకాలు అంటే ఏమిటో తెలుసా? ఇదంతా అపోహా..వాస్తవమా...!
Don't Miss
- News
Texas School Shooting: ఎలిమెంట్రీ స్కూల్లో రక్తపాతం: విద్యార్థులను కాల్చి చంపిన టీనేజర్
- Automobiles
విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?
- Finance
ఐసీఐసీఐ బ్యాంకు గోల్డెన్ ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు పెంపు
- Movies
Anchor Manjusha వీడియో క్లిప్ వైరల్.. టాప్ హీరోయిన్‌కు ఏ మాత్రం తగ్గకుండా స్టెప్పులతో జోరు
- Sports
నిద్రలేని రాత్రులు గడిపా: గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా: కేరీర్లో ఆ ముగ్గురే కీలకం: హార్దిక్ పాండ్యా
- Technology
హువాయి కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది!! ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి...
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చలికాలంలో చర్మం పగుళ్ళను నివారించే సింపుల్ అండ్ బేసిక్ టిప్స్ ..!!
అన్ని సీజన్స్ లో కంటే వింటర్ సీజన్ అంటే చాలా మందికి ఇష్టం ఎందుంటే చలికి ఇల్లు వదలకుండా..హ్యాపిగా విశ్రాంతి తీసుకోవచ్చు అనుకుంటారు. అలాగే బాగా నిద్రపోవడానికి కూడా ఇదే మంచి సీజన్ అనే భావిస్తారు. ఈ సీజన్ లో బ్యూటీ అండ్ హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు కలిగి ఉండాలి. వింటర్ సీజన్ లో ముఖం, కాళ్ళ, చేతుల్లో పగుళ్ళు, పెదాలు పగడం వంటి లక్షణాలు కనబడుతాయి . అందుకే వింటర్ సీజన్ లో స్కిన్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
వింటర్ లో చర్మ సంరక్షణ కోసం, చర్మం డ్రైగా మారకుండా ...అందంగా కనబడుట కోసం తీసుకోవల్సిన జాగ్రత్తలు..కొన్ని బేసిక్ టిప్స్ ఈ క్రింది విధంగా అందిస్తున్నాము.

క్లెన్సింగ్ :
వింటర్ బేసిక్ టిప్స్ లో ప్రధానమైనది క్లెన్సింగ్, మిగిలిన సీజన్స్ లో కంటే వింటర్ సీజన్లో క్లెన్సింగ్ చాలా అవసరం. . అయితే వింటర్ సీజన్ లో క్లెన్సింగ్ ను లిమిట్ చేయాలి. రోజుకు రెండు మూడు సార్లు ముఖం శుభ్రం చేసుకుంటే చాలు. చల్లటి పాలలో కాటన్ బాల్ డిప్ చేసి ముఖానికి మసాజ్ చేసి చల్లటి నీటితో లేదా గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

స్క్రబ్బింగ్ :
స్క్రబ్బింగ్ అనేది అన్ని సీజన్స్ లో ముఖ్యం. అయితే వింటర్ సీజన్ లో స్ర్కబ్బింగ్ లో కొన్ని మార్పులు చేసుకోవాలి. డైలీ స్ర్కబ్బింగ్ వల్ల చర్మం మరింత డ్రైగా మారుతుంది. కాబట్టి వారంలో మన్నికైన స్ర్కబ్బర్ తో ఒకటి రెండు సార్లు చేసుకుంటే చాలు. ముఖ్యంగా కెమికల్ స్క్రబ్బర్ కంటే ఫ్రూట్ స్క్రబ్ ఎంపిక చేసుకోవడం మంచిది.
బాగా పండిన అరటిపండు గుజ్జు 2 టేబుల్స్ స్పూన్లు, మ్యాష్ చేసి ఆపిల్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఒక టేబుల్ స్పూన్ తేనెను ఒక బౌల్లో వేసి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అప్లై చేసి సర్క్యులర్ మోషన్ లో మర్ధన చేయాలి.యాంటీ సర్క్యులర్ మోషన్ లో 2 నిముషాలు మర్ధన చేసిన తర్వాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

టోనింగ్ :
వింటర్లో కూడా టోనింగ్ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఏజింగ్, సాగింగ్ స్కిన్ నివారించుకోవడానికి టోనింగ్ తప్పనిసరి. లేదంటే వింటర్లో కూడా చర్మంలో స్కిన్ పోర్స్ ఓపెన్ అయ్యి, ఆయిల్ ఉత్పత్తి అవుతుంది.

మాయిశ్చరైజింగ్ :
మాయిశ్చరైజర్ కేవలం డ్రైగా, ఫ్లాకీగా ఉన్న చర్మానికి మాత్రమే కాదు, అన్ని రకాల చర్మ తత్వాలకు అవసరం. నేచురల్ మాయిశ్చరైజర్ అయిన బాదం లేదా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ను ఎంపిక చేసుకోవడం మంచిది. వీటిని రాత్రి నిద్రించే ముందు అప్లై చేస్తే మరింత మంచిది. ఆల్టర్నేట్ గా నార్మల్ కోల్డ్ క్రీమ్స్ లేదా లోషన్స్ కు ఆయిల్ మిక్స్ చేసుకోవచ్చు.

కొన్ని రకాల ఫేస్ ప్యాక్స్ కూడా అవసరం అవుతాయి:
ఫేస్ ప్యాక్స్ కోసం వంటగదిలో బోలెడు నేచురల్ పదార్థాలున్నాయి. ఇది ఫేషియల్ స్కిన్ సాప్ట్ గా మరియు సపెల్ గా మారడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వింటర్ సీజన్ లో గ్రేట్ గా సహాయపడుతుంది.

అవొకాడో ఫేస్ ప్యాక్ :
అవొకాడో ఫేస్ ప్యాక్ లో మాయిశ్చరైజింగ్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇది కేవలం చర్మానికి మాత్రమే కాదు , జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. బాగా పండిన అవొకాడో ఫ్రూట్ ను గుజ్జు తీసుకుని, ముఖానికి మాస్క్ వేసుకోవాలి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకుని, మాయిశ్చరైజర్ లేదా టోనర్ ను అప్లై చేసుకోవాలి.

బనానా ఫేస్ మాస్క్ :
బనానా ఫేస్ మాస్క్ గ్రేట్ మాయిశ్చరైజర్ . 5 టేబుల్ స్పూన్ల మ్యాష్ చేసిన అరటిపండు గుజ్జు తీసుకుని ముఖానికి అప్లై చేసి, మసాజ్ చేయాలి. 15నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకుని , తేనెను ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇది చర్మానికి ఎక్స్ ట్రా మాయిశ్చరైజింగ్ లక్షణాలను అందిస్తుంది.

బట్టర్ మిల్క్ ప్యాక్ :
మలై లేదా బట్టర్ మిల్క్ ను ఉపయోగించవచ్చు. వీటిలో చిటికెడు పసుపు మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

అలోవెర:
కలబంద అద్భుతమైన మాయిశ్చరైజింగ్ గుణాలున్నాయి. అలోవెరాను ఫేషియల్ మాయిశ్చరైజింగ్ గా ఉపయోగించుకోవచ్చు. ముఖంలో డ్రైనెస్ ను తగ్గించడానికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది చర్మంను సాప్ట్ గా మార్చుతుంది.

హైడ్రేషన్ :
రోజూ, మన శరీరానికి సరిపడా నీరు తప్పనిసరిగా తాగాలి. చలికాలంలో దాహం వేయడం లేదని నీళ్ళు తాగడం తగ్గించుకూడదు. డ్రై వెదర్ లో స్కిన్ హైడ్రేషన్ చాలా అవసరం.

సన్ స్క్రీన్ :
చలికాలంలో ఎండ పడుటలేదు, చర్మానికి ఎలాంటి హాని జరదు అనుకోవడం చాలా పొరపాటు, ఎండ తీవ్రత తక్కువ ఉన్నా, మేగాల మద్యనుండి చొచ్చుకు వచ్చే, కంటికి కనబడని యూవి కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి, కాబట్టి, వింటర్ లో కూడా సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా ఉపయోగించాలి.