For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్ సన్ టాన్ నివారించే హోం మేడ్ ఫేస్ ప్యాక్స్

|

ప్రతి సీజన్ లో చర్మానికి రక్షణ కల్పించడం చాలా ముఖ్యం, వేసివి కాలం రాబోతోంది. ఈ వేసవికాలంలో చర్మం మీద డైరెక్ట్ uv కిరణాలు, మరియు దుమ్మ ధూళి వల్ల చర్మానికి హాని కలుగుతుంది. అంతే కాదు వేసవిలో ఎండల వల్ల వచ్చే చమటతో కూడా చర్మం పాడవుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా చర్మం మీద తగినంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

వేసవిలో వేడి చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. చర్మం కమిలిపోవడం..స్నానం చేసిన గంటకే తాజాదనం తగ్గి శరీరం వడిలిపోయినట్లు అవడం..లాంటి సమస్యలు ఓన్నో అలాంటి వాటిని అదుపులో ఉంచి చర్మం తాజాదంన సంతరించుకునేలా చేయాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

వేసవి సీజన్ లో పెరుగు తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు

ఎండాకాలం వేధించే అతి పెద్ద సమస్య...'సన్‌ ట్యాన్‌'. సన్ స్క్రీన్ లోషన్లు, గొడుగులు, దుపట్టాలు...ఇలా ఎన్ని వాడుతూ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎండకు చర్మం నల్లగా తయారవటం మానదు. ఇలాంటప్పుడు క్రమం తప్పకుండా ఆ ట్యాన్‌ను తొలగించే ఫేస్‌ ప్యాక్స్‌ వేసుకుంటూ ఉండాలి.

కూలింగ్ వస్తువులతో తాజా ఫేస్ ప్యాక్స్ వల్ల వేసవి టాన్ మరియు ఇతర చర్మ సమస్యల నుండి బయట పడటానికి సహాయపడుతుంది. మరి చర్మానికి చల్లదనాన్ని కల్పించి సూర్యుని తాపం నుండి రక్షణ పొందడానికి అనేక ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి.

వేసవిలో చర్మం నల్లబడకుండా కాపాడుకోవడం ఎలా..?

సన్‌ ట్యాన్‌ ఎందుకొస్తుందంటే?
అందరి చర్మంలో మెలనిన్‌ ఉంటుంది. ఇదే చర్మానికి రంగునిస్తుంది. తక్కువ మెలనిన్‌ ఉంటే తెల్లగా, ఎక్కువ మెలనిన్‌ ఉంటే నల్లగా కనిపిస్తాం. మన చర్మంలోని మెలనోసైట్స్‌ అనే కణాలు ఈ మెలనిన్‌ను తయారుచేస్తాయి. ఈ మెలనిన్‌ మన చర్మం అడుగునున్న పొరలు డ్యామేజ్‌ కాకుండా కాపాడుతుంది. ఈ క్రమంలో సూర్యరశ్మిలోని అలా్ట్రవయొలెట్‌ కిరణాల నుంచి చర్మపు లోపలి పొరలను రక్షించటం కోసం చర్మంలో మెలనిన్‌ ఎక్కువగా తయారవుతుంది. దాంతో చర్మం మరింత నల్లగా తయారవుతుంది. ఇలాంటప్పుడు చామనఛాయ రంగు వాళ్లు నల్లగా, తెల్లని చర్మంవాళ్లు ఎర్రగా తయారవుతారు. దీన్నే సన్‌ ట్యాన్‌ అంటుంటాం. దీన్ని పోగొట్టాలంటే కొన్ని ఫేస్‌ ప్యాక్స్‌ వాడాలి.

కుంకుమ పువ్వు, పాలు:

కుంకుమ పువ్వు, పాలు:

4 టే.స్పూన్ల పాలు వేడిచేసి దాన్లో నాలుగు చుక్కల నిమ్మరసం, చిటికెడు కుంకుమ పువ్వు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, చెవులు, మెడలకు పట్టించి ఆరాక చల్లని నీళ్లతో కడిగేయాలి. తర్వాత మాయిశ్చరైజర్‌ రాయాలి.

టమేటా ప్యాక్‌:

టమేటా ప్యాక్‌:

ఒక టమేటాను తరిగి దానికి ఒక టే.స్పూను పాలు చేర్చి కలపాలి. దీన్లో ఒక టీస్పూను పసుపు, నాలుగు చుక్కల నిమ్మరసం, ఒక టీస్పూను తేనె వేసి బాగా కలిపి పట్టించాలి. ఆరాక చల్లని నీటితో కడిగేసుకోవాలి.

 శనగపిండి ప్యాక్‌:

శనగపిండి ప్యాక్‌:

రెండు టే.స్పూన్ల శనగపిండికి చిటికెడు పసుపు, అర టీస్పూను నారింజ తురుము, ఒక టీస్పూను రోజ్‌ వాటర్‌ వేసి కలిపి పట్టించాలి. 20 నిమిషాలు ఆగి ఆరిపోయిన ప్రదేశాల్లో రోజ్‌ వాటర్‌ చిలకరించాలి. తర్వాత వేళ్లతో సున్నితంగా రుద్దుతూ ప్యాక్‌ తొలగించి కడిగేసుకోవాలి. ఇలా రెండు రోజులకోసారి చేయాలి.

అలోవేరా ప్యాక్‌:

అలోవేరా ప్యాక్‌:

అలోవేరా గుజ్జుకు నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి పట్టించి ఆరాక కడిగేసుకోవాలి. అలోవేరా మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది కాబట్టి ప్యాక్‌ కడిగేశాక మాయిశ్చరైజర్‌ వాడాల్సిన అవసరం లేదు.

క్యాబేజీ ప్యాక్‌:

క్యాబేజీ ప్యాక్‌:

క్యాబేజీ మిక్సీలో వేసి గుజ్జుగా తయారుచేసుకోవాలి. దీనికి నాలుగు చుక్కల నిమ్మరసం, ఒక టీస్పూను తేనె, రెండు టీస్పూన్ల శనగపిండి, చిటికెడు పసుపు చేర్చి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని అప్లై చేసి 20 నిమిషాలాగి కడిగేసుకుని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.

చందనం:

చందనం:

గంధం పొడిని పాలతో కలిపి వారానికి మూడు సార్లు ముఖానికి రాసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అదే జిడ్డు చర్మతత్వం ఉన్న వాళ్ళు గులాబీనీటిలో కలిపి వాడుకోవచ్చు. గంధం నూనెను రెండు చుక్కలు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే శరీరం పరిమిళ భరితం అవుతుంది.

పుచ్చకాయ:

పుచ్చకాయ:

దీన్ని ప్రతి రోజూ తింటే శరీరం చల్లగా ఉంటుంది. ఇందులో పీచుపదార్థం ఎక్కువ కాబట్టి శరీరంలోని మిలినాల్నీ వెలుపలికి వచ్చేస్తాయి. పుచ్చకాయను పెద్ద ముక్కలా తరిగి దాన్ని తేకెలో ముంచి ముఖానికి రాసుకుని రెండు నిమిషాలు మర్దన చేస్తే సరిపోతుంది. చర్మం తాజాగా మారుతుంది. అలాగే పుచ్చకాయ పలుచని ముక్కల్లా కోసి ముఖంపై అద్ది కొద్దిగా వేడిగా ఉన్న వస్త్రాన్ని కప్పి ఉంచాలి. రెండు నిమిషాలయ్యాక తీసేస్తే చర్మం సహజ కాంతిని సంతరించుకుంటుంది.

కీరదోస:

కీరదోస:

దీన్ని ప్రతి రోజూ తింటే శరీరానికి పీచు పుష్కలంగా అందుతుంది. సల్ఫర్, పొటాసియం, బాకంప్లెక్స్ విటమిన్లు ఇందులో పుష్కలం. కీరతో కళ్లనే కాదు చర్మాన్నీ మెరిపంచవచ్చు. కీరదోసను తురిమి ముఖానికి అద్దినట్లు చేయాలి. మపదినిషాలయ్యాక తీసేయాలి. దీని వల్ల మరింత మేలు జరగాలంటే కొద్దిగా తేనె కూడా కలిపి పూతలా వేసుకోవచ్చు. కీరదోస రసాన్ని సున్ని పిండిలో కలిపి నలుగు పెట్టుకుంటే చర్మం అందంగా తయారవుతుంది.

బొప్పాయితో ఫేస్ ప్యాక్:

బొప్పాయితో ఫేస్ ప్యాక్:

బొప్పాయి గుజ్జులో అర టీ స్పూన్ ఓట్స్ పొడి, అర టీ స్పూన్ తేనె, అయిదారు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి పట్టించి అరగంట పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపైన జిడ్డు తగ్గి చర్మం కోమలంగా ఉంటుంది.

క్యారెట్ తో ఫేస్ ఫ్యాక్:

క్యారెట్ తో ఫేస్ ఫ్యాక్:

క్యారట్‌ ను ఉడకబెట్టుకుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దానిలో నాలుగు టీ స్పూన్ల తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ఆయిలీ స్కిన్ వారికే కాక నార్మల్ స్కిన్ వారికి కూడా పనిచేస్తుంది. క్యారట్ ఫేస్ ప్యాక్‌ ని సమయం దొరికినప్పుడల్లా ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

తేనె:

తేనె:

తేనెను ఎగ్ వైట్ తో కానీ లేదా ఇతర స్కిన్ కేర్ వస్తువులతో కానీ, మిక్స్ చేసినప్పుడు, తేనెలో అనేక స్కిన్ కేర్ బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి. ఇది చర్మానికి మాయిశ్చరైజర్ గా మరియు డార్క్ పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది మరియు చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. దీన్ని మీ హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ లో చేర్చుకొని ఈ సమ్మర్ సీజన్ లో ఉపయోగించండి.

English summary

11 Best Home Remedies to Remove Sun Tan Naturally

The skin, due to exposure to the harsh sun becomes dry and dehydrated. Here are face packs that can be made at home...
Story first published: Tuesday, March 8, 2016, 18:14 [IST]
Desktop Bottom Promotion