For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి వేపతో 12 ఫేస్ మాస్కులు..!

|

వేపాకు ఓ ఔషద మొక్క. వేపాకును మించిన ఔషధమేదీ లేదని మనం తరచూ వింటూనే ఉంటాం. ఇది చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుందన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఎన్నో రకాల ఔషద గుణాలున్న వేపాకులతో చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. యాంటీ సెప్టిక్ లక్షణాలు కలిగి ఉన్న వేపాకు మంచి ఆస్ట్రిజెంట్ గా కూడా పనిచేస్తుంది. జిడ్డు స్వభావంతో ఉండే చర్మం కలిగినవారికి వేపాకు అద్భుతంగా పనిచేస్తుంది.

దీనిలో ఉండే యాంటిసెప్టిక్‌ గుణాలు గాయాలను పెరగకుండా, వాటివలన చర్మానికి ఎటువంటి హాని జరగకుండా కాపాడతాయి. అంతేకాకుండా విషజ్వరాలను అదుపుచేయగల శక్తిని కూడా వేపాకు కలిగి ఉంటుంది. కమిలిన, ఎర్రగా కందిపోయిన చర్మానికి వేపాకు ఇట్టే ఉపశమనాన్ని ఇస్తుంది. చర్మానికి ఎంతో చల్లదనాన్ని కూడా ఇస్తుంది. కొన్ని జ్వరాలు వచ్చి తగ్గాక వేపాకును స్నానానికి వాడటం మన సంప్రదాయంలో గమనించవచ్చు.

ఇది చర్మసౌందర్యానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పా లంటే మహిళల చర్మతత్వానికి సరిపడే లక్షణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ముఖంపై ఎటువంటి చర్మసంబంధ సమస్యలు తలెత్తినా వాటి నివారణకు వేపాకు ఎంతగానో ఉపకరిస్తూ సౌందర్య సాధనంలా పనిచేస్తుంది. ముఖానికి నునుపైన మెరిసే ఛాయను ఇస్తుంది. వేపతో తయారుచేసిన సౌందర్యసాధనాలు కూడా మనకు మార్కెట్లో ఎక్కువగా లభిస్తుంటాయి.

మార్కెట్లో అందుబాటులో ఉండే నీమ్ హెర్బల్ మాస్క్ కంటే మనం ఇంట్లో తయారుచేసుకోగల బేసిక్ హెర్బల్ మాస్క్ తో క్లియర్ స్కిన్ పొందవచ్చు. వేపఆకుతో పాటు ఇతర సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించి ఎలా తయారుచేసుకోవాలి, ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం...

వేప - రోజ్ వాటర్ :

వేప - రోజ్ వాటర్ :

ఈ మాస్క్ వేసుకోవడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంలో ఉండే ఎలాంటి మార్పులునైతనా తొలగిస్తుంది.

ఎలా పనిచేస్తుంది: వేప ఆకులను ఎండ బెట్టి, పొడి చేసుకోవాలి. అవసరమైనప్పుడు ఇందులో కొద్దిగా రోజ్ పౌడర్ మిక్స్ చేసిపేస్ట్ లా చేసుకుని ముఖానికి మెడకు అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

వేప-శెనగపిండి-పెరుగు:

వేప-శెనగపిండి-పెరుగు:

వేప-శెనగపిండి-పెరుగు:

ఈ మాస్క్ వల్ల ముఖం చర్మంలో మొటిమలు తగ్గిపోతాయి, మొటిమల తాలూకు మచ్చలు తొలగిపోయి రేడియంట్ స్కిన్ అందిస్తుంది.

ఎలా పనిచేస్తుంది:

ఒక టేబుల్ స్పూన్ శెనగపిండిని వేప పొడిలో మిక్స్ చేయాలి. అలాగే పెరుగు కూడా మిక్స్ చేసి ముఖానికి మాస్క్ వేసుకోవాలి. 15 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి ఈ ఫేస్ మాస్క్ వల్ల బెస్ట్ రిజల్ట్ పొందుతారు.

వేప- గందం -పాలు :

వేప- గందం -పాలు :

ఈ మూడింటి మిశ్రమంలో వేసుకునే ఫేస్ మాస్క్ వల్ల స్కిన్ టోనింగ్ పెరుగుతుంది, క్లియర్ యండ్ సపెల్ స్కిన్ పొందుతారు

ఎలా పనిచేస్తుంది:

ఒక టేబుల్ స్పూన్ గందంలో ఒక టీస్పూన్ వేప పొడి , కొద్దిగా పచ్చిపాలు వేసి మిక్స్ చేయాలి. పేస్ట్ లా తయారైన తర్వాత దీన్ని ముఖం, మెడకు అప్లై చేయాలి. అర గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

వేప-తేనె:

వేప-తేనె:

మరో హోం మేడ్ నీమ్ ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ వల్ల చర్మ కాంతివంతంగా మారుతుంది. అలసిన చర్మం ప్రకాశవంతంగా మార్చుతుంది. చర్మంలో ఆయిల్ ప్రొడక్షన్ ను కంట్రోల్ చేస్తుంది.

ఎలా పనిచేస్తుంది:

వేపఆకులను మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేయాలి. దీన్ని ముఖం మెడకు అప్లై చేిసన అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

వేప -బొప్పాయి:

వేప -బొప్పాయి:

ఈ రెండింటి కాంబినేషన్ ఫేస్ మాస్క్ లో ఎంజైమ్స్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. మొటిమలను నివారిస్తుంది. చర్మం కాంతివంతంగా మార్చుతుంది.

ఎలా పనిచేస్తుంది: బాగా పండిన బొప్పాయిని మెత్తగా చేసి, అందులో ఒక టీస్పూన్ వేప పౌడర్ మిక్స్ చేసి, పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత దీన్ని ముఖం , మెడకు అప్లై చేయాలి, అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

వేప-టమోటో :

వేప-టమోటో :

ఈ మాస్క్ లో బీటా కెరోటీన్స్ అధికంగా ఉంటాయి. టమోటోల్లో ఉండే లైకోపిన్స్ చర్మంలో ఫ్రీరాడికల్స్ ను కు వ్యతిరేకంగా పోరాడుతుంది, స్కిన్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది. స్కిన్ టాన్ ను తొలిగిస్తుంది.

ఎలా పనిచేస్తుంది: టమోటోను మెత్తగా గుజ్జులా చేసిన అందులో కొద్దిగా వేప పౌడర్ మిక్స్ చేసి, ఫేస్ కు అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మం లో టాన్ తొలగిపోతుంది. క్లియర్ స్కిన్ పొందవచ్చు .

వేప-తులసి-తేనె:

వేప-తులసి-తేనె:

ఈ హెర్బల్ నీమ్ మాస్క్ చర్మంలో మురికిని తొలగిస్తుంది, మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాన్ నాశనం చేస్తుంది. చర్మంను హెల్తీగా మార్చుతుంది.

ఎలా పనిచేస్తుంది: గుప్పెడు తులసి ఆకులకు కొద్దిగా వేపఆకులు చేర్చి ఎండలో ఎండబెట్టాలి. ఈ రెండింటి పొడి చేసుకుని నిల్వ చేసుకోవాలి. అవసరమయినప్పుడు ఒక టేబుల్ స్పూన్ తేనె , ఒక టేబుల్ స్పూనె వేప తులసి పౌడర్ మిక్స్ చేసి, పేస్ట్ లా చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

 వేప-పెరుగు-పసుపు:

వేప-పెరుగు-పసుపు:

పెరుగులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ మరియు పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షనాలు ఆయిల్ ను కంట్రోల్ చేస్తాయి. చర్మంను క్లియర్ గా మార్చి, చర్మంలో మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. ఇది స్కిన్ సాప్ట్ గా మరియు స్మూత్ గా మార్చుతుంది.

ఎలా పనిచేస్తుంది: ఒక టేబుల్ స్పూన్ వేప పౌడర్ లో ఒక టేబుల్ స్పూన్ పెరుగు మిక్స్ చేయాలి. అందులో చిటికెడు పసుపు మిక్స్ చేసి , ముఖం మెడకు అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

వేప-ఆపిల్ సైడర్ వెనిగర్-తేనె:

వేప-ఆపిల్ సైడర్ వెనిగర్-తేనె:

ఈ ఆయుర్వేదిక్ వేప ఫేస్ మాస్క్ చర్మంలో మొటిమలను మచ్చలను నివారిస్తుంది. స్కిన్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది. ఒక వారంలో చర్మకాంతిలో మార్పు తీసుకొస్తుంది.

ఎలా పనిచేస్తుంది:

ఒక టీస్పూన్ వేప పౌడర్ కు, ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసి, పేస్ట్ లా చేయాలి. దీన్ని ముఖం, మెడకు అప్లై చేసి అరగంట తర్వాత శుబ్రం చేసుకోవాలి.

వేప-రైస్ వాటర్ -రోజ్ పెటల్స్ -బాదం ఆయిల్ :

వేప-రైస్ వాటర్ -రోజ్ పెటల్స్ -బాదం ఆయిల్ :

ఈ కాంబినేషన్ హోం మేడ్ ఫేస్ ప్యాక్ లో బ్లీచింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి , ఇది చర్మంను ఫెయిర్ గా , క్లియర్ గా మరియు టైట్ గా మార్చుతుంది.

ఎలా పనిచేస్తుందిం

5 వేపఆకులను తీసుకుని , గుప్పెడు రోజాపువ్వు రేకులను తీసుకుని 5 చుక్కల బాదం ఆయిల్ ,కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ ను ముఖం మెడకు అప్లై చేసి 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

వేప-బంగాళదుంప-నిమ్మరసం:

వేప-బంగాళదుంప-నిమ్మరసం:

ఈ వేప ఫేస్ ప్యాక్ లో యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మొటిమలను డ్రైగా మార్చుతాయి. స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. చర్మ రంద్రాలు ముడుచుకునేలా చేస్తాయి.

ఎలా పనిచేస్తుంది: బంగాళ దుంపను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నీరు వంపేసి, అందులో ఒక స్పూన్ నిమ్మరసం , ఒక టీస్పూన్ వేప పౌడర్ మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. ఇందులో కాటన్ బాల్ డిప్ చేసి స్కిన్ కు అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత ముఖంను శుభ్రం చేసుకోవాలి.

వేప -అలోవెర:

వేప -అలోవెర:

క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి మరో సింపుల్ నీమ్ ఫేస్ ప్యాక్ . ఈ మాస్క్ చర్మంలో మలినాలను తొలగిస్తుంది. ఇన్ స్టాంట్ గా చర్మంను కాంతివంతంగా మార్చుతుంది. క్లియర్ చేస్తుంది. ఎలా పనిచేస్తుంది: ఒక టీస్పూన్ వేప పౌడర్ లో 2 టేబుల్ స్పూన్ల అలోవెర జెల్ ను మిక్స్ చేసి, కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకుని డ్రై అయిన తర్వాత మసాజ్ చేసి , చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మంలో మలినాలు తొలగిపోతాయి. చర్మం క్లియర్ గా మార్చుతంది.

English summary

12 Homemade Neem Face Masks For Clear Skin

From the pus-filled pimples, acne scars, oily T-zone to age-spots, just about all your skin problems can be taken care of with homemade neem face masks. To understand how it works, you need to first understand its therapeutic properties.
Desktop Bottom Promotion