Latest Updates
-
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి!
పచ్చిపాలలో అమేజింగ్ స్కిన్ బ్యూటీ సీక్రెట్స్: వైట్ స్కిన్ మీ సొంతం...
ప్రతిరోజూ నిద్ర లేవగానే పాలతో తయారయ్యే టీనో, కాఫీనో, లేదంటే ఏకంగా పాలే తాగందే ఆ రోజు ఆరంభమవదు కొందరికి. పాలతో ఎముకకు బలం, వ్యాధి నిరోధక శక్తి వృద్ది చెందుతుంది. డీహైడ్రేషన్, ఊబకాయం, ఆస్టియోపోరోసిన్ వంటి సమస్యలకు పరిష్కారమూ లభిస్తుంది. వీటిలో ఇలాంటి ఔషధ గుణాలే కాదు, అందాన్ని ద్విగుణీకృతం చేసే మరెన్నో సుగుణాలు కలిసి ఉంటాయి.
పాలల్లో ఉండే పోషకాలు, విటమిన్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. అయితే ఈ పాలు అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో కూడా అంతే శక్తివంతమైనవి అంటున్నారు సౌందర్య నిపుణులు. ఖరీదయిన సౌందర్య ఉత్పత్తులకు బదులుగా ఆవు పాలను వాడి చూడండి అద్భుతమైన మార్పు కనిపించడం ఖాయమంటున్నారు వాళ్లు. బహుశా ఈ సీక్రెట్ తెలిసే కాబోలు కొన్ని శతాబ్దాల క్రితమే ఈజిప్టు అందాల రాశి చర్మ సౌందర్యం కోసం పాలతో స్నానం చేసింది! పచ్చిపాలతో పొందే బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం..

క్లెన్సర్:
ముఖం మీది దుమ్ము, మేక్‌పలను తొలగించేందుకు క్లెన్సర్‌కి బదులుగా ఆవుపాలు వాడితే ఫలితం బాగుంటుంది. పచ్చి పాలలో దూదిని ముంచి ముఖం, మెడ మీద సున్నితంగా రుద్ది శుభ్రం చేయాలి. ఆ తరువాత గోరు వెచ్చటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేస్తే తేడా మీకే తెలుస్తుంది.

మాయిశ్చరైజర్:
పొడి చర్మం గల వాళ్లకి ఆవుపాలు మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. లోషన్లు, మాయిశ్చరైజర్లు చర్మానికి పట్టించే బదులు అరటిపండు గుజ్జులో చల్లటి పచ్చి పాలను పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద రాసుకుని అరగంట తరువాత కడుక్కోవాలి. రెండు రోజులు వరసగా ఇలా చేస్తే ఫలితం కనిపిస్తుంది.

స్క్రబ్:
ఖరీదైన సౌందర్య సాధనాలను, ఆల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్ ఉన్న యాంటీ ఏజింగ్ క్రీమ్‌లు వాడే బదులు ఆవు పాలు వాడితే చాలు. ఎందుకంటే ఈ పాలల్లో కూడా ఆల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్ ఉంటుంది. పాలు, తేనె, సీసాల్ట్‌లను కలిపితే సహజసిద్ధమైన స్క్రబ్ సిద్ధం. వారానికి రెండు సార్లు ఈ స్క్రబ్‌తో మర్దనా చేస్తే మెరిసే చర్మం సొంతమవుతుంది.

పాలు-రోజ్ వాటర్:
చర్మాన్ని పాలతో శుభ్రపరచటం. ఇది చాలా సులభమైన పద్దతి. అందుకు చేయాల్సిందల్లా పాలలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను కలిపి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత ముఖంను సర్కులర్ మోషన్ లో రెండు మూడు నిముషాలు మర్ధన చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేసి చర్మాన్ని శుభ్రం చేస్తుంది.

ఓట్ మీల్- మిల్క్ స్ర్కబ్ క్లెన్సర్:
ఇది స్ర్కబ్ మరియు క్లెన్సర్ రెండూ. మీకు టైం లేనప్పుడు ముఖాన్ని స్ర్కబ్ చేయాలనుకొంటే, ఈ పద్దతి చాలసులభం మరియు ఒక్క నిమిషంలో చాలు. ఓట్ మీల్ పౌడర్ తీసుకొని దానిక పాలు మిక్స్ చేసి, మెత్తని పేస్ట్ లా చేసి ముఖానకి అప్లై చేయాలి తర్వాత ముఖాని పట్టించి ఒక నిముషం పాటు బాగా మర్ధన చేస్తే చాలు, ముఖాన్ని శుభ్రం చేసి, చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

పాలు-తేనెతో క్లెన్సింగ్:
తేనెలో అధికంగా యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల కొద్దిగా తేనె చర్మాన్ని శుభ్రం చేసి ముఖాన్ని ప్రకాశించేలా చేస్తుంది. ఒక్క పాలను మాత్రమే అప్లే చేసేకంటే కొద్దిగా తేనె చేర్చి ముఖాన్నికి పట్టించి మసాజ్ చేయడం వల్ల ముఖంలో మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. అందుకు కొద్దిగా నిమ్మరసం కూడా జోడించాలి.

పాలు-పపాయ క్లెన్సర్:
పపాయలోని ఎంజైమ్స్ చర్మాన్ని ప్రకాశించేలా చేసి, డెడ్ స్కిన్ ను అతిసులభంగా తొలగిస్తుంది. మీరు, క్లెన్సింగ్ అప్లై చేయడానికి చాలా బద్దకంగా ఉన్నట్లైతే పపాయ ముక్కలను పాలలో ముంచి అలాగే ముఖానికి ఐదు నిముషాల పాటు మర్ధన చేయవచ్చు. దాంతో చర్మం ఫ్రెష్ గా మెరుస్తుంటుంది.

పాలు - క్యారెట్ జ్యూస్ క్లెన్సర్:
క్యారెట్స్ లో ఉన్న బీటా కెరోటిన్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. ఈ క్యారెట్ ను ఉపయోగించడం వల్ల చర్మ తాజాగా మెరిసేలా చేసి ముఖంలో ముడుతలను పోగొడుతుంది.ఫేషియల్ క్లెన్సర్ కు మీరు క్యారెట్ రసంలో పాలు, కొద్దిగా పెరుగు కూడా చేర్చి ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి పది నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. అంతే ఈ క్లెన్సర్స్ చర్మ సంరక్షణకు బాగు ఉపయోగపడుతాయి. మీరు కూడా ప్రయత్నించి చూడండి..

పసుపు మిశ్రమం చర్మంలో నునుపు కలిగించడంతో పాటు నలుపు రంగును దూరం చేస్తుంది.
పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టాలి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. రోజూ ఒక దూది పింజను తీసుకొని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పచ్చిపాలు, పసుపు మిశ్రమం చర్మంలో నునుపు కలిగించడంతో పాటు నలుపు రంగును దూరం చేస్తుంది.

పాదాలకు స్పా:
పాలు, నీళ్లు కలిపి గది ఉష్ణోగ్రత కంటే కాస్త ఎక్కువ వేడి చేయాలి. అంటే పాదాలు భరించేంత వేడిగా అన్నమాట. ఆ నీళ్లలో పాదాలు పెట్టి రిలాక్స్ అయ్యాక పాదాలపై ఉన్న మృత చర్మాన్ని తొలగించాలి.

యాంటీ ఏజింగ్ మాస్క్
పచ్చిపాలతో మాస్క్ వేసుకోవడం, లేదా స్నానం చేయడం వల్ల వ్రుద్ద్యాప్య చాయలు తొలిపోతాయి. ఏజింగ్ లక్షణాలు కనబడవు

సన్ స్ర్కీన్
పచ్చిపాలను సౌందర్య సాధానంగా ఉపయోగిస్తే చర్మంలో ఫెయిర్ నెస్ పెరుగుతుంది. యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. సన్ స్క్రీన్ గా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications











