Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వర్షాకాలంలో డ్రై స్కిన్ నివారించే న్యాచురల్ ప్యాక్..
భయంకరమైన సమ్మర్ తర్వాత టెంపరేచర్ ని కూల్ చేస్తూ.. వర్షాకాలం వచ్చేసింది. హాట్ వెదర్ కాస్త కూల్ గా మారడంతో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వర్షాకాలం వచ్చే పాజిటివ్ థింక్స్ చాలానే ఉన్నప్పటికీ.. నెగటివ్ ఎఫెక్ట్స్ కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా చర్మంపై దుష్ర్పభావం చాలానే ఉంటుంది.
వాతావరణంలో హ్యుమిడిటీ పెరగడం వల్ల..చర్మం డ్రైగా మారుతుంది. ముఖ్యంగా డ్రై స్కిన్ టైప్ వాళ్లకు సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అదీకాక వర్షాకాలంలో ఎక్కువగా బయటకు వెళ్లాల్సి వస్తే.. వర్షంలో తడవాల్సి ఉంటుంది. తరచుగా వర్షంలో తడవడం వల్ల.. పొల్యూషన్, అపరిశుభ్రమైన నీళ్లు తగిలి చర్మం మాయిశ్చరైజర్ కోల్పోతుంది. దీనివల్ల చర్మం డ్రైగా, అన్ హెల్తీగా మారుతుంది.

అలాంటివాళ్లు వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, హోంమేడ్ రెమెడీ కూడా ప్రయత్నించడం వల్ల డ్రైన్ స్కిన్ నివారించడం తేలికవుతుంది. వర్షాకాలం డ్రై స్కిన్ నివారించే సింపుల్ రెమెడీ మీకోసం..
కావాల్సిన పదార్థాలు
బాగా పండిన అవకాడో 1
కొబ్బరి నూనె 1 టేబుల్ స్పూన్

అవకాడో, కొబ్బరినూనె రెండూ.. చర్మాన్ని న్యాచురల్ గా మార్చి, హైడ్రేట్ చేస్తాయి. డ్రైనెస్ ని నివారించి.. చర్మానికి కావాల్సినంత మాయిశ్చరైజర్ అందిస్తాయి. ఈ రెండింటినీ మిక్స్ చేయడం వల్ల.. మాయిశ్చరైజర్ లెవెల్స్ తో పాటు, పీహెచ్ ని బ్యాలెన్స్ చేస్తాయి. అంటే మీ చర్మం పొడిబారడం తగ్గి.. స్మూత్ అండ్ సాఫ్ట్ గా మారుతుంది. డ్రై ప్యాచెస్ నివారించబడతాయి.

తయారు చేసుకునే విధానం
అవకాడో నుంచి గుజ్జు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
అందులోని ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె కలపాలి.
రెండింటినీ బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సమానంగా.. ముఖంతో పాటు, శరీరంలో ఎక్కడైనా పట్టించుకోవచ్చు.
20 నిమిషాల తర్వాత మైల్డ్ బాడీ వాష్ ఉపయోగించి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
అంతే తరచుగా ఈ ప్యాక్ ట్రై చేస్తే.. డ్రై స్కిన్ దూరమవుతుంది. స్మూత్ గా మారుతుంది.



Click it and Unblock the Notifications