Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఫెయిర్ అండ్ లవ్లీ స్కిన్ పొందడానికి 4 ఆయుర్వేదిక్ రెమెడీస్
అందంగా కనిపించాలని తాపత్రయపడే స్వభావం మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆనాటి నుండి ఈ నాటి వరకూ అందాన్ని మెరుగుపరుచుకోవడానికి మార్కెట్లో చెప్పలేనన్ని బ్యూట్రీప్రొడక్ట్స్, ఫెయిర్ నెస్ క్రీములు అందుబాటులో ఉన్నాయి. అంతే కాదు, రోజుకో కొత్త ఉత్పత్తిని పరిచయం చేస్తున్నారు. మహిళలు ప్రతి ఒక్కరూ అందమైన మరియు కాంతి వంతమైన చర్మం కలిగి ఉండాలని కోరుకుంటారు.
మార్కెట్లో అందుబాటులో ఉండే వివిధ రకాల ఫెయిర్ నెస్ క్రీముల్లో కెమికల్స్ ఎక్కువగా వాడటం వల్ల ఇవి చర్మాన్ని కాంతి వంతంగా మార్చుతాయి. అయితే ఈ క్రీములను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల వీటిలో ఉండే హానికరమైన బ్లీచింగ్ ఏజెంట్స్ చర్మానికి హాని కలిగిస్తాయి .
కాలుష్యం, కెమికల్స్, స్కిన్ టానింగ్, పిగ్మెంటేషన్ వంటివి చర్మ కాంతి మీద ప్రభావం చూపుతాయి. అయితే, ఫెయిర్ అండ్ రేడియంట్ స్కిన్ పొందడం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా సాధ్యం అవుతుంది?
ఇందుకు చక్కటి పరిష్కార మార్గం, ఆయుర్వేదంలో ఉంది. ఆకాలంలో ఉపయోగించిన వివిధ రకాల ఆయుర్వేదిక్ రెమెడీస్ ఫెయిర్ స్కిన్ పొందడంలో గొప్పగా సహాయపడ్డాయి . కాంతివంతమైన చర్మాన్ని అందివ్వడంతో పాటు చర్మాని సంబంధించే అనేక సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడ్డాయి.

బ్యూటిఫుల్స్, గ్లోయింగ్ స్కిన్ పొందడానికి ఆయుర్వేదంలో వివిధ రకాల ఆయుర్వేదిక్ రెమెడీస్ ఉన్నాయి. ఆయుర్వేదంలో దాగున్నా అటువంటి కొన్ని పదార్థాలను ఈరోజు మనం ఉపయోగించి చర్మసౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ను పరిచయం చేస్తున్నారు .
ఆయుర్వేదిక్ హోం రెమెడీస్ క్రమంగా ఉపయోగించడం వల్ల స్కిన్ కాంప్లెక్స్ ను మెరుగుపరుస్తుంది.
గ్లోయింగ్ స్కిన్ పొందడానికి ఉపయోగించే ఆయుర్వేదిక్ హోం రెమెడీ...
పసుపు:
పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి . ఇవి నేచురల్ కాంప్లెక్షన్ లక్షణాలను కలిగి ఉన్నాయి. చర్మంలోమొటిమలు, స్కిన్ టో మరియు స్కిన్ టాన్ నివారించుకోవడానికి పసుపు గొప్పగా సహాయపడుతుంది.
పసుపు ఎలా ఉపయోగించాలి
పసుపును పాలలో మిక్స్ చేసి స్మూత్ పేస్ట్ లా తయారుచేయాలి. ఈ పేస్ట్ ను ముఖం మరియు మెడకు అప్లై చేయాలి. దీన్ని చేతులు, కాళ్ళకు కూడా లేపనంగా రాసుకోవడంవల్ల అందమైన చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు. ఈ హోం రెమెడీని కంటిన్యుగా ఉపయోగిస్తుంటే చర్మంలో నేచురల్ గ్లో వస్తుంది.

ట్రివియ
మన భారతీయ సంప్రదాయంలో వెడ్డింగ్ సెర్మలో దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీన్నే హల్తీ అని కూడా పిలుస్తారు. పసుపును ఇతర ఆయుర్వేదిక్ హెర్బ్స్ తో కలిపి ఉపయోగించుకోవచ్చు . ఈ మిశ్రమాన్ని పెళ్ళికుమార్తె కు అప్లై చేస్తారు . హల్దీని పెళ్ళికుమార్తె , పెళ్లికుమారులిద్దరికి పెళ్లికి ముందు రోజు రాయడం వల్ల వారి చర్మంలో కొత్త కళ, ప్రకాశవంతమైన కళ వస్తుందిజ
కలబంద
ఆయుర్వేదంలో గ్రిత్త్ కుమారి అని పిలుస్తారు, చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడం మాత్రమే కాదు, ఇది నేచురల్ కంప్లెక్షన్స్ బూస్టర్ గా పనిచేస్తుంది.

అలోవెర ఉపయోగించే పద్దతి
అలోవెర మరియు క్రీమ్ రెండు మిక్స్ చేయాలి. అందులో కొద్దిగా పసుపు మిక్స్ చేయాలి. ఈ ప్యాక్ ను ముఖం మరియు మెడకు అప్లై చేయాలి. ఇందులో ఉండే విటమిన్ సి చర్మాన్ని కాంతివంతగా మార్చుతుంది . అలోవెర జెల్ ఫెయిర్ నెస్ క్రీమ్ లా పనిచేస్తుంది, చర్మానికి ఎఫెక్టివ్ గా మాయిశ్చరైజ్ చేస్తుంది.
కుంకుమపువ్వు
కొన్ని వేల సంవత్సరాల నుండి కుంకుమపువ్వును ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో ఇది సుపరిచితం . ఇది ఆహారాలకు మంచి రుచి, వాసన అందిస్తుంది. శతాబ్దాల నాటి కాలంలో యువరాణులు వారి చర్మ సౌందర్యం మెరుగు పరుచుకోవడానికి కుంకుమపువ్వును ఎక్కువగా ఉపయోగించే వారు. కొద్దిగా ఉపయోగించినా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఉపయోగించే పద్దతి
కుంకుమ పువ్వును రాత్రి పాలలో లేదా నీటిలో వేసి నానబెట్టాలి, ఉదయం దీనికి కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్ కలిపాలి. ఈ మిశ్రమాన్ని కాటన్ సహాయంతో చర్మానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
కుంకుమది తైలం
ఈ ఆయుర్వేదిక్ థైలం 16నూనెల మిశ్రమం. దీన్ని ఉపయోగించడం వల్ల చర్మకాంతిని పెంచుతుంది. టాన్ నివారిస్తుంది, రేడియంట్ కాంప్లెక్షన్ అందిస్తుంది. ముఖం మరియు మెడకు ఆ నూనెను అప్లై చేసి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications