Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
రాత్రికి రాత్రే మొటిమలు నివారించే టెస్టెడ్ రెమిడీస్..!!
ఎంతో హాయిగా, ఉత్సాహంగా ఉండే మీరు.. ముఖం అద్దంలో చూసుకున్నప్పుడు మొటిమలు చూసి షాక్ అవుతారు. ఉన్న ఉత్సాహమంతా ఆవిరైపోతుంది. ముఖారవిందాన్ని మొత్తం మొటిమ రూపంలో నిర్జీవం చేసేస్తుంది. వెంటనే దాన్ని కనపడకుండా చేయాలని భావిస్తారు.
ఇలా మొటిమలు సరిగ్గా చాలా ముఖ్యమైన పని ఉన్నప్పుడే వస్తాయి. అంటే పెళ్లి, ఫంక్షన్, పార్టీ ఇలా.. ఏవైనా ఉన్నప్పుడు ముఖంపై ఇబ్బందిపెడతాయి. ఇది పెద్ద సమస్యేమీ కాకపోయినా.. మీ ఆకర్షణపై ప్రభావం చూపుతుందని.. ఆందోళన పడుతుంటారు. కాబట్టి.. అలాంటప్పుడు రాత్రికి రాత్రే.. మొటిమ నివారించే ఎఫెక్టివ్ రెమిడీస్ ఉన్నాయి.
ప్రతి ఒక్కరూ.. క్లియర్ స్కిన్, అందమైన కాంప్లెక్షన్ పొందాలని కోరుకుంటారు. అయితే.. మొటిమలు నయం చేయడానికి రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ట్రై చేసి ఉంటారు. కానీ.. మీ వంటగదిలోకి మాత్రం ఓ లుక్ కూడా వేసి ఉండరు. అందుకే.. ఇవాళ మీ మొటిమను రాత్రికి రాత్రే మాయం చేసే.. ఎఫెక్టివ్ హోం రెమిడీస్.. వివరించబోతున్నాం..

ఐస్
ఐస్ వల్ల చల్లటి టెంపరేచర్ బ్లడ్ వెజెల్స్ ని టైట్ చేస్తుంది. అలాగే.. ఎరుపుదనాన్ని తగ్గించి, వాపుని తగ్గిస్తుంది. కాబట్టి.. ఒక ఐస్ క్యూబ్ ని క్లాత్ లో చుట్టి.. మొటిమపై పెట్టుకోవాలి. ఇలా రోజుకి మూడు నాలుగు సార్లు చేస్తే.. మొటిమ మాయం అవడం ఖాయం.

వెల్లుల్లి
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి.. మొటిమలను వెంటనే నివారిస్తాయి. ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకుని.. రెండు మొక్కలుగా కట్ చేయాలి. మొటిమపై దాన్ని రుద్దాలి. అలాగే రాత్రంతా వదిలేసి.. ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి.

ఆస్పిరిన్
పెయిన్ కిల్లర్ లా ఉపయోగించే.. ఆస్పిరిన్ లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలుంటాయి. సలిసైలిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి మొటిమలను వేగంగా నివారిస్తాయి. 5 నుంచి 7 కోట్ చేయని అస్పిరిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. కొన్ని నీళ్లలో వాటిని కరిగించాలి. పేస్ట్ చేసుకుని.. మొటిమపై అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకోవాలి. అంతే..మొటిమలు మాయం.

తేనె
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి.. బ్యాక్టీరియా విస్తరించకుండా అడ్డుకుంటాయి. కొద్దిగా తేనె తీసుకుని.. మొటిమపై పెట్టుకోవాలి. రాత్రంతా అలానే వదిలేయాలి. అంతే.. ఉదయానికి మొటిమ మాయం.

పసుపు
పసుపు యాంటీసెప్టిక్ గానే కాకుండా.. సహజ మందులా చర్మసమస్యలతో పోరాడుతుంది. చిటికెడు పసుపు తీసుకుని దానికి ఒక టేబుల్ స్పూన్ పాలు, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలిపి మొటిమలపై రాయాలి. ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications