For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్లాక్ హెడ్స్ తొలగించడానికి అమేజింగ్ హోం రెమెడీస్

|

మన చర్మ సమస్యల్లో బ్లాక్ హెడ్స్ ఒకటి. చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల బ్లాక్ హడ్స్ ఏర్పడుతాయి. అలాగే చర్మంలో అదనపు ఆయిల్స్ ఉత్పత్తి అవ్వడం వల్ల చర్మం ఎప్పుడూ జిడ్డుగా ఉన్నా, డెడ్ స్కిన్ సెల్స్ వల్ల చర్మం రంద్రాలు మూసుకుపోవడం వల్ల బ్లాక్ హెడ్స్ ఏర్పడుతాయి. ఇది చర్మ సమస్యల్లో అత్యంత సాధారణ సమస్య. బ్లాక్ హెడ్స్ అన్నిఏజ్ గ్రూపుల వారు ఎదుర్కొనే సమస్య.

చర్మం మీద కనిపించి, కనిపించని బప్స్ రూపంలో అతి చిన్నగా బ్లాక్ గా ఏర్పడుతాయి. వీటిని చర్మంలో గుర్తించిన వెంటనే వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. లేదంటే బ్లాక్ హెడ్స్ ఎక్కువ అవుతాయి.
బ్లాక్ హెడ్స్ ఏర్పడటానికి వివిధ రకాల కారణాలున్నాయి. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, హార్మోనుల ప్రభావం వల్ల ముఖంలో బ్లాక్ హెడ్స్ ఏర్పడుతాయి . ఇది స్కిన్ రూట్ కారణం వల్ల కూడా ఈ స్కిన్ సమస్యకు దారితీస్తుంది .

కానీ, లక్కీగా ఈ సమస్యను కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ తో సులభంగా నివారించుకోవచ్చు . అవును మీరు చదివింది కరెక్టే, బ్లాక్ హెడ్స్ నివారించడంలో కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి.!

బ్లాక్ హెడ్స్ నివారించుకోవడానికి, సాప్ట్ అండ్ క్లియర్ స్కిన్ పొందడానికి కొన్ని శతాబ్దాల కాలం నుండి ఈ హోం రెమెడీస్ ను ఉపయోగిస్తున్నారు. అలాంటి కొన్ని ఎపెక్టివ్ హోం రెమెడీస్ కొన్నింటిని మీకు పరిచయం చేస్తున్నాము. ఇవి ముఖంలో ఫోర్ హెడ్, గడ్డ, ముక్కమీద, ముక్కుకు ఇరువైల ఏర్పడ్డ బ్లాక్ హెడ్స్ నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

అంతే కాదు, ఈ హోం రెమెడీస్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సురక్షితమైనవి. వాస్తవికమైనవి, చౌకైనవి. మన వంటగదిలో ఎప్పుడూ మనకు అందుబాటులో ఉండేవి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ నేచురల్ రెమెడీస్ తో బ్లాక్ హెడ్స్ ను ఏవిధంగా నివారించుకోవాలో చూద్దాం...

 నిమ్మరసం:

నిమ్మరసం:

బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో ఫ్రెష్ లెమన్ జ్యూస్ ను అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ లక్షణాలు, డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది, మూసుకుపోయిన చర్మ రంద్రాలు తెరచుకునేలా చేస్తుంది. బ్లాక్ హెడ్స్ నివారిస్తుంది.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

అరటేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను వాటర్ లో మిక్స్ చేసి చిక్కటి పేస్ట్ లా చేసి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. పూర్తిగా డ్రై అమయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే ఆల్కలైన్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది.

తేనె:

తేనె:

తేనె ఫేస్ ను క్లియర్ గా శుభ్రం చేస్తుంది. ఆర్గానిక్ హానీని ముఖం మొత్తం అప్లై చేసి 10-15నిముషాలు అలాగే ఉండనివచ్చి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తేనెలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు బ్లాక్ హెడ్స్ కు కారణమయ్యే బ్లాక్ హెడ్స్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది.

పసుపు

పసుపు

పసుపులో కొద్దిగా నీళ్ళు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖం మొత్తం అప్లై చేయాలి . అరగంట తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీవైరస్ లక్షణాలు బ్లాక్ హెడ్స్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క పౌడర్ లో కొద్దిగా తేనె మిక్స్ చేసి ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయాలి. 10-15నిముషాలు అప్లై చేసిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. . ఈ చిట్కాను రోజువిడిచి రోజు ఫాలో అవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఓట్ మీల్స్ :

ఓట్ మీల్స్ :

బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి ఓట్ మీల్ పౌడర్ గొప్పగా సహాయపడుతుంది. ఉడికించిన ఓట్ మీలన్ ను ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత తడిబట్టతో శుభ్రం తుడిస్తే బ్లాక్ హెడ్స్ క్లియర్ గా తొలగిపోతాయి . ఓట్ మీల్ బ్లాక్ హెడ్స్ తొలగించడం మాత్రమే కాదు, డెడ్ స్కిన్ సెల్స్ కూడా తొలగిస్తుంది. చర్మం క్లియర్ గా చేస్తుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

ప్రతి రోజూ ఒక కప్పు గ్రీన్ టీని తాగాలి. అలాగే చల్లారిన గ్రీన్ టీని ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, గ్రీన్ టీ వాటర్ తో అప్పుడప్పుడు ముఖం కడుగుతుంటే బ్లాక్ హెడ్స్ రాకుండా ఉంటాయి,.గ్రీన్ టీలో ఉండే కొన్ని కాంపౌండ్స్ డెడ్ స్కిన్ సెల్స్ , ఎక్సెస్ ఆయిల్ ను తొలగించే లక్షణాలు కలిగి ఉంటాయి.

English summary

7 Amazing Home Remedies To Remove Blackheads

Blackheads, aka open comedones, are tiny bumps that occur when your skin pores get clogged. Excess oil or a build-up of dead skin cells can cause the skin pores to get clogged. This is a highly common skin-related problem that people of all age groups might experience.
Story first published: Wednesday, June 15, 2016, 15:58 [IST]
Desktop Bottom Promotion