Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
25 ఏళ్లు వచ్చాయంటే.. కంపల్సరీ పాటించాల్సిన బ్యూటీ రూల్స్..!
20లో చర్మం చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఏజ్ లో చర్మం చాలా బావుంటుంది. ఆయిలీనెస్, యాక్నె వంటి టీనేజ్ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ దూరమై ఉంటాయి. అలాగే.. చర్మం అలాగే యంగ్ లుక్ ని కలిగి ఉంటుంది. అలాగే 20లలో చర్మ సంరక్షన గురించి పట్టించుకోవడం కూడా మానేస్తారు.
చాలా మంది 20లలోకి ఎంటర్ అవగానే.. చర్మం సంరక్షణను పట్టించుకోరు. లైఫ్ స్టైల్ లో చాలా మార్పులు చర్మాన్ని అసహ్యంగా మార్చేస్తాయి. సాధారణంగా.. ఏజ్ అవుతున్న లక్షణాలు.. 25 ఏళ్లలలో కనిపించడం మొదలవుతాయి. కొద్దిగా కేర్ తీసుకుంటే.. వాటిని ఇంకాస్త డిలే చేయవచ్చు.
25దాటిన తర్వాత.. ఎలాంటి కేర్ లేకుండా.. చర్మాన్ని అందంగా మార్చుకోవడం చాలా కష్టం. కాబట్టి.. ప్రతిరోజూ కొంత సమయాన్ని చర్మ సంరక్షణకు కేటాయించాలి. దీనివల్ల ఏజింగ్ ప్రాసెస్ కాస్త నెమ్మదిగా మారుతుంది. మరి.. 25 తర్వాత ఖచ్చితంగా పాటించాల్సిన బ్యూటీ రూట్స్ ఏంటో చూద్దాం..

మేకప్ రిమూవ్ చేయడం
చాలా బేసిక్ స్కిన్ కేర్ టిప్ ఇది. చాలామంది.. ఈ టిప్ ఫాలో అవడం మరిచిపోతుంటారు. 25 ఏళ్లు దాటిన తర్వాత.. మీ గురించి మీరు చాలా స్ట్రిక్ట్ రూల్ ఫాలో అవ్వాలి. రాత్రి పడుకోవడానికి ముందు.. మొత్తం మేకప్ అంతటినీ.. తొలగించుకోవాలి.

కళ్ల కింద క్రీమ్
కళ్ల కింద క్రీమ్ రాయడం ఏమాత్రం మరిచిపోకూడదు. ఇప్పటి వరకు అండర్ ఐ క్రీమ్ కొనకపోతే.. 25ఏళ్లు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొనాలి. ఇది రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల కళ్ల కింద ముడతలు నివారించవచ్చు.

క్లెన్సర్
ఇప్పటి నుంచి.. మీ చర్మంపై మీరు శ్రద్ధ వహించాలి. మీ చర్మ తత్వాన్ని బట్టి బ్యూటీ ప్రొడక్ట్స్ కొనాలి. ఫేషియల్ క్లెన్సర్స్ ని కంపల్సరీ ఉపయోగించాలి. సున్నితమైన, మెడికేటెడ్ క్లెన్సర్లు.. మంచి ఫలితాన్నిస్తాయి.

టోనింగ్
టోనర్ ఉపయోగించడం వల్ల.. చర్మ రంధ్రాలు టైట్ గా మారతాయి. అలాగే.. న్యాచురల్ పీహెచ్ లెవెల్స్ ని చర్మంలో రీస్టోర్ చేస్తాయి. రోజ్ వాటర్ ని టోనర్ గా ఉపయోగించినా మంచి ఫలితం ఉంటుంది.

ముట్టుకోకుండా
ముఖాన్ని ఎక్కువగా ముట్టుకోకూడదు. ముఖం చాలా సున్నితమైన చర్మాన్ని కలిగి ఉంటుంది కాబట్టి వేళ్ల ద్వారా ఆయిల్, దుమ్ము ముఖ చర్మానికి తాకకుండా జాగ్రత్తపడాలి. అలాగే.. ముఖం శుభ్రం చేసుకునేటప్పుడు మరీ గట్టిగా రుద్దకూడదు. ఇలా చేస్తే చర్మం లాగినట్టు అయి.. ఏజింగ్ లక్షణాలు కనిపిస్తాయి.

ఫేషియల్స్
వారానికి ఒకసారి ఫేషియల్ చేసుకోవడానికి టైం కేటాయించండి. ఒకవేళ మీకు అంత సమయం లేదంటే.. నెలకు ఒకసారి ఫేషియల్ చేయించుకోవాలి. కానీ.. చర్మానికి ఖచ్చితంగా కేర్ తీసుకోవడం వల్ల.. ముడతలు రాకుండా అడ్డుకోవచ్చు.

మాయిశ్చరైజర్
చర్మంలో డీహైడ్రేషన్ ద్వారా.. ఏజింగ్ లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. ఆయిలీ స్కిన్ తో పోల్చితే.. డ్రై స్కిన్ చాలా త్వరగా ఏజింగ్ లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి.. చర్మం ఎప్పుడూ మాయిశ్చరైజ్డ్ గా ఉండేలా జాగ్రత్త పడాలి. మీ చర్మానికి తగ్గట్టు.. మాయిశ్చరైజర్ ఉపయోగించాలి.



Click it and Unblock the Notifications