Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
గార్జియస్ స్కిన్ పొందడానికి పెరుగుతో అద్భుతమైన ఫేస్ ప్యాక్స్ ..!
స్కిన్ బ్యూటీని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించే నేచురల్ పదార్థాలలో పెరుగు ఒకటి. పెరుగులో ల్యాక్టిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. దీన్ని చర్మ సంరక్షణకు వాడుకోవడం చాలా ఉపయోగకరం.
ముఖంలో మొటిమలు, మచ్చలు లేకుండా క్లియర్ స్కిన్ పొందడానికి వేలకు వేలు డబ్బు ఖర్చుపెట్టి, వివిధ రకాల ట్రీట్మెంట్స్, హోం రెమెడీస్ ఉపయోగించే విసిగిపోయారా..? అయితే ఈ రోజు మీకు పరిచయం చేస్తున్న ఒక ఎక్సలెంట్ నేచురల్ రెమెడీని పరిచయం చేస్తున్నాము. ఈ రెమెడీ ద్వారా అన్ని రకాల స్కిన్ సమస్యలను నివారించుకోవచ్చు. అద్భుతమైన చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు.
స్కిన్ బ్యూటీని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించే నేచురల్ పదార్థాలలో పెరుగు ఒకటి. పెరుగులో ల్యాక్టిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. దీన్ని చర్మ సంరక్షణకు వాడుకోవడం చాలా ఉపయోగకరం. ఇది చాలా ఎఫెక్టివ్ గా చర్మ రంద్రాలను టైట్ చేస్తుంది, ముఖంలో ఏజింగ్ లక్షణాలను కనబడనివ్వకుండా చేస్తుంది. బ్లాక్ హెడ్స్ కు కారణమయ్యే డెడ్ స్కిన్ సెల్స్ ఏర్పడకుండా చేస్తుంది.
అదనంగా, పెరుగు సురక్షితమైనది, స్వచ్చమైనది, ఎలాంటి కెమికల్స్ సమస్యా ఉండదు. బ్యూటీ స్టోర్స్ లో ఉండే కెమికల్స్ ప్రొడక్ట్స్ కంటే 100శాతం నేచురల్ పదార్థం. అంతే కాదు, పెరుగు అంటే చాలా మంది మహిళలకు ఫేవరెట్ ఫుడ్ ఐటెమ్
ముఖ్యంగా, పెరుగును వండర్ ఫుల్ స్కిన్ ఫ్రెండ్లీ నేచురల్ పదార్థాలలైన నిమ్మరసం, తేనె, పసుపు వంటి పదార్థాలతో మిక్స్ చేస్తే ఫలితం ఎఫెక్టివ్ గా...రెట్టింపుగా ఉంటుంది.
అందువల్ల, ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకునే నేచురల్ ఫేస్ మాస్క్ లను మీకోసం పరిచయం చేయడం జరిగింది. వీటిని ప్రయత్నిస్తే తప్పనిసరిగా కొన్ని వండర్స్ జరగుతాయి. పెరుగుతో తయారుచేసుకునే కొన్ని ఎఫెక్టివ్ రెమెడీస్ మీకోసం ఈ క్రింది విధంగా ...
నోట్ : ఏ ఫేస్ మాస్క్ వేసుకోవాలన్నా ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఫేస్క్ ప్యాక్ లు సెన్సిటివ్ స్కిన్ మీద చాలా తేలికగా రియాక్ట్ అవుతాయి.

యూత్ ఫుల్ స్కిన్ కోసం పెరుగు, ఓట్స్, తేనె
రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్, ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేయాలి. మొత్తం బాగా మిక్స్ అయ్యే వరకూ కలపాలి. తర్వాత ఫేస్ మరియు నెక్ కు మాస్క్ వేసుకోవాలి. మాస్క్ వేసుకున్న 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

స్కిన్ టైట్ గా మార్చడం కోసం:
పెరుగు, కోక పౌడర్, తేనె
రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ గా ఉండే పెరుగు తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ కోక పౌడర్ , తేనె తీసుకోవాలి. ఈ పదార్థాలన్నీ స్మూత్ గా పేస్ట్ లా అయిన తర్వాత, దీన్ని ముఖం, మెడకు అప్లై చేసి 25 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పెరుగు, తేనె, రోజ్ వాటర్ :
ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టీస్పూన్ తేనె మరియు 2, 3 చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లా చేయాలి. ఈ పదార్థాలను మిక్స్ చేసి, పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖం, మెడకు అప్లై చేయాలి. చర్మంలోకి బాగా అబ్సార్బ్ అయిన తర్వాత 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

స్కిన్ బ్రైట్ గా మార్చడానికి -పెరుగు, నిమ్మరసం
ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ లెమన్ జ్యూస్ మిక్స్ చేసి, మెత్తగా మాస్క్ తయారుచేసుకోవచ్చు. ఈ రెండింటి మిశ్రమంను ముఖం మెడకు మాస్క్ వేసుకుని అర గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుని, మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

స్కిన్ టోన్ మెరుగుపరచడానికి పెరుగు, కీరదోసకాయ
కీరోదసకాయకు తొక్క తొలగించి, దీనికి 2 టేబుల్ స్పూన్ల పెరుగును చేర్చి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేయాలిజ 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

చర్మ రంద్రాలను శుభ్రం చేసే పెరుగు, స్ట్రాబెర్రీ
గుప్పెడు స్ట్రాబెర్రీలను మెత్తగా పేస్ట్ చేసి అందులో రెండు టేబుల్ స్పూన్టల పెరుగు మిక్స్ చేసి, ముఖానికి, మెడకు అప్లై చేయాలి. 20 నిముషాలు డ్రైగా మారిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

మొటిమలు, మచ్చలు లేని చర్మం పొందడానికి :పెరుగు , పసుపు
ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా ఉండే పెరుగులో ఒక టీస్పూన్ పసుపు మిక్స్ చేయాలిజ ఈ మాస్క్ ను ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications











