Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
డార్క్ స్కిన్ ను బ్రైట్ గా, ఫెయిర్ గా , స్మూత్ గా మార్చే 7 అమేజింగ్ హోం రెమెడీస్
స్కిన్ టోన్ అంటే చర్మం ఛాయలో మార్పులు రావడం. స్కిన్ కలర్ డార్క్ గా మారడం. ఇందుకు చాలా కారణాలున్నాయి. పొల్యూషన్, బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్, నీరు సరిగా తాగకపోవడం, నిద్రలేమి మరియు స్మోకింగ్ వంటి వివిధ కారణాల వల్ల చర్మంలో ఊహించని మార్పులు వస్తాయి. చర్మం రంగుమారుతుంది.
చర్మం నల్లగా ఎందుకు మారుతుంది? చర్మంలో నేచురల్ రంగులో మార్పులు రావడానికి కారణాలు వివిధ రకాలుగా ఉన్నా, రెగ్యులర్ గా ఉండే స్కిన్ టోన్ కంటే అసాధారణంగా స్కిన్ టోన్ లో మార్పులొస్తే చూడటానికి అసహ్యంగా...అనారోగ్యంగా కనబడుతుంది. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి వివిధ మార్గాలున్నాయి, ఉదా: ఎక్కువగా నీరు తాగడం వల్ల చర్మానికి తగిన మాయిశ్చరైజర్ అందించవ్చు. చర్మంలోని టాక్సిన్స్ తొలగించుకోవచ్చు.
కాబట్టి, మీరు ఎక్కడికెళ్ళినా బాటిల్లో నీరు తీసుకెళ్ళడం మర్చిపోకూడదు. అలాగే మంచి సన్ స్ర్కీన్ లోషన్ మర్ధన చేసుకోవడం మర్చిపోకూడదు . యూవీ కిరణాలు నేరుగా చర్మం మీద పడటం వల్ల కూడా చర్మ రంగులో మార్పువస్తుంది.
అలాగే స్మోకింగ్ అలవాటున్న వారు వెంటనే మానేయాలి. స్మోకింగ్ వల్ల చర్మం మరింత డల్ గా మరియు లైఫ్ లెస్ గా కనబడేలా చేస్తుంది. చిన్నవయస్సులోనే వయస్సైన వారిలా కనబడేలా చేస్తుంది.
అసాధారణ చర్మ రంగుకు, మరో అసాధారణమైన కారణం చర్మంలో మెలనిన్ అత్యధికంగా ఉత్ప్తి అవ్వడం. ఇది పరిమితంగా ఉత్పత్తి అవ్వడం వల్ల చర్మం అందంగా, ఆరోగ్యంగా , ప్రకాశవంతంగా కనబడుతుంది.
ఇటువంటి అసాధారణ స్కిన్ టోన్ మెరుగుపరచుకోవడానికి మార్కెట్లో దొరికే ఫెయిర్ నెస్ క్రీమ్స్ మరియు బ్లీచెస్ ఇతర సమస్యలకు కారణమవుతుంది. ఫెయిర్ నెస్ క్రీములు అంతగా ఆశించిన ఫలితాలనివ్వవు. బ్లీచింగ్ కూడా వర్కౌట్ కాదు. బ్లీచింగ్ లో కెమికల్స్ ఉండటం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. మరి అసాధారణ చర్మ రంగును నివారించుకోవడం ఎలా? మన వంటగదిలోకి వెళ్ళి చూస్తే పరిష్కారం మన కళ్ళ ముందు కనబడుతుంది.
నేచురల్ రెమెడీస్ మనల్ని ఎప్పుడూ ఆహ్వానిస్తుంటాయి. మన వంటగదిలో ఉండే 7 అమేజింగ్ నేచురల్ రెమెడీస్ తో అసాధారణ చర్మ రంగును పోగొట్టి, మంచి స్కిన్ టోన్ పొందడానికి కొన్ని రెమెడీస్ క్రింది విధంగా...

నిమ్మరసం :
నిమ్మరసంలో నేచురల్ బ్లీచింగ్ లక్షణాలున్నాయి . ఇది చర్మ రంగులో మార్పు తీసుకొస్తుంది. దీన్ని ఒకసారి ఉపయోగించి చూడండి, ఫలితం మీకే తెలుస్తుంది. తప్పనిసరిగా స్కిన్ టోన్ లో మార్పును గమనిస్తారు.

ఆరెంజ్ జ్యూస్:
ఆరెంజ్ జ్యూస్ లో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది స్కిన్ టోన్ మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. నిమ్మరసమంత స్ట్రాంగ్ కాకపోయినా, సెన్సిటివ్ స్కిన్ కలవారికి ఫర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది.

పసుపు:
ఏజ్ ఓల్డ్ హోం రెమెడీ. చర్మ రంగును బంగారు వర్ణంలో మార్చుకోవడానికి పురాతన కాలం నుండి దీన్ని ఉపయోగిస్తున్నారు , పసుపులో కొద్దిగా పాలు మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మంచి రేడియంట్ స్కిన్ పొందుతారు.

శెనగపిండి:
ఇది కూడా ఏజ్ ఓల్డ్ హోం రెమెడీ, పెరుగుతో చేర్చినప్పుడు, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. అంతే కాదు, చర్మం బ్రైట్ , బ్యూటిఫుల్, సాప్ట్ కంప్లెక్షన్ కలిగి ఉంటుంది.

తేనె -నిమ్మరసం:
నిమ్మరసంలో కొద్దిగా తేనె మిక్స్ చేసి, చర్మానికి అప్లై చేయడం వల్ల ఇది చర్మానికి మాయిశ్చరైజింగ్ మరియు గ్లోను అందిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ గ్రేట్ గా పనిచేస్తుంది.

గందం -రోజ్ వాటర్:
గందం పౌడర్ లో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల అన్ని రకాల స్కిన్ సమస్యలు దూరమవుతాయి. ఈ రెండింటి కాంబినేషన్లోచర్మం బ్రైట్ గా, ఫెయిర్ గా మారుతుంది.

పెరుగు:
పెరుగులో కొద్దిగా తేనె మిక్స్ చేసి ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మంలో ఫెయిర్ నెస్ పెరుగుతుంది. పెరుగు చర్మానికి రేడియన్స్ ఇస్తుంది. స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. తేనె చర్మానికి మాయిశ్చరైజర్ ను సాప్ట్ నెస్ ను అందిస్తుంది.



Click it and Unblock the Notifications