For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ల క్రింది నల్లటి వలయాలను మాయం చేసే 7 నేచురల్ రెమెడీస్

|

కళ్ళ క్రింది భాగంలో ముడుతలు ఉన్నాయంటే ముఖ అందాన్ని మరియు లుక్స్ ను పాడు చేసేస్తుంది. ఈ ముడుతలనేవి చర్మ సమస్యల్లో ఒకటి, ఇవి చిన్న వయస్సులోనే కనబడుటకు ప్రధాణ కారణం డ్రై స్కిన్ మరియు హానికరమైన సూర్యకిరణాలు ముఖం మరియు శరీరం మీద పడటం. వయస్సు పెరుగుట వల్ల కూడా కళ్ళ క్రింద ముడుతలు ఏర్పడుటకు ముఖ్య కారణం.

కళ్ళ క్రింద చర్మం చాలా సున్నితంగా ఉండటం వల్ల చాలా తర్వాత సులభంగా ముడుతలు మరియు ఫైన్ లైన్స్ ఏర్పడుటకు కారణం అవుతుంది . కాబట్టి, ఇలా కళ్ళ క్రింది నల్లని వలయాలు ఏర్పడాటానికి ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కళ్ళ క్రింద నల్లని వలయాలు మరియు చారలను నివారించడం కోసం మహిళలు బ్యూటీ పార్లర్స్ మరియు కాస్మోటిక్స్ కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. ఇలా ఖర్చు చేసి తీసుకొనే ట్రీట్మెంట్స్ మరియు రసాయనిక ప్రొడక్ట్స్ కంటే మనం ఇంట్లో నేచురల్ గా ఉపయోగించే నేచురల్ ప్రొడక్ట్స్ మరింత ఎఫెక్టివ్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నివారిస్తాయి.

అలాంటే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను కొన్నింటిని మీకు ఈ రోజు పరిచయం చేస్తున్నాము. ఇవి ముఖంలో మచ్చలు మరియు నల్లని వలయాలను నివారించడంలో గొప్పగా సహాయపడుతాయి. మరి ఆ హోం రెమెడీస్ ఏంటో క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

1. కొబ్బరి నూనె:

1. కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి తగినంత తేమను అందిస్తుంది మరియు ముడతలను నివారిస్తుంది . స్వచ్చమైన కొబ్బరి నూనెను కళ్ళ క్రింది అప్లై చేసి మర్దన చేయాలి. ఇలా ప్రతి రోజూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

2. రోజ్ వాటర్ :

2. రోజ్ వాటర్ :

రోజ్ వాటర్ ను కళ్ళ క్రింది భాగంలో అప్లై చేయడం ద్వారా ఇది చర్మానికి పోషణను అందిస్తుంది మరియు తేమగా ఉంచుతుంది మరియు ముడుతలను నివారించబడుతుంది. కొద్దిగా రోజ్ వాటర్ ను తీసుకొని కాటన్ మీద వేసి కళ్ళ క్రింద అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

3. కీరదోసకాయ:

3. కీరదోసకాయ:

కీరదోసకాయను ముక్కలుగా కట్ చేసి కళ్ళక్రింది సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కళ్ళ క్రింద నల్లని వలయాలు తొలగించడంతో పాటు మీ చర్మానికి తగినంత హైడ్రేషన్ అందిస్తుంది మరియు ఫైన్ లైన్స్ నివారించబడుతుంది . మరియు ముడుతలను నివారిస్తుంది .

4. తేనె:

4. తేనె:

అల్లం చర్మానికి అవసరం అయ్యే తేమను మరియు పోషణను అందిస్తుంది . చర్మం ముడుతలను నివారిస్తుంది మరియు కళ్ళ క్రింద రక్త ప్రసరణ జరగడానికి సహాయపడుతుంది. అల్లం పేస్ట్ లో కొద్దిగా తేనె మిక్స్ చేసి కళ్ళ క్రింది భాగంలో మసాజ్ చేయాలి . 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముడుతలను నివారిస్తుంది.

5. టమోటో:

5. టమోటో:

6. రెండు టీస్సూన్ల టమోట రసంలో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి కళ్ల కింద నెమ్మదిగా రాయాలి. కొద్దిసేపటి తర్వాత దూదితో తుడిచి కడగాలి. రెండు చెంచాల టమాటారసంలో తగినంత పసుపు నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మిశ్రమంలా తయారు చేసి నల్లగా ఉన్న ప్రాంతంలో పూత వేయాలి. ఆరాక కడిగేస్తే సరిపోతుంది.

6. బాదం :

6. బాదం :

బాదం పలుకులు కూడా సమస్యను తగ్గించేస్తాయి. బాదం పలుకులను పాలలో నానబెట్టి మర్నాడు మెత్తగా చేసి నల్లగా మారిన చోట పూతలా పూసి గంట తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

7. రోజుకి కనీసం ఎనిమిది గంటల నిద్ర

7. రోజుకి కనీసం ఎనిమిది గంటల నిద్ర

అవసరం అది ఒక్కొక్కరి శరీర తత్త్వాన్ని బట్టి మారుతుంది. తక్కువ నిద్రపోతే కంటి కింద నల్లటి ఛాయలు ఏర్పడతాయి. ఇవి అందాన్ని దెబ్బతీయడమే కాకుండా అనారోగ్యానికి చిహ్నాలు కూడా.

English summary

7 Home Remedies For Wrinkles Under Eyes

Eyes and under-eyes are the most delicate parts of our body and caring these parts is very necessary. If not properly cared, wrinkles appear under the eyes that make you look dull and unattractive. You can prevent formation of under-eye wrinkles by changing your lifestyle such as avoiding eye makeup, taking enough sleep and balanced diet, sporting sun glasses and applying sun block when going outside etc.
Story first published:Friday, July 15, 2016, 15:57 [IST]
Desktop Bottom Promotion