For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాప్ట్ అండ్ స్మూత్ స్కిన్ కు కమర్షియల్ ఫేస్ వాష్ కంటే నేచురల్ రెమెడీస్ బెటర్..!

|

చాల మంది, చర్మంను శుభ్రం చేసుకోవడానికి ఫేస్ వాష్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మార్కెట్ లో మనకు అందుబాటులో ఉండే కెమికల్ బేస్డ్ ఫేస్ వాష్ ల కంటే ఇంట్లో తయారుచేసుకునే నేచురల్ ఫేస్ క్లెన్సర్ బెటర్ గా ఉంటాయి . సహజంగా మనం రోజుకు రెండు మూడు సార్లు ముఖం శుభ్రం చేసుకుంటుంటాము.

అంటే సంవత్సరానికి దాదాపు 1095 టైమ్స్, అలాగే వారంలో 21 టైమ్స్ . అందుకే ఫేస్ వాష్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైనది. రోటీన్ గా ఫేస్ వాస్ చేసుకోవడం వల్ల స్కిన్ శుభ్రపడుతుంది. రెగ్యులర్ గా ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల చర్మంలో మురికి తొలగిపోతుంది, దుమ్ముధూళి, ఇతర వ్యర్థాలు తొలగిపోయి చర్మం క్లియర్ గా మారుతుంది.

మార్కెట్లో మనం కొని తెచ్చుకునే ఫేస్ వాష్ లు ఉపయోగించడం వల్ల చర్మం డార్క్ గా మారుతుంది. కమర్షియల్ గా మనకు అందుబాటులో ఉండే ఫేస్ క్లెన్సర్ లో టాక్సిక్ కెమికల్స్, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్నాన్స్, సింథటిక్ పదార్థాలు మరియు ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి స్కిన్ క్లెన్సర్స్ గా ఉపయోగిస్తున్నారు . ఇది డ్రైగా మార్చుతుంది. ఫేస్ క్లెన్సింగ్ వల్ల ఉన్న వయస్సు కంటే 5 సంవత్సరాలు తక్కువగా కనబడుతారు!

స్కిన్ డ్యామేజ్ అయితే కొద్దిగా భయపడాదల్సిన విషయమే. ఎందుకంటే కాస్మోటిక్ ఫేస్ వాష్ లలో ఉండే టాక్సిటిలు నేరుగా చర్మం మీద పనిచేయడం వల్ల ఇది చర్మంలోని మాలుక్యులార్ స్ట్రక్చర్ మీద ప్రభావం చూపుతుంది.

కాబట్టి, క్లియర్ స్కిన్ పొందడానికి నేచురల్ పదార్థాలు ఎక్కువగా మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎలాంటి హానికరమైన పదార్థాలు ఉండవు. చౌకైనవి, మనకు సులభంగా అందుబాటులో ఉన్నడేవి. అద్భుతమైన ప్రయోజనాలను అందించేవి. కాబట్టి, మేము చెప్పే మాటలు కాదు, మీరు రియల్ గా...స్వయంగా ఉపయోగించి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది.!

చర్మంలో దుమ్ము, ధూళి, ఇతర టాక్సిన్స్ ను తొలగించడానికి 7 హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి !

కొబ్బరి నూనె :

కొబ్బరి నూనె :

కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్స్, ఫ్యాటీ యాసిడ్స్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్కిన్ టాక్సిన్స్ ను బయటకు ఫ్లష్ అవుట్ చేసి, చర్మంలోని మురికిని తొలగిస్తుంది. చర్మంలోని ఎపిడెర్మల్ టిష్యులన్ లోపలి వరకూ శుభ్రం చేస్తుంది. ఫ్రీరాడికల్స్ బారీ నుండి రక్షణ కల్పిస్తుంది. ఎలా పనిచేస్తుంది: కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని అందులో కాటన్ బాల్ డిప్ చేసి, ముఖం మొత్తం రబ్ చేయాలి. చర్మంలో మురికి, డస్ట్ పూర్తిగా తొలగిపోయే వరకూ రబ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖంను నేచురల్ గా క్లీన్ చేయడానికి ఇది ఒక టెస్టెండ్ హోం రెమెడీ. చాలా ఎఫెక్టివ్ ఫలితాలను అందిస్తుంది !

పాలు:

పాలు:

పాలలో నేచురల్ యాసిడ్స్ ఉంటాయి, కాబట్టి, ఇది చర్మంలోకి డీప్ గా చొచ్చుకుపోయి, మురికిని తొలగిస్తుంది, చర్మ రంద్రాలు మూసుకునేలా చేసి చర్మానికి తగినంత పోషణను అందిస్తుంది. ఎలా పనిచేస్తుంది: ఒక బౌల్ నీరు తీసుకుని అందులో కాటన్ డిప్ చేసి, ఎక్సెస్ వాటర్ పిండేసి, ముఖం మీద సున్నితంగా మర్ధన చేసి, చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసురోవాలి. ఈ నేచురల్ ఫేస్ క్లెన్సర్ చర్మంను సాఫ్ట్ గా మరియు విసిబుల్ గా మరియు ఫెయిర్ గా మార్చుతుంది.

అలోవెర:

అలోవెర:

అలోవెరలో పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి క్లెన్సర్ గా పనిచేస్తుంది, స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది , చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఎలా పనిచేస్తుంది అలోవెర గుజ్జును ఒక బౌల్లోకి తీసుకుని, రిఫ్రిజరేటర్ లో 5 నిముషాలు పెట్టాలి, తర్వాత దీన్ని చర్మానికి అప్లై చేసి నేచురల్ గా డ్రైగా మార్చాలి. చర్మం స్ట్రెచబుల్ గా అనిపిస్తే, వెంటనే కాటన్ ను వాటర్ లో డిప్ చేసి, ఎక్సెస్ వాటర్ పిడేసి, ముఖాన్ని శుభ్రంగా తుడవాలి. ఇలా చేస్తున్నప్పుడు పల్చటి, డర్టీ లేయర్ కనబడుతుంది. కాబట్టి, హోం మేడ్ నేచురల్ క్లెన్సర్ ను ప్రతి రోజూ ఉపయోగించడం వల్ల మరింత బెటర్ రిజల్ట్ పొందవచ్చు !

తేనె + లెమన్ క్లెన్సర్

తేనె + లెమన్ క్లెన్సర్

నిమ్మరసంలో యాంటీసెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మొటిమలు, మచ్చలు నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిలో ఉండే నేచురల్ గుణాలు చర్మాన్ని మాయిశ్చరైజింగ్ గా మార్చుతాయి. ఎలా పనిచేస్తాయి: రెండు టేబుల్ స్పూన్ల తేనె తీసుకుని అందులో ఫ్రెష్ గా ఉన్న నిమ్మరసం మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేయాలి. ఇది డ్రై అయ్యే వరకూ అలాగే ఉండాలి. తర్వాత శుభ్రంగా కడిగేయాలి. ఈ నేచురల్ పదార్థంను స్కిన్ క్లియర్ గా మారే వరకూ ఉపయోగిస్తుండాలి.

పెరుగు:

పెరుగు:

మరో నేచురల్ ఫేస్ మాస్క్ పెరుగు, పెరుగులో ప్రోటీన్స్ మరియు లాక్టిక్ యాసిడ్స్ ఎక్కువ. ఇవి డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. చర్మ రంద్రాలను టైట్ గా మార్చుతుంది. చర్మం లోపలి వరకూ హైడ్రేషన్ ను అందిస్తుంది. ఎలా పనిచేస్తుంది: పెరుగు తీసుకుని ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. మసాజ్ చేయడం వల్ల చర్మంలోపలి వరకూ చొచ్చుకుపోయి, శుభ్రం చేస్తుంది. 5 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బేకింగ్ సోడ + జోజోబ ఆయిల్

బేకింగ్ సోడ + జోజోబ ఆయిల్

బేకింగ్ సోడా స్కిన్ కు ఎక్సఫ్లోయేట్ గా పనిచేస్తుంది. జోజోభ ఆయిల్ చర్మానికి తగిన పోషణను అందిస్తుంది. ఇది బెస్ట్ హోం మేడ్ నేచురల్ క్లెన్సర్ . ఎలా పనిచేస్తుంది: ఒక టీస్పూన్ బేకింగ్ సోడా తీసుకుని అందులో 20 చుక్కల జోజోభ ఆయిల్ ను మిక్స్ చేసి, చర్మానికి ఉపయోగించాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ హోం మేడ్ ఫేస్ వాష్ చర్మానికి ప్రతి రోజూ ఉపయోగిస్తుంటే చర్మం సాప్ట్ గా మరియు క్లియర్ గా మార్చుతుంది.

కీరదోసకాయ

కీరదోసకాయ

కీరదోసకాయలో చర్మాన్ని చల్లగా మార్చే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. చర్మాన్ని క్లెన్సింగ్ చేసే గుణాలు మరియు హైడ్రేట్ చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మంలోపలి వరకూ వెళ్ళి మురికిని శుభ్రం చేస్తుంది. ఎలా పనిచేస్తుంది: ఖీరదోసకాయ రసాన్ని ముఖానికి అప్లై చేసి, డ్రై అయ్యే వరకూ వెయిట్ చేయాలి. అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేయాలి.

English summary

7 Natural Cleansers You Can Use Instead Of A Face Wash

7 Natural Cleansers You Can Use Instead Of A Face Wash,We wash our face minimum three times in a day. That is roughly 1095 times a year and 21 times a week. Our face wash is an irredeemable product of our skin care routine, and goes just about anywhere we go.
Story first published: Wednesday, September 7, 2016, 11:57 [IST]
Desktop Bottom Promotion