Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
మెడ మీద ముడుతలకు చెక్ పెట్టే 7 నేచురల్ మాస్కులు..!
స్కిన్ ఆరోగ్యంగా ఉండాలంటే చర్మంలో కొలాజెన్ ఉత్పత్తి చాలా అవసరం. చర్మంలో ఉత్పత్తి అయ్యే కొల్లాజెన్ స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది. చర్మంలో కొలాజెన్ ఉత్పత్తి సరిగా లేనప్పుడు చర్మంలో సన్నని చారలు, ముడుతలను మొదలవుతాయి. ఇవి ముఖం, మెడ నుండి ప్రారంభమై, నిధానంగా చేతులకు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతుంది.
ముఖంలో చారలు, ముడుతలను నివారించుకోవడానికి కొంత మంది ఫేషియల్స్ చేసుకుంటారు. అయితే ముఖం క్రింద మరో అందమైన మెడ భాగాన్ని వదిలేస్తుంటారు. మెడకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మెడ మీద చర్మం ముఖ చర్మం కంటే మందంగా కనబడుతుంది. దాంతో మెడ మీద చారలు, ముడతలు ఎత్తి కనబడుతుంటాయి. యూవి కిరణాలు మెడ మీద పడటంతో మరింత ఎక్కువ కనబడుతుంటాయి. ఇంకా జెనటిక్ సమస్యలు, స్ట్రెస్, మరియు ఇతర రీజన్స్ వల్ల కూడా మెడ మీద ముడతలు ఇబ్బంది కలిగిస్తాయి.
వయస్సు తెలిపే ముడుతలను నివారించే ఆయుర్వేదిక్ రెమెడీస్
ముఖంలో వలే మెడ మీద ఫైన్ లైన్స్ , ముడుతలను నివారించుకోవడానికి ఫేస్ మాస్క్ లు అంతగా ఉపయోగపడకపోవచ్చు . అయితే కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను ఉపయోగించి ముడుతలను కనబడకుండా కవర్ చేయోచ్చు. మరియు ముడుతలను నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖంలో, మెడ మీద చారలను, ముడతలను నివారించుకోవడానికి మార్కెట్లోని టాక్సిక్ కెమికల్స్ ఉపయోగించడం వల్ల సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి, నేచురల్ పదార్థాలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. అలోవెరాలో ఉండే మాలిక్ యాసిడ్ మీ స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది?
ముడుతలను మాయం చేసే అలోవెర జెల్ ట్రీట్మెంట్ ..
లేదా జింజర్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ముడతలను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.మెడ మీద ముడుతలను నివారించుకోవడానికి వీటితో పాటు మరికొన్ని నేచురల్ రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

1. ఆలివ్ ఆయిల్ :
ఆలివ్ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ ఇ మరియు ఎ లు ఫుష్కలంగా ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ చర్మానికి రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. ఫ్రీరాడికల్స్ కారణంగా చర్మం డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది.ఉపయోగించే విధానం: ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్లో అర టీస్సూన్ ఆర్గానిక్ హనీ మిక్స్ చేయాలి. అందులోనే కొన్ని చుక్కల గ్లిజరిన్ మిక్స్ చేసి , మెడకు అప్లై చేసి మసాజ్ చేయాలి. మెడ క్రింది నుండి పైకి మసాజ్ చేయాలి.

2. అరటిపండ్లు:
మీరు నమ్ముతారో నమ్మరో, అరటిపండ్లలో విటమిన్స్, మినిరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్కిన్ రీజనరేషన్ కు మరియు కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
ఉపయోగించే విధానం:బాగా పండిని అరటిపండును స్మూత్ గా పేస్ట్ చేసి మెడకు అప్లై చేయాలి. 30 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ పద్దతిని వారంలో రెండు రోజులు ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది.

3. బాదం:
బాదంను రెగ్యులర్ గా తినడం లేదా ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మానికి మ్యాజిక్ చేస్తుంది. ముడుతలను నివారిచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ , ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ మరియు ఓలియక్ యాసిడ్ స్కిన్ హెల్త్ కు గ్రేట్ మ్యాజిక్ చేస్తుంది. ఉపయోగించే విధానం:పచ్చిపాలలో బాదంను రాత్రంతా నానబెట్టి, ఉదయం మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. మెత్తగా పేస్ట్ అయిన తర్వాత మెడకు అప్లై చేయాలి. సున్నితంగా మసాజ్ చేయాలి. డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

4. తేనె :
చర్మానికి మేలైన మాయిశ్చరైజర్ తేనె. స్కిన్ లేయర్స్ లోకి అద్భుతంగా షోషింపబడుతుంది, ఇందులో ఉండే విటమిన్ బి మరియు పొటాషియంలు స్కిన్ ఎలాసిటి పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఉపయోగించే విధానం:తేనెను మెడకు అప్లై చేసి మసాజ్ చేయాలి. చర్మం టైట్ గా మారే వరకు అలాగే ఉండే తర్వాత చల్లటి నీటితో శుబ్రం చేసుకోవాలి. దీన్ని రెగ్యులర్ మాయిశ్చరైజర్ గా ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

5. మెంతులు:
మెంతులు, మెంతి ఆకులలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. ఇది ఫైన్ లైన్స్ మరియు ముడతలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఉపయోగించే విధానం:మెంతులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో ఫ్రీక్వెంట్ గా ముఖం శుభ్రం చేస్తుండాలి. దాంతో చర్మం చూడటానికి టైట్ గా మారుతుంది. చర్మం స్మూత్ గా తయారవుతుంది.

6. గుడ్డు:
బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఎఫెక్టివ్ ప్రొడక్ట్స్ ఎగ్ . ఎందుకంటే ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది మరియు కొల్లాజెన్ ఉత్పత్తిని రీస్టోర్ చేస్తుంది. ఉపయోగించే విధానం: ఎగ్ వైట్ తీసుకుని, దాన్ని ముఖం, మెడకు అప్లై చేయాలి. అప్లై చేసిన కొద్దిసేపటికి, మెడ స్ట్రెచ్ అయినట్లు ఫీలవుతారు, ఈ మాస్క్ ముఖానికి వేసుకున్న తర్వాత వైటిష్ గా మారుతుంది. అప్పుడు, చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను వారంలో రెండు సార్లు ఫాలో అయితే చాలు నెక్ అందంగా కనబడుతుంది.

7. క్యారెట్:
క్యారెట్ లో బీటా కెరోటీన్ మరియు విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది స్కిన్ రీజనరేషన్ ను ప్రోత్సహిస్తుంది, కొల్లాజెన్ ప్రొడక్షన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఉపయోగించే విధానం: క్యారెట్ జ్యూస్ చేసి, ఆ రసాన్ని ముఖానికి అప్లై చేయాలి. ప్రతి రోజూ అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications