క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి టమోటో ఫేస్ మాస్క్..!

మహిళలు అందంగా కనబడుటకు ఎన్నో చిట్కాలను ఫాలో అవుతుంటారు. వివిధ రకాల హోం రెమెడీస్ ను ఉపయోగిస్తుంటారు. బ్యూటిఫుల్ స్కిన్ పొందడానికి అలాంటి హోం రెమెడీస్ లో టమోటో ఒకటి. టమోటో బ్యూటిని ఎలా పెంచుతుందన్ని విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. టమోటోలోని సౌందర్య గుణాలు తెలుసుకుంటే తప్పనిసరిగా మీ బ్యూటి ప్రొడక్ట్స్ లో టమోటో ఒకటైపోతుంది. హోం మేడ్ టమోటో ఫేస్ మాస్క్ చర్మంలో అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది. అదెలాగో తెలుసుకుందాం.

టమోటోలో 16శాతం విటమిన్ ఎ ఉంటుంది. ఇది రఫ్ స్కిన్ ను స్మూత్ గా చేస్తుంది. ముఖంలో డార్క్ స్పాట్స్ ఏజ్ స్పాట్స్ ను నివారిస్తుంది. అలాగే టమోటోలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో స్కిన్ ఎలాసిటి మెరుగుపరుడుతుంది.

టమోటోల్లో 5 శాతం విటమిన్ బి6 ఉంది. ఇది డ్యామేజ్ అయిన స్కిన్ ను రిపేర్ చేస్తుంది. ఫ్రీరాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది. ఇంకా టమోటోల్లో పొటాషియం,, మెగ్నీషియం, ఐరన్ లు పుష్కలంగా ఉన్నాయిజ ఇవి చర్మానికి ఇతర లేయర్స్ గా పనిచేస్తుంది. ఇది చర్మానికి హైడ్రేషన్ అందిస్తుంది. దాంతో చర్మంలో గ్లో వస్తుంది. కాంతివంతంగా ఆకర్షిస్తుంది.

చర్మ సౌందర్యంలో టమోటోను ఉపయోగించుకున్నప్పుడు, బాగా పండిన, గుజ్జు ఎక్కువగా ఉన్న టమోటోను ఎంపిక చేసుకోవాలి. చర్మ సౌందర్యంను మెరుగుపరుచుకోవడానికి టమోటో ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల చర్మం తేమగా, స్మూత్ గా మార్చుతుంది. మరి టమోటోను స్కిన్ కేర్ కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

చర్మ రంద్రాలను తగ్గించే ఫేస్ మాస్క్

చర్మ రంద్రాలను తగ్గించే ఫేస్ మాస్క్

ఈ మాస్క్ కోసం నిమ్మరసం కూడా ఉపయోగిస్తాము. నిమ్మరసంలో ఉండే ఆస్ట్రిజెంట్ లక్షణాలు స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. చర్మ రంద్రాలు ష్రింక్ అయ్యేందుకు సహాయపడుతుంది. నల్లమచ్చలను కనబడనివ్వకుండా మాయం చేస్తుంది.

ఎలా పనిచేస్తుంది

బాగా పండిన టమోటోలో నుండి గుజ్జును తీసి, అందులో ఫ్రెష్ గా ఉండే నిమ్మరసం ఒక టీస్పూన్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. టమోటో ఫేస్ మాస్క్ తొలగించిన తర్వాత, ముఖానికి కొద్దిగా బాదం నూనెతో మసాజ్ చేయడం వల్ల చర్మానికి తగినంత పోషణ అందుతుంది

స్కిన్ బ్రైటనింగ్ మాస్క్

స్కిన్ బ్రైటనింగ్ మాస్క్

టమోటోలో లైకోపిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఇది యూవీ రేస్ కు షీల్డ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అంతే కాకుండా, పెరుగులో నేచురల్ బ్లీచింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మానికి పోషణ అందిస్తుంది. చర్మం వైట్ గా మార్చుతుంది. తేనె మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ అందుతుంది. రేడియంట్ గ్లో వస్తుంది.

ఎలా పనిచేస్తుంది:

టమోటోను స్మూత్ పేస్ట్ లా చేసి, అందులో ఒక టీస్పూన్ తేనె చేర్చి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖం మరియు మెడకు అప్లై చేసి, 20 నిముషాలు తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత తేమను పూర్తిగా తుడిచుకోవాలి.

బ్లాక్ హెడ్స్ తొలగించే ఫేస్ మాస్క్

బ్లాక్ హెడ్స్ తొలగించే ఫేస్ మాస్క్

టమోటోల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. ఇది చర్మాన్ని శుభ్రం చేస్తుంది. చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. పంచదర అద్భుతమైన ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది.

ఎలా పనిచేస్తుంది:

బాగా పండిన టమోటోను రెండు స్లైస్ గా కట్ చేసి, దీనికి కొద్దిగా పంచదార మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని, ముఖానికి అప్లై చేసి, సర్క్యులర్ మోషన్ లో సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి . ఈ జ్యూస్ ను అప్లై చేసిన 5 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

ఆయిల్ కంట్రోలింగ్ మాస్క్ :

ఆయిల్ కంట్రోలింగ్ మాస్క్ :

టమోటో మోస్ట్ టెస్టెడ్ ఆయుర్వేదిక్ రెమెడీ. ఇది చర్మంలో ఆయిల్ ను కంట్రోల్ చేస్తుంది. టమోటోలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ సెబమ్ ప్రొడక్షన్ ను కంట్రోల్ చేస్తుంది. కీరదోసకాయలో 95% నీరు ఉంటుంది, ఇది చర్మానికి హైడ్రేషన్ అందిస్తుంది. ఇది ఇన్ఫ్లమేసన్ తగ్గిస్తుంది. ఇది చర్మంలో ఆయిల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.

ఎలా పనిచేస్తుంది.

టమోటోను రెండ్ గా కట్ చేసి తొక్క తొలగించి మిక్సీలో వేసి మొత్తగా చేసుకోవాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ కుకుంబర్ జ్యూస్ ను మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో 15 నిముషాలు పెట్టాలి. 15 నిముషాల తర్వాత ఫ్రిజ్ లో నుండి బయటకు తీసి, దీన్ని ముఖం మరియు మెడకు అప్లై చేయాలి. అరగంట అలాగే ఉండనిచ్చిన తర్వాత సర్క్యులర్ మోషన్ లో స్ర్కబ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

స్కిన్ టైటనింగ్ మాస్క్

స్కిన్ టైటనింగ్ మాస్క్

అవొకాడోలు యాంటీ సెప్టిక్ మరియు మాయిశ్చరైజింగ్ లక్షణాలున్నాయి, టమోటోలో యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఈ రెండింటిలోని లక్షనాలు చర్మ రంద్రాలను ముడుచుకుపోయాలా చేస్తాయి.కొల్లాజెన్ ప్రొడక్షన్ ను పెంచుతుంది. ఇది చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. చర్మంను టైట్ గా మార్చుతుంది.

ఎలా పనిచేస్తుంది:

అవొకాడోను మెత్తగా పేస్ట్ చేసి, అందులో ఒక టేబుల్ స్పూన్ టమోటో జ్యూస్ మిక్స్ చేయాలి. ఈ రెండు పదార్థాలు బాగా మిక్స్ అయ్యే వరకూ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముముఖానికి, మెడకు అప్లై చేసి డ్రైగా మార్చాలి. ఈ ఫేస్ మాస్క్ ను వారంలో రెండు సార్లు అప్లై చేస్తుంటే క్లియర్ స్కిన్ పొందుతారు.

హైడ్రేటింగ్ మాస్క్

హైడ్రేటింగ్ మాస్క్

బట్టర్ మిల్క్ లో ఉండే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మరియు మినిరల్స్ సన్ బర్న్ స్కిన్ కు ఉపశమనం కలిగిస్తుంది. స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. చర్మంలోపలికి చొచ్చుకుని పోయి , చర్మం లోపలి నుండి పోషణ అందిస్తుంది.

ఎలా పనిచేస్తుంది

రెండు టేబుల్ స్పూన్ల బట్టర్ మిల్క్ తీసుకుని, అందులో టమోటో జ్యూస్ ను మిక్స్ చేసి, బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులో కాటన్ బాల్ ను డిప్ చేసి, ఎక్సెస్ వాటర్ ను పిండేసి, కాటన్ తో ముఖం మరియు మెడకు అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ముడతలను మాయం చేసే ఫేస్ మాస్క్ :

ముడతలను మాయం చేసే ఫేస్ మాస్క్ :

ఆలివ్ ఆయిల్ మరియు టమోటోల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కిన్ ఎలాసిటిని పెంచుతాయి. అలాగే చర్మాన్ని అందంగా, తేమగా, టైట్ గా మార్చుతాయి.

ఎలా పనిచేస్తుంది:

ఒక టేబుల్ స్పూన్ టమోటో జ్యూస్ లో 10 చుక్కల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసి మసాజ్ చేయాలి. 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

Story first published: Tuesday, September 20, 2016, 11:01 [IST]
Desktop Bottom Promotion