Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డైలీ హ్యాబిట్సే.. మీ చర్మాన్ని డల్ గా మారుస్తున్నాయా ?
మనం మన చర్మ సంరక్షణ కోసం మనం పాటిస్తున్న అలవాట్లు అన్నీ మంచివే అని భావిస్తాం. బ్యూటిఫుల్ లుక్ కోసం.. చర్మానికి మనం చాలా టిప్స్ ఫాలో అవుతున్నాం అనుకుంటాం. ఖరీదైన చర్మ సంరక్షణ ప్రొడక్ట్స్, మంచి క్వాలిటీ ఉన్న మేకప్, మంచి ఆహారం తీసుకుంటున్నారు. కానీ.. చర్మం మాత్రం అన్ హెల్తీగా, డల్ గా కనిపిస్తోంది. ఎందుకు ?
అయితే కొన్ని సందర్భాల్లో మనం ఫాలో అవుతున్న కొన్ని హ్యాబిట్స్ మన చర్మానికి మనకు తెలియకుండానే డ్యామేజ్ చేస్తుంటాయి. అమేజింగ్ కాంప్లెక్షన్ పొందాలంటే.. కొంచెం మనం చర్మంపై కేర్ తీసుకోవడం చాలా అవసరం. కొద్దిగా చర్మ సంరక్షణ తీసుకోవడం చాలా అవసరం.
అలాగే.. మనం పాటిస్తున్న స్కిన్ కేర్ హ్యాబిట్స్ మంచివేనా, హెల్తీగా ఉన్నాయా అనేది కూడా ఆలోచించాలి. అయితే కొన్ని డైలీ హ్యాబిట్స్ మాత్రం.. చర్మం డ్యామేజ్ అవడానికి కారణమవుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వేడినీటి స్నానం
వేడి వేడి నీటితో ప్రతి రోజూ స్నానం చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. అది కూడా గంటల తరబడి చేస్తారు. దీనివల్ల సున్నితంగా ఉండే చర్మ కణాలు డ్యామేజ్ అవుతాయి. దీనివల్ల మీ చర్మం చాలా నిర్జీవంగా కనిపిస్తుంది. కాబట్టి.. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.

సన్ స్క్రీన్ వాడకపోవడం
చాలామంది సన్ స్క్రీన్ లోషన్స్ ని కేవలం సమ్మర్ లో మాత్రమే ఉపయోగిస్తారు. కానీ.. యూవీ రేడియేషన్స్ చర్మానికి ప్రతి సీజన్ లోనూ హాని చేస్తాయి. కాబట్టి.. ప్రతి రోజూ సన్ స్క్రీన్ అప్లై చేయడం మానేయకండి.

తరచుగా ఎక్స్ ఫోలియేట్ చేయడం
ఎక్స్ ఫోలియేషన్ అనేది చాలా ముఖ్యమైనది. కానీ తరచుగా ఎక్స్ ఫోలియేట్ చేయడం వల్ల చర్మం మాయిశ్చరైజర్ ని కోల్పోతుంది. దీనివల్ల చర్మం ఎక్కువగా డ్రై గా మారుతుంది.

యాక్నె
మొటిమలను గిల్లే అలవాటు చాలామందికే ఉంటుంది. ఇలా చేయడం వల్ల.. మొటిమల వల్ల మచ్చలు ఏర్పడతాయి. అలాగే.. మరింత ఎక్కువ అవడానికి కారణమవుతాయి.

స్మోకింగ్
స్కిన్ డ్యామేజ్ అవడానికి స్మోకింగ్ ఒక కారణం. చర్మం క్వాలిటీపై ప్రభావం చూపుతుంది. టాక్సిక్ స్మోక్ చర్మ కణాలను నాశనం చేసి.. ఏజింగ్ ప్రాసెస్ ని మరింత వేగవంతం చేస్తుంది.

యాంటీ బ్యాక్టీరియల్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం
సాధారణంగా యాంటీ బ్యాక్టిరియల్ సోప్స్, ప్రొడక్ట్స్ కేవలం శరీరానికి ఉపయోగిస్తారు. ఇది సున్నితంగా ఉండే ముఖంలోని స్కిన్ టిష్యూస్ పై దుష్ర్పభావం చూపి.. చర్మాన్ని మరింత సెన్సిటివ్ గా మారుస్తుంది.

డెర్మటాలజిస్ట్
చాలా సందర్భల్లో చర్మ సమస్యలను చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. కానీ.. చర్మ సమస్యలను వెంటనే ట్రీట్మెంట్ చేయడం వల్ల.. చర్మం డ్యామేజ్ అవకుండా అరికట్టవచ్చు. కాబట్టి ఏ చిన్న చర్మ సమస్య వచ్చినా.. వెంటనే నిపుణుల సలహా తీసుకోవాలి.



Click it and Unblock the Notifications