Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కొబ్బరి పాలు అందించే 8 అమేజింగ్ బ్యూటీ బెనిఫిట్స్
ముఖంలో మచ్చలేని చందమామలా ...వెండి వెన్నెలంత అందంగా మెరిసిపోవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ ప్రస్తుతం వాతావరణంలో పెరిగిపోతున్న కాలుష్యం, మొటిమలు, మచ్చలు, ముడుతలు, వంటివన్నీ అందాన్ని క్రమంగా తగ్గించేస్తున్నాయి. అందుకే పార్లర్ కు పరుగులు తీసి ఉన్న అందానికి అదనపు వన్నెలద్దుకుంటూనే సౌందర్యరాశిలా మారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు నేటి మహిళలు. అందుకు పార్లర్ కే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో లభ్యమయ్యే కొబ్బరిపాలను ఉపయోగించినా కూడా అందాన్ని చక్కగా సంరక్షించుకోవచ్చు...
కొబ్బరి ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. దాని నుంచి తీసిన పాలు ఔషధ గుణాల మిళితం వాటిని ఆహాంరంలోనే కాదు...అందాన్ని ద్విగుణీకృతం చేసేందుకూ వాడితే..ప్రకాశవంతమైన చర్మం సొంతమవుతుంది. సౌందర్య పోషణలో చర్మ సంరక్షణ చాలా ముఖ్యమైంది. అందుకే స్క్రబ్బింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ...వంటివి తరచూ చేస్తుంటారు. అయితే ఇందుకు కొబ్బరి పాలు చాలా బాగా ఉపయోగపడుతాయి. కేవలం చర్మానికే కాదు...కేశ సంరక్షణకు కూడా బాగా దోహదపడతాయి. అదెలాగో చూద్దాం:

తేమ అందిస్తుంది:
గోరువెచ్చని నీటిలో కొద్దిగా రోజ్ వాటర్, కొబ్బరి పాలు కలిపి ఈ మిశ్రమాన్ని స్నానికి ఉపయోగించాలి. ఈ విధంగా చేయడం వల్ల బాగా పాడైన చర్మం కూడా తిరిగి తాజాదనాన్ని సంతరించుకుంటుంది. కావాలనుకొంటే కొబ్బరి పాలను నేరుగా చర్మానికి అప్లై చేసుకుని సాప్ట్ గా మర్ధన కూడా చేసుకోవచ్చు. ఫలితంగా చర్మానికి తేమ అందడంతో పాటు చాలా సాప్ట్ గా మారుతుంది . అంటే చర్మానికి కొబ్బరి పాలు సహాజసిద్దంగా మాయిశ్చరైజర్ గా క్లెన్సర్ గా కూడా పనిచేస్తుంది.

మేని కాంతిమంతంగా:
దుమ్ము, ధూళి దాంతో పాటే కాలుష్యం ప్రభావంతో చర్మం కళ కోల్సోతుంది. నిర్జీవంగా మారుతుంది. ఇలాంటప్పుడు నలుగురిలోకి వెళ్లాలంటే ఇబ్బంది. ఈ సమస్యకు పరిష్కారం ప్రయత్నించాలంటే మాత్రం కొబ్బరి పాలను ఉపయోగించాల్సిందే అంటారు నిపుణులు కాసిని గులాబీ రేకలు, చెంచా తేనె, అరకప్పు కొబ్బరి పాలను బకెట్ గోరువెచ్చని నీటిలో వేసుకుని స్నానం చేయాలి. దాని వల్ల శరీరానికి తగిన తేమ అంది మేని కాంతిమంతంగా తయారవుతుంది.

క్లెన్సర్ తో మెరిసేదిలా:
అసలే చెమట, దానికి తోడు చర్మం పై పేరుకొన్న మురికి కొందరిని వేధిస్తుంది. దాంతో మొటిమలు, ఇతర చర్మ సంబంధ సమస్యలు సరేసరి. అలాంటప్పుడు ఇంటికి వచ్చాక కొబ్బరి పాలల్లో రెండు చుక్కల నిమ్మరసం కలిపి పది నిమిషాల తర్వాత అందులో దూదిని ముంచి ముఖమంతా అద్దుకోవాలి. కాసేపయ్యాక కడిగేస్తే మోముపై పేరుకొన్న మురికి తొలగి తాజాగా ఉంటుంది.

మృతకణాలు వదిలి మృదువుగా:
శరీరం పై మృతకణాలు పెరిగితే చర్మం బరకగా కనిపిస్తుంది. కాంతి తగ్గుతుంది. ఇలాంటప్పుడు కప్పు కొబ్బరి పాలల్లో, రెంచా చొప్పున బాదం, తులసి పొడులు, రెండు చుక్కల తేనె చేర్చాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిసాల తర్వాత కాసిన్ని నీటితో తడిపి నలుగులా రుద్దాలి. తర్వాత గోరువెచ్చెని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తుంటే మృత కణాలు తొలగి చర్మం మృదువుగా తయారవుతుంది.

చర్మ సమస్యలను నివారిస్తుంది :
కోకనట్ మిల్క్ లో ఉండే నేచురల్ ఫ్యాటీయాసిడ్స్ చర్మం యొక్క డ్రైనెస్, ఇన్ ఫ్లమేషన్ మరియు దురదను నివారిస్తుంది. దాంతో చర్మ సమస్యలైన ఎక్జిమా మరియు డెర్మటైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్ వంటి స్కిన్ కండీషన్ నివారించబడుతుంది . మరియు స్కిన్ ఇన్ఫెక్షన్ కు కారణం అయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది.

ముడుతలు రాకుండా చేస్తుంది:
కొబ్బరి పాలలో విటమిన్ సి, కాపర్ ఉండటం వల్ల వీటిని ఆహారంలో భాగంగా చేసుకున్నా లేదా చర్మానికి నేరుగా అప్లై చేసుకున్నా సౌందర్యపరంగా చక్కని ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. ఇవి చర్మాన్ని బిగుతుగా ఉండేలా చేసి ముడుతలు, సన్నని గీతలు నివారించడంతో పాటు చర్మం సాగకుండా సంరక్షిస్తాయి . ఫలితంగా వ్రుద్దాప్య ఛాయలు అంత తొందరగా దరిచేరవు.

శిరోజాల వృద్దికి:
అందంగా తేలియాడే కురులు సొంతం కావాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే వివిధ కారణాల వల్ల జుట్టు రాలిపోతుంటుంది. ఇలాంటి సమస్యలెదురైనప్పుడు కొబ్బరి పాలతో చికిత్స ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి పాలల్లో రెండు చుక్కల బాదం నూనె కలిపి తలంతా రాసుకోవాలి. ఆ మిశ్రమంలో సహజంగా ఉండే పొటాషియం, పోలేట్ తో పాటూ ఇతర ఖనిజాలు కురులకు అంది ఆరోగ్యంగా మారతాయి. అలాగే హెన్నా చేసుకొనేప్పుడు కొబ్బరి పాలు కలిపితే జుట్టు మెరుస్తుంది. ఒత్తుగా మారుతుంది.

పాదాల అందానికి :
ఎక్కువ మంది నిర్లక్ష్యం చేసే శరీరబాగం పాదాలు. వీటిని శుభ్రంగా ఉంచడంతో పాటూ అందంగా కనిపించేలా చేయడంలో కొబ్బరి పాలు లఎంతో మేలుచేస్తాయి. చిక్కని కొబ్బరి పాలల్లో కొన్ని తేనెచుక్కలు, రెండు టేబుల్ స్పూన్ల బియ్యపురవ్వ, బాదం నూనె కలిపి పాదాలకు పూతలా పట్టించి పదినిమిషాలు మృదువుగా మర్ధన చేయాలి. తర్వాత చన్నీటితో కడిగి మాయిశ్చరైజర్ రాస్తే మృదువైన పాదాలు మీ సొంతమవుతాయి.



Click it and Unblock the Notifications