Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
ముడుతలను మాయం చేసే అలోవెర జెల్ ట్రీట్మెంట్ ..
చర్మానికి వయస్సైతుందన్న విషయం ఒక యునివర్సల్ ఫ్యాక్ట్. వయస్సైయ్యే కొద్ది చర్మంలో స్థితిస్థాపకత (స్కిన్ ఎలాసిటి )తగ్గుతుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలోనూ కలిగే మార్పు. దీన్ని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు.
వయస్సైయ్యే కొద్ది చర్మంలో, ముడుతలు, ఫైన్ లైన్స్, డల్ స్కిన్, మొదలగు లక్షణాలు కనబడుతాయి. ఈ లక్షణాలను చూసిన వెంటనే చాలా మంది హైరానా పడిపోతుంటారు . ఫలితంగా నిర్జీవమైన చర్మంతో డల్ గా కనబడుతుంటారు.
చుండ్రుకి చెక్ పెట్టే అలోవెరా హెయిర్ ప్యాక్స్
ఇలాంటి పరిస్థితిలో పెరిగే వయస్సును ఆపలేము కానీ, వయస్సై చిహ్నాలు చర్మం మీద కనబడకుండా చేసుకోవచ్చు . అందుకోసం కొన్నిచిట్కాలను ఉపయోగించినట్లైతే ఈ లక్షణాలు కనబడకుండా చేయవచ్చు . వయస్సైయ్యే లక్షణాలు మరియు ముడుతలను ముఖంలో కనబడనివ్వకుండా చేయవచ్చు.
అందుకు మెడిసినల్ ప్లాట్స్ అలోవెర(కలబంద)ను విరివిగా ఉపయోగిస్తున్నారు. పురాతన కాలం నుండి దీన్ని సౌందర్య సాధానంగా ఉపయోగిస్తున్నారు. ఈ ఔషధ మొక్కలో విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైటో న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. ఇది ముఖంను ప్రకాశవంతంగా మార్చడానికి ఇది ఒక అద్భుత మార్గం.
ప్రతి రోజూ ఉదయం అలోవెరా జ్యూస్ త్రాగితే పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్
ముఖం చర్మంలో ఎలాసిటి తగ్గిపోవడం వల్ల చర్మం పల్చగా మారుతుంది. ఈ ఎలాసిటిని పెంచుకోవడానికి కొన్ని వందల సంవత్సరాల నుండి కలబందను సౌందర్య ఉత్పత్తుల్లో ఒకటిగా వినియోగిస్తున్నారు. . మరియు చర్మం అందంగా..కాంతివంతంగా కనబడేలా చేస్తుంది. మరి స్కిన్ ఎలాసిటి పెంచుకోవడంతో పాటు, చర్మంలో ముడుతలకు కనబడకుండా, చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ అండ్ సింపుల్ చిట్కాలను ఈ క్రింది విధంగా ..

అలోవెర ఫేస్ మాస్క్:
అలోవెర జెల్, తేనె, మరియు పాలను సమంగా తీసుకోవాలి.
అందులోనే రోజ్ వాటర్ కొన్ని చుక్కలు , కొద్దిగా పసుపు వేసి వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ ను వారానికొకసారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అలోవెర స్ర్కబ్:
అలోవెర జెల్ మరియు ఆలివ్ ఆయిల్ ను సమంగా తీసుకోవాలి. . వీటిని 1/4కప్పు బ్రౌన్ షుగర్ తో మిక్స్ చేయాలి . ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి 10నిముషాల సున్నితంగా స్క్రబ్ (మసాజ్ )చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కలబంద, పెరుగు మరియు కీరదోస:
ఒక టేబుల్ స్పూన్ పెరుగులో 2 టేబుల్ స్పూన్ల అలోవెర జెల్ మిక్స్ చేసి, ఒక కప్పు కీరదోస జ్యూస్ లో మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మరియు బాడీ మొత్తం కూడా అప్లై చేసి సున్నితమైన మసాజ్ చేసి 30నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

అలోవెర, ఆలివ్ ఆయిల్ , గుడ్డు:
ఒక గడ్డు పచ్చసొనలో అలోవెర జెల్ మరియు ఆలివ్ ఆయిల్ ను సమంగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయాలి. 20నిముషాలు సున్నితంగా మసాజ్ చేయాలి . 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . వారంలో రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అలోవెర మరియు విటమిన్ ఇ:
విటమిన్ ఇ క్యాప్స్యూల్ ను బేక్ చేసి అందులోని విటమిన్ ఇ ఆయిల్ ను తీసుకొని, దీనికి ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్ మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 20నిముషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో ముడుతలు నివారించబడి, చర్మం కాంతివంతంగా మారుతుంది.

అలోవెర మరియు నిమ్మ:
రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసంలో 1 టేబుల్ స్పూన్ అలోవెర జెల్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముడుతలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. 20నిముషాలు అలాగే ఉండనివ్వాలి . తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . ఈ పద్దతిని రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే తప్పనిసరిగా మార్పు చూస్తారు.

అలోవెర, తేనె మరియు ఓట్స్ పౌడర్:
అలోవెర జెల్ కు కొద్దిగా తేనె మరియు ఓట్స్ పౌడర్ ను మిక్స్ చేయాలి. తర్వాత 20నిముషాలు స్ర్కబ్ చేయాలి. గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

అలోవెర మరియు బొప్పాయి:
ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్ కు 2 టేబుల్ స్పూన్ల బొప్పాయిని మిక్స్ చేసి పేస్ట్ చేసి ముడుతలున్న ప్రదేశంలో అప్లై చేయాలి 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications