For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోళీ రంగులను తొలగించటానికి 8 హోమ్ మెడ్ పేస్ పాక్స్

By Super
|

భారత దేశంలోని పండుగలలో దీపావళి రోజున దీపాలు,హోలీ రోజున రంగులతో ఉల్లాసంగా గడుపుతారు. దేశ వ్యాప్తంగా ఈ పండుగను ఒక అద్భుతమైన అనుభూతితో జరుపుకుంటారు.

దేశంలో ప్రతి రాష్ట్రానికి హోలీ పండుగ ఆచారాల్లో తేడాలు ఉంటాయి. కానీ సందర్భం మాత్రం ఒకటే. ఎవరైనా సరే ఈ పండుగ రోజున రంగులను ఉపయోగించవలసిందే. ఈ పండుగ రోజు ఆత్మీయులకు రంగులను పూస్తారు.

సాదారణంగా హోలీ రోజున ప్రజలు రంగులను పొడి మరియు ద్రవాల రూపంలో ఉపయోగిస్తారు. అయితే ఈ రంగులను చర్మం నుండి వదిలించుకోవటం చాలా కష్టం.

ముఖ్యంగా పొడి చర్మం వారికీ ఈ రంగుల కారణంగా చర్మం చికాకు, ఎరుపు, దురద మరియు అనేక ఇతర చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖం మీద హోలీ రంగులను వదిలించుకోవటానికి 8 సహజ మార్గాలను తెలుసుకుందాం. ఈ మార్గాల ద్వారా ముఖం మీద రంగులను సమర్ధవంతంగా తొలగించుకోవచ్చు.

నేడు మార్కెట్ లో మూలిక రంగులు అందుబాటులో ఉన్నాయి. ఇవి చర్మానికి ఎటువంటి హాని కలిగించవు. అందువల్ల ఈ రంగులను ఉపయోగించటానికి ప్రయత్నించండి.

హోలీ రంగులను వదిలించుకోవటానికి 8 సమర్ధవంతమైన ఇంటి పాక్స్ ఉన్నాయి. ఈ రంగులను తొలగించటానికి చర్మాన్ని రుద్దనవసరం లేదని గుర్తుంచుకోండి.

ఈ ఫేస్ పాక్స్ వాడుట వలన చర్మానికి ఎటువంటి హాని కలగదు. కొన్ని రోజుల్లోనే హోలీ రంగు పోతుంది. కాబట్టి ఇక్కడ చెప్పుతున్న ఇంటి ఫేస్ ప్యాక్ లను ప్రయత్నించండి.

1. హోలీ ముందు

1. హోలీ ముందు

ఫేస్ ప్యాక్ రాయటం వలన రంగులను ఖచ్చితంగా తొలగించలేము. కానీ ముందు జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం రంగులను సులభంగా తొలగించుకోవచ్చు. మీరు కుటుంబం మరియు స్నేహితులతో హోలీ పండుగను జరుపుకొనే ముందు చర్మం మీద ఆలివ్ లేదా కొబ్బరి నూనెను రాయాలి. పురుషులు హోలీకి రెండు రోజుల ముందు షేవ్ చేసుకోకూడదు. హోలీ తర్వాత షేవ్ చేసుకుంటే రంగులు సులభంగా బయటకు వస్తాయి.

2. శనగ పిండి, పెరుగు ప్యాక్

2. శనగ పిండి, పెరుగు ప్యాక్

మీ చర్మం పొడి చర్మం అయితే, రంగులు చర్మాన్ని మరింత పొడిగా మార్చేస్తాయి. శనగపిండిలో పెరుగు,కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి పేస్ట్ తయారుచేయాలి. ఈ పేస్ట్ ని మెడ మరియు ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత సాదారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. బాదం మరియు హనీ ప్యాక్

3. బాదం మరియు హనీ ప్యాక్

హోలీ రంగులను తొలగించటానికి ఇంటిలో తయారుచేసే పాక్స్ కోసం ఎదురు చూస్తున్నారా? బాదాం పొడిలో తేనే, కొంచెం పాలు,కొన్ని చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. ఈ పేస్ట్ ని మెడ మరియు ముఖానికి రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

4. మసూర్ దాల్ మరియు ఆరెంజ్ పీల్ ప్యాక్

4. మసూర్ దాల్ మరియు ఆరెంజ్ పీల్ ప్యాక్

ఇది జిడ్డు చర్మం కల వారిలో హోలీ రంగులను తొలగించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. మసూర్ దాల్ మరియు ఎండిన నారింజ పై తొక్కలను పొడిగా గ్రైండ్ చేయాలి. ఈ పొడిలో రోజ్ వాటర్,కొన్ని చుక్కల నిమ్మరసం వేసి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి ఆరిన తర్వాత శుభ్రంగా కడగాలి.

5. అరటి ప్యాక్

5. అరటి ప్యాక్

హోలీ రంగులను తొలగించుకోవటానికి మరొక సమర్ధవంతమైన ఫేస్ ప్యాక్. బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి దానిలో తేనే,పాలను సమాన పరిమాణంలో కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని మెడ మరియు ముఖానికి రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

6. శనగ పిండి, బియ్యం పిండి ప్యాక్

6. శనగ పిండి, బియ్యం పిండి ప్యాక్

శనగ పిండి, బియ్యం పిండిలను సమాన పరిమాణంలో తీసుకోని దానిలో అరస్పూన్ పసుపు కలపాలి. దీనిలో రోజ్ వాటర్ కలిపి పేస్ట్ గా చేయాలి. పసుపు ఏంటి సెప్టిక్ ఏజెంట్ గా పనిచేసి చర్మం మీద దద్దుర్లు రాకుండా చేస్తుంది.

7. నిమ్మరసం మరియు కలబంద జెల్

7. నిమ్మరసం మరియు కలబంద జెల్

కలబంద జెల్ లో నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక బాల్ సాయంతో ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

8. ముల్తాన మిట్టీ ప్యాక్

8. ముల్తాన మిట్టీ ప్యాక్

ముల్తాన మిట్టీలో నీటిని కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని మెడ మరియు ముఖానికి రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

8 Homemade Face Packs To Remove Holi Colour

It won’t be an exaggeration if you call India the country of festivals. If Diwali is the festival of lights and joy, Holi is the festival of colours. Throughout the country, this festival is celebrated with an awesome feel of colours and rejoices.
Story first published: Wednesday, March 23, 2016, 14:24 [IST]
Desktop Bottom Promotion