అసహ్యంగా కనిపించే తెల్లమచ్చలు తగ్గించే హోం రెమిడీస్ ?

By Swathi

కొంతమందికి చర్మంపై తెల్ల మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖంపై, చేతులపై, శరీరంలో కొన్ని భాగాల్లో ఉన్నట్టుండి కనిపిస్తూ ఉంటాయి. అసలు ఇవి ఎందుకు వచ్చాయి ? ఎప్పుడు వచ్చాయి అన్న విషయం కూడా తెలియదు చాలా మందికి. అయితే ఈ తెల్లమచ్చలు ఏర్పడితే.. చూడ్డానికి అసహ్యంగా ఉంటాయి. ఏదో వ్యాధి ఉందేమో అన్న ఫీలింగ్ కలిగిస్తాయి. అయితే.. ఈ తెల్లమచ్చల గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.

మెలనైన్ ఉత్పత్తిని బట్టి స్కిన్ టోన్ ఆధారపడి ఉంటుంది. ఒక వేళ మీ చర్మం ఎక్కువ మెలలైన్ ని ఉత్పత్తి చేస్తే.. మీ చర్మం నల్లగా మారుతుంది. మెలలైన్ ఉత్పత్తి తగ్గడం వల్ల చర్మం తెల్లగా ఉంటుంది. అయితే కొంతమంది చర్మం రంగుకి సరిపోని విధంగా వైట్ ప్యాచెస్ ఏర్పడి ఉంటాయి.

ఈ తెల్ల మచ్చలు ఎందుకు వస్తాయో తెలుసా ? మెలనైన్ ఫంక్షన్ నిలిచిపోయినప్పుడు ఇవి ఏర్పడతాయి. ఈ తెల్లమచ్చలు శరీరంలో ఏ భాగంలో అయినా కనిపించవచ్చు. ఇలా తెల్లమచ్చలు ఏర్పడటాన్ని విటిల్గో అని పిలుస్తారు. ఈ తెల్లమచ్చలను న్యాచురల్ రెమిడీస్ తో నివారించడమే కాదు.. . శరీరమంతా వ్యాపించకుండా అరికట్టవచ్చు.

ఈ తెల్లమచ్చలకు జన్యుపరమైన లోపాలు, కెమికల్ రియాక్షన్స్, వైరల్, న్యురల్ కారణాల వల్ల ఏర్పడతాయని స్టడీస్ చెబుతున్నాయి. కొన్ని మెడికల్ కండిషన్స్ లో కూడా ఈ తెల్లమచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి తెల్లమచ్చలు కనిపించగానే.. న్యాచురల్ రెమిడీస్ ఉపయోగిస్తే.. శరీరమంతా వ్యాపించకుండా తగ్గించవచ్చని సూచిస్తున్నారు.

అల్లం

అల్లం

అల్లం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల తెల్లమచ్చలు నయం అవుతాయి. అల్లం, నిమ్మరసం, నీళ్లు కలుపుకుని రోజుకి రెండుసార్లు తాగడం వల్ల.. తెల్లమచ్చలు నివారించవచ్చు. అలాగే అల్లం పేస్ట్ తయారు చేసుకుని.. తెల్లమచ్చలపై రాసినా మంచి ఫలితం ఉంటుంది.

పసుపు

పసుపు

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి కాబట్టి.. ఇన్ఫెక్షన్స్ ని నివారిస్తుంది. ఆవనూనెతో పసుపుని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని రోజుకి రెండుసార్లు తెల్లమచ్చలపై రాసుకుంటే.. ఫలితం ఉంటుంది. లేదంటే.. వేపాకులను పేస్ట్ లా చేసి కొద్దిగా పసుపు కలిపి.. నీళ్లు కలుపుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ని తెల్లమచ్చలపై రాసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల తెల్లమచ్చలు తగ్గిపోతాయి.

వెనిగర్

వెనిగర్

ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల తెల్ల మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. అలాంటప్పుడు వెనిగర్ చక్కటి పరిష్కారం. ముందుగాచర్మాన్ని శుభ్ర పరుచుకుని.. తెల్ల మచ్చలపై వెనిగర్ ను కాటన్ బాల్ తో అప్లై చేయాలి. వారంపాటు వెనిగర్ అప్లై చేస్తే.. సమస్య తగ్గుతుంది.

తేనె

తేనె

తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల.. ఇది తెల్లమచ్చలు నివారించడానికి సహాయపడుతుంది. తేనెను తెల్లమచ్చలపై డైరెక్ట్ గా అప్లై చేస్తే.. మంచి ఫలితం పొందవచ్చు.

సూర్యరశ్మి

సూర్యరశ్మి

సూర్య కిరణాలు తగిలేలా కొంతసమయం ఎండలో గడిపితే.. తెల్లమచ్చలు నివారించవచ్చు. సూర్య కిరణాలు మెలనైన్ ఉత్పత్తిని మెరుగుపరిచి.. తెల్లమచ్చలు రాకుండా అరికడతాయి.

తులసి ఆకు

తులసి ఆకు

తులసి ఆకుల పేస్ట్ ని రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల చర్మంపై ఏర్పడిన తెల్లమచ్చలు నివారించవచ్చు. మెరుగైన ఫలితాలు పొందాలంటే.. తులసి ఆకులను నీళ్లలొ ఉడకబెట్టి పసుపు కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ని తెల్లమచ్చలపై రాసి.. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

క్యాబేజ్

క్యాబేజ్

తెల్ల మచ్చలు నివారించడంలో క్యాబేజ్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. క్యాబేజ్ జ్యూస్ ని తెల్లమచ్చలపై అప్లై చేసి.. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. తెల్ల మచ్చలు కనుమరుగవడమే కాదు.. ఇతర ప్రాంతాల్లో ఏర్పడకుండా ఉంటాయి. ఈ రెమెడీని.. రెగ్యులర్ గా ఫాలో అయితే.. తెల్లమచ్చలు తగ్గిపోతాయి.

ముళ్లంగి విత్తనాలు ( రాడిష్ సీడ్స్ )

ముళ్లంగి విత్తనాలు ( రాడిష్ సీడ్స్ )

మెలనైన్ ఉత్పత్తిని పెంచడానికి ముళ్లంగి విత్తనాలు చక్కటి పరిష్కారం. కొన్ని ముళ్లంగి విత్తనాలను మెత్తగా పౌడర్ చేయాలి. వెనిగర్ లో మిక్స్ చేసి.. ఈ పేస్ట్ ని తెల్లమచ్చలపై అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా 6 నెలలు చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

Story first published: Friday, April 29, 2016, 17:30 [IST]
Desktop Bottom Promotion