Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
20లలో ఉన్నవాళ్లు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన బ్యూటీ టిప్స్
యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఏది చేయాలన్నా ఉత్సాహం, ఎనర్జీ ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ.. ఏదీ చేయాలనిపించదు. ఓపిక ఉండదు. సమయం అంతకన్నా ఉండదు. దీంతో హెల్త్ విషయంలో, బ్యూటీనెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. కొంతమందికి ఇలాంటివి చేసే ఓపిక లేదంటూ.. ఫీలవుతుంటారు.
అందుకే 20 ఏళ్లకు ముందు చాలా ఎట్రాక్టివ్ గా ఉంటారు. జుట్టు పొడవుగా ఉంటుంది. స్కిన్ గ్లోయింగ్ గా ఉంటుంది. అదే 30లోకి అడుగుపెడుతున్నారంటే చర్మం నిర్జీవంగా మారుతుంది. 20లలో ఉన్నప్పుడు యూత్ ఫుల్ గా ఉండే స్కిన్ పై జాగ్రత్త తీసుకోకపోతే.. మీరు చాలా కోల్పోవాల్సి వస్తుంది.
కాబట్టి 20లలో చాలా అందంగా కనిపించడం అవసరం. ఎదుటి వాళ్లను ఎట్రాక్ట్ చేయడానికి ఇది కరెక్ట్ ఏజ్. జాబ్స్, పార్టీలు.. ఎక్కడైనా మీరే స్పెషల్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారాలంటే.. ఖచ్చితంగా కొన్ని నియామాలు, జాగ్రత్తలు పాటించాలి. మరి 20లలో ఉండే ముద్దుగుమ్మలు తీసుకోవాల్సి బ్యూటీ సీక్రెట్స్ ఏంటో చూద్దామా..

యాంటీ ఏజింగ్
ఈ ఏజ్ లో ఖచ్చితంగా యాంటీ ఏజింగ్ క్రీమ్స్ ఉపయోగించాలి. ముఖ్యంగా ఫేస్, నెక్, కళ్ల కింద వీటిని ఉపయోగించాలి. 25 ఏళ్లు దాటాయి అంటే.. వయసు పెరుగుతున్న చాయలు కనిపిస్తాయి. కాబట్టి ఈ టిప్ కంపల్సరీ ఫాలో అవ్వాలి.

స్కిన్ కేర్
క్లెన్సింగ్, టోనింగ్, ఎక్స్ఫోయిటింగ్, మాయిశ్చరైజింగ్.. ఈ నాలుగు ఖచ్చితంగా పాటించాలి. ఈ నాలుగు చేయడం వల్ల.. చర్మం హెల్తీగా, మెరుస్తూ ఉంటుంది. ఎక్కువ సమయం ఫ్రెష్ గా కనిపిస్తుంది.

సన్ స్క్రీన్
సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయకుండా.. ఇంట్లో నుంచి బయటకువెళ్లకండి. యూవీ రేస్ కారణంగా.. చర్మంపై దుష్ర్పభావం చూపి.. ప్రీమెచ్యూర్ ఏజింగ్ కి కారణమవుతాయి. అలాగే ముడతలు, గీతలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది.

ఆల్కహాల్
ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి. 20లలో ఎక్కువగా పార్టీలకు వెళ్తూ ఉంటారు. కానీ.. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటే.. చర్మానికి మంచిది కాదని గుర్తుంచుకోండి.

మేకప్
మేకప్ వేసుకున్న తర్వాత దాన్ని తొలగించుకోవడం మర్చిపోకండి. రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా క్లెన్సర్ ఉపయోగించే మేకప్ తొలగించాలి. దీనివల్ల దురద, యాక్నె, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు దూరంగా ఉంటాయి.

గోరువెచ్చని నీళ్లు
వేడినీళ్లకు బదులు గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. వేడినీళ్లు ఉపయోగిస్తే.. ఏజింగ్ సమస్య త్వరగా మొదలవుతుంది. అలాగే జుట్టు డ్రై అవుతుంది.

డైట్
పోషకాహారం తీసుకోవాలి. దీనివల్ల మెటబాలిజం, ఇమ్యునిటీ ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే గ్లోయింగ్ స్కిన్, హెల్తీ హెయిర్ అందించడంలో డైట్ సహాయపడుతుంది.

సన్ గ్లాసెస్
ఎండకు బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా సన్ గ్లాసెస్ ఉపయోగించండి. ఇవి కళ్లకు రక్షణ కల్పించడంతో పాటు, కళ్ల చుట్టు వయసు పెరిగినట్టు చేసే గీతలు ఏర్పడకుండా.. కాపాడతాయి.

జుట్టుకి ఆయిల్
జుట్టుకి ఆయిల్ పెట్టడం, స్కాల్ప్ కి మసాజ్ చేయడం చాలా అవసరం. వారానికి రెండుసార్లు ఇలా చేయాలి. దీనివల్ల ప్రీమెచ్యూర్ గ్రెయింగ్ హెయిర్ నివారించవచ్చు. 20లలో ఉన్నప్పుడే జుట్టు తెల్లబడే సమస్యకు ఇదే ముఖ్య కారణం.



Click it and Unblock the Notifications