Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఆయిల్ స్కిన్ ఉన్నవారు వింటర్లో తీసుకోవల్సిన జాగ్రత్తలు ..!
వింటర్లో కూడా ఈ సమస్యలు అధికంగా ఉంటాయి. వింటర్ లో పొడి గాలుల ప్రభావం వల్ల చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ను తొలగించడం వల్ల ముఖం జిడ్డుగా మారుతుందని అనుకుంటారు.
చాలా మంది అమ్మాయి లేదా అబ్బాలు అస్తమానం అద్దం ముందు నిలబడే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు. ఇంకా చేప్పాలంటే చర్మ సమస్యలున్నప్పుడు ఇంకొద్దిసేపు ఎక్కువగా నిలబడి మొటిమలు, మచ్చలు, నల్లని వలయాలను ఎలా నివారించుకోవాలని చూస్తుంటారు . వీటికి తోడు ఆయిల్ స్కిన్ ఉన్నట్లైతే మరికొంత ఇరిటేషన్ పొందుతారు. ముఖంలో జిడ్డు, షైనింగ్ ప్యాచెస్ ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. ఇటువంటి సమస్యలు టీనేజ్ లో ఎక్కువ. అంతే కాదు సీజన్స్ బట్టి కొంత మందిలో కొత్తగా సమస్యలు వస్తుంటాయి.

వింటర్లో కూడా ఈ సమస్యలు అధికంగా ఉంటాయి. వింటర్ లో పొడి గాలుల ప్రభావం వల్ల చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ను తొలగించడం వల్ల ముఖం జిడ్డుగా మారుతుందని అనుకుంటారు. అయితే అది నిజం కాదు, వారి చర్మ తత్వాన్ని బట్టే చర్మం ఆయిలీగా కనబడుతుంది. వింటర్ అయినా, సమ్మర్ అయినా ఆయిల్ స్కిన్ నివారించుకోవడానికి స్పెషల్ గా కేర్ తీసుకోవాలి. వింటర్ లో ఆయిల్ స్కిన్ ఏలా నివారించుకోవాలో ఒకసారి తెలుసుకుందాం...

మన్నికైన, ఉపయోగకరమైన మాయిశ్చరైజర్ ను ఎంపిక చేసుకోవాలి
ఆల్రెడి జిడ్డు సమస్యతో బాధపడే వారు ఆయిల్ ఫ్రీ కలిగిన మాయిశ్చరైజర్ ను ఎంపిక చేసుకోవాలి. వింటర్ లో కూడా అలాంటిదే ఎంపిక చేసుకోవాలి. చాలా వరకూ మాయిశ్చరైజర్ అన్ని చర్మ తత్వాన్ని బట్టి తయారుచేస్తుంటారు. విటమిన్ ఇతో తయారుచేసిన మాయిశ్చరైజర్ ను ఎంపిక చేసుకోవాలి. అలాగే ఫేస్ వాష్ చేసిన ప్రతి సారి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

ఎక్సఫ్లోయేట్
హెల్తీ స్కిన్ టోన్ మెయింటైన్ చేయడానికి చర్మానికి రెగ్యులర్ గా క్లెన్సింగ్, ఎక్స్ఫ్లోయేటింగ్ చాలా అవసరం. హెల్తీ స్కిన్ టోన్ పొందడానికి విటిమన్ ఇ ఎంపిక చేసుకోవాలి. దీన్ని వారంలో రెండు సార్లు ఎంపిక చేసుకోవడం వల్ల వండర్ ఫుల్ రిజల్ట్ పొందవచ్చు .

పెట్రోలియం జెల్లీని అవాయిడ్ చేయాలి
ముఖానికి, పెదాలకు పెట్రోలియం జెల్లీ అప్లై చేయడం అవాయిడ్ చేయాలి. పెదాలు పగినప్పుడు మెడికేషన్స్ మరియు హెర్బల్ లిప్ బామ్ ను ఉపయోగించాలి.

టీట్రీ ఆయిల్ :
వింటర్ లో హాట్ వాటర్ తో స్నానం చేయడం చాలా మందికి అలవాటు. హాట్ వాటర్ తో స్నానం చేయడం వల్ల చర్మంలో నేచురల్ ఆయిల్ తగ్గిపోతాయి. కాబట్టి, హాట్ వాటర్ కు బదులు గోరువెచ్చని నీటితో స్నానం చేసుకోవాలి. స్నానం చేసే నీటిలో టీట్రీ ఆయిల్ మిక్స్ చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల చర్మంలో మాయిశ్చరైజర్ కోల్పోకుండా చేస్తుంది. స్కిన్ సమస్యలను నివారిస్తుంది. చర్మం తేమగా..సాప్ట్ గా మారుతుంది.

హైడ్రేషన్
సమ్మర్లోనే కాదు, వింటర్లో కూడా శరీరానికి తగినంత హైడ్రేషన్ అవసరం అవుతుంది. కాబట్టి, 8 నుండి 10 గ్లాసుల నీళ్ళను రోజూ తాగడం మంచిది. ఇది చర్మం హైడ్రేషన్ లో ఉండటానికి సహాయపడుతుంది. శరీరంలో టాక్సిక్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది. దాంతో చర్మ రంద్రాల్లోని బ్యాక్టీరియా కూడా తొలగిపోయి, క్లియర్ స్కిన్ పొందవచ్చు.

ఆయిల్ ఫ్రీ మేకప్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించాలి:
ఫౌండేషన్ క్రీమ్ కొనేటప్పుడు లిక్విడ్ కానీ, క్రీమ్ కానీ, ఆయిల్ ఫ్రీ మరియు వాటర్ బేస్డ్ ఎంపిక చేసుకోవడం మంచిది. రెగ్యులర్ మేకప్ ప్రొడక్ట్స్ లో నేచురల్ ఆయిల్స్ అధికంగా ఉంటాయి. రెగ్యులర్ మేకప్ ప్రొడక్ట్స్ లో ఉండే నేచురల్ ఆయిల్స్ చర్మానికి అంత మంచిది కాదు, పౌడర్ బేస్డ్ ప్రొడక్ట్స్ ను ఎంపిక చేసుకోవడం మంచిది. పౌడర్ బేస్డ్ ఎంపిక చేసుకుంటే ఎక్కువ సమయం నిల్చి వుఉంటుంది.

మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉన్న ప్రొడక్ట్స్ ను ఎంపిక చేసుకోవాలి:
వింటర్ లో సోప్ బార్స్ కంటే బాడీ వాష్ ను ఉపయోగించడం మంచిది. సోప్ బార్స్ లో మాయిశ్చరైజింగ్ ఎలిమెంట్స్ ను ఎంపిక చేసుకోవడం మంచిది. గ్లిజరిన్ మరియు నేచురల్ ఆయిల్స్ కలిగిన సోప్స్ ఎంపిక చేసుకోవడం, ఆరోగ్యానికి మంచిది. ముఖానికి ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ ను ఎంపిక చేసుకోవాలి.

క్లీన్ గా ఉన్న టవల్స్ ఎంపిక చేసుకోవాలి
ఉతికిన టవల్స్, క్లీన్ గా ఉన్న టవల్స్ ను ఉపయోగించడం వల్ల ఆయిల్ స్కిన్ నివారించుకోవచ్చు. స్కిన్ బ్రేక్ అవుట్స్ ను నివారిస్తుంది. ఫేస్ వాష్ తర్వాత చర్మ తడిలేకుండా చూసుకోవాలి. అదే టవల్ ను బాడీకి మరోసారి ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియా ట్రాన్స్ ఫర్ అవుతుంది. వారానికి ఒకటి రెండు సార్లు టవల్స్ ను ఉతకి, ఎండలో వేయడం మంచిది.

క్లెన్స్, టోన్ మరియు మాయిశ్చరైజర్
రొటీన్ గా చేసే క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ చర్మాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది, ప్రతి సీజన్ లో ఇలా ఫాలో అవ్వడం మంచిది. అయితే వాటర్ బేస్డ్ క్లెన్సర్, టోనర్స్ ను ఎంపిక చేసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications