Latest Updates
-
మాతృ దినోత్సవం రోజున భార్య, అమ్మ మధ్య నలిగిపోతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గొడవలు ఉండవు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా?
అలర్ట్ : సమ్మర్ లో స్కిన్ డ్యామేజ్ కాకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు ...
సాధారణంగా కంటే వేసవి సీజన్ లో బయటకు వెళ్ళే ముందు కొంచెం వెనక ముందు ఆలోచించాలి. ఎందుకంటే మిగిలిన రోజుల్లో కంటే వేసవి రోజుల్లో సూర్యుని నుండి వెలువడే యూవీ కిరణాలు చర్మం మీద తీవ్ర ప్రభావాన్ని చూపి, వయస్సు మీద పడే లక్షణాలను సూచిస్తాయి. ముఖ్యంగా సన్ యూవీ రేస్ వల్ల చర్మంలో ముడుతలు, ఫైన్ లైన్స్, స్పాట్స్ మరియు స్కిన్ క్యాన్సర్ వంటి లక్షణాలను చూపుతాయి . ఈ వేసవి సీజన్ లో ఎండలో ఒక నిముషం ఉంటే చాలు స్కిన్ డ్యామేజ్ అవ్వడానికి ...
కాబట్టి, సమ్మర్ సీజన్ లో చర్మం మీద మరింత ఎక్కువ శ్రద్ద తీసుకొని ..తగి జాగ్రత్తలు పాటించినట్లైతే చర్మం డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు వేసవిలో చర్మంలోని మాయిశ్చరైజర్ కోల్పోవడంతో పాటు, అదనపు చెమటలు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ , జిడ్డు, మొటిమలు ఇవన్నీ కూడా చర్మ సౌందర్యాన్ని మరింత అద్వాన్నంగా మార్చుతాయి.
సమ్మర్లో బ్యూటీ సమస్యలను నివారించే బనానా ఫేస్ ప్యాక్స్
అందుకోసం కొన్ని సమ్మర్లో అనుసరించాల్సిన కొన్ని టిప్స్ మీ ముందు ఉంచుతున్నాము . వేసవిలో బయట వెళ్లాల్సి వస్తే , టాక్సిక్ కెమికల్స్ మరియు స్మోక్ మరియు కాలుష్యం చర్మం రంద్రాల్లోకి చేరి వేడికి పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. చర్మ రంద్రాలు ఓపెన్ అవ్వడం వల్ల బ్లాక్ హెడ్స్, మొటిమలు, మరియు మచ్చలు తీవ్రరూపం దాల్చుతాయి . ముఖ్యంగా ఆియల్ స్కిన్ ఉన్నవారు వేసవిలో మొటిమలు రావడానికి మరింత ఎక్కువ అవకాశం ఉన్నది . మరి ఈ వేసవిలో హెల్తీ స్కిన్ పొందడానికి సరైన స్కిన్ కేట్ టిప్స్ ను అనుసరించడం మంచిది.
మరి సమ్మర్లో అనుసరించాల్సిన ఆ ఎఫెక్టివ్ టిప్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

పౌడర్ మినిరల్ ఫౌండేషన్ ఉపయోగించాలి:
ఆయిల్ బేస్డ్ ఫౌండేషన్ వింటర్ సీజన్లో మాత్రమే మంచిది . సమ్మర్లో వీటిని ఉపయోగించడం వల్ల మొటిమలు, మచ్చలు ఏర్పడుతాయి . కాబట్టి వేసవిలో సన్ స్క్రీన్ లక్షణాలు కలిగిన మినిరల్ ఫౌండేషన్ ను ఉపయోగించాలి . ఇవి చర్మానికి రక్షణ కల్పించడం మాత్రమే కాదు. ఫౌడేషన్ ను సర్వ్ చేస్తుంది . వేసవిలో బెస్ట్ నేచురల్ స్కిన్ కేర్ టిప్ లో ఇది ముఖ్యమైనది.

టానింగ్ మాయిశ్చరైజర్:
సన్ బర్న్ మరియు సూర్యుని నుండి వెలువడే హానికరమైన యూవీ రేస్ నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి స్కిన్ మాయిశ్చరైజర్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది చర్మం మీద డార్క్ టింట్ గా ఉంటుంది . దాంతో సూర్య కిరణాల నుండి చర్మానికి రక్షణ కవచంలా ఉంటుంది. వేసవిలో చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఇది ఒక బెస్ట్ చిట్కా.

ఎండలో వెళ్లడానికి ముందు మాయిశ్చరైజ్ చేయాలి:
వేసవిలో , శరీరంలో వేడి , బయట వేడి వల్ల ఎక్కువగా చెమటలు పడుతుంటాయి. ఎప్పటికప్పుడు తుడుచుకుంటుంటాము . ఇలా చేయడం వల్ల చర్మంలో నేచురల్ ఆయిల్స్ కోల్పోవడం జరగుతుంది . దాంతో చర్మం మరింత డ్రైగా మారి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి, మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం మర్చిపోకూడదు . మంచి మన్నికైన లోషన్ ను మరియు హాట్ అండ్ హుముడిటికి సరిపోయే వాటిని ఎంపిక చేసుకోవాలి.

హ్యాట్ లేదా స్కార్ఫ్ తో తలను కవర్ చేయాలి:
హార్ష్ సన్ లో బయటకు వెళ్లడానికి ముందు తలకు స్కార్ఫ్ లేదా హ్యాట్ తో కవర్ చేయడం వల్ల హెయిర్ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు . అలాగే సన్ స్క్రీన్ ప్రొపర్టీస్ కలిగిన హెయిర్ స్ప్రేలను వాడాలి . సన్ రేస్ జుట్టును కూడా డ్యామేజ్ చేస్తుంది .

అవోబెంజో మరియు జింక్ కలిగిన సన్ స్క్రీన్:
సన్ స్క్రీన్ లో అవొబెంజోన్ మరియు జింక్ అనే ముఖ్యమైన పదార్థాలను తయారుచేయబడి ఉంటుంది. ఇవి చర్మాన్ని హానికరమైన యూవీ రేస్ నుండి రక్షిస్తుంది . దాంతో స్కిన్ డ్యామేజ్ కాకుండా ...చర్మంలో ముడుతలు పడకుండా రక్షణ కల్పిస్తుంది . సన్ బర్న్ నుండి రక్షణ కల్పిస్తుంది . సన్ స్క్రీన్ కొనుగోలు చేసేప్పుడు వాటిని ఎస్ఎఫ్ పి విలువలును గుర్తించి కొనుగోలు చేయాలి. విలువ 30కంటే ఎక్కువగా ఉండాలి . బయటకు వెళ్లడానికి గంట ముందే అప్లై చేయాలి.

లిస్ సన్ స్క్రీన్:
వేసవిలో లిప్ బామ్ లేదా లిప్ స్టిక్ కు బదులుగా లిప్ సన్ స్క్రీన్ అప్లై చ0యడం మంచిది . ఇవి డ్రగ్ స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయి . ఇవి హానికరమైన యూవీరేస్ నుండి పెదాలకు రక్షణ కల్పిస్తాయి . మరియు పెదాల యొక్క రంగు మారకుండా డ్రైగా మరాకుండా రక్షిస్తాయి. సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్ లో పెదాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు . మన అందానికి ఇవన్నీ కూడా ముఖ్యమైన అసెట్స్ గా గుర్తించాలి.

ఇతర క్రీములను అప్లై చేసినప్పుడు ఎక్కువ ఎండలు తిరగకుండా ఉండలి:
కొన్ని రకాల ఉత్పత్తుల్లో కెమికల్స్ కంటెంట్స్ హైడ్రో కార్టిసోన్ మరియు రెటినాయిడ్స్ వంటివి ఉంటాయి . ఇవి స్కిన్ మీద రియాక్షన్ కలిగి ఉంటాయి.జ ఎండలోకి వెళ్లిన వెంటనే రియాక్షన్ కలుగుతుంది . కాబట్టి, ఎండలో బయటకు వెళ్లడానికి ముందు అలాంటి కెమికల్ ప్రొడక్ట్స్ ను అప్లై చేయకపోవడమే మంచిది.

యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి:
ప్రోటీన్స్, విటమిన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉండే ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి . ప్రోటీన్స్ చర్మానికి చాలా అవసరం అవుతాయి . ఇవి స్కిన్ ఎలాసిటిని పెంచుతాయి మరియు చర్మంలో ముడుతల పడకుండా రక్షిస్తాయి . యాంటీఆక్సిడెంట్స్ ఉన్న పండ్లు కూరలు వేసవిలో చాలా అవసరం అవుతాయి . చెమట రూపంలో కోల్పోయే ఎలక్ట్రో లైట్స్ ను తిరిగి భర్తీ చేయడానికి ఇవి ఎంతో అవసరం

నీరు ఎక్కువగా త్రాగాలి:
వేసవి సీజన్ లో ఎక్కువగా నీరు తీసుకోవాలి. మిగిన రోజుల కంటే వేసవిలో మరింత రెటింపు పరిమాణంలో తీసుకోవాలి. చెమట రూపంలో కోల్పోయిన నీటిని తిరిగి శరీరంలో భర్తీ చేయడానికి , చర్మం హెల్తీగా, హైడ్రేట్ గా కనబడటానికి , చర్మం డ్రైనెస్ నివారించడానికి రోజుకు సరిపడా నీరు తీసుకోవడం చాలా అవసరం. హెల్తీ స్కిన్ కోసం రోజుకు కనీసం 7నుండి 8గ్లాసులు నీరు తీసుకోవడం తప్పనిసరి. మీరు ఇంకా నిమ్మరసం కూడా జోడించి తీసుకోవచ్చు.



Click it and Unblock the Notifications