సాప్ట్ స్కిన్, గ్లోయింగ్ స్కిన్ పొందడానికి 10 హెర్బల్ టీ ఫేస్ మాస్క్ లు

By Super Admin

హెర్బల్ టీ ఫేస్ మాస్క్ తో చర్మ సౌందర్యం రెట్టింపు
చర్మ సమస్యలు నివారించుకోవడానికి కొన్ని హెర్బల్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. చర్మ సమస్యలు ఏవైనా ఉన్నట్లైతే కొన్ని థెరఫిటిక్ హెర్బల్ టీలను ఫేస్ కు మాస్క్ లుగా వేసుకోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి.

చర్మ సమస్యల్లో మొటిమలు, నల్ల మచ్చలు, సన్ బర్న్ , ఫైన్ లైన్స్, అలసిన చర్మం వంటి వాటికి హెర్బల్ టీ ఫేస్ మాస్క్ లు గ్రేట్ గా ఉపయోగపడుతాయి. ఈ హెబర్బల్ టీ లలో ఉండే ఔషధ గుణాలు చర్మంలోనికి చొచ్చుకుని పోయి, పూర్తిగా నయం చేస్తాయి .

ఉదాహరణకు గ్రీన్ టీ లో ఎపిగాలక్టచిన్ గల్లెట్ అనే పవర్ కంటెంట్ ఉండటం వల్ల ఇది పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది వృద్ధాప్య లక్షణాలు ఎదుర్కోవడంలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ సహాయపడుతాయి.

కోంబుచ టీలో డిటాక్సిఫైయింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది , చర్మంను అందంగా, సాప్ట్ గా మార్చుతుంది. ఇంకా అనేక ప్రయోజనాలున్నాయి . ఆర్గానిక్ హోం మేడ్ టీలను రెగ్యులర్ స్కిన్ కేర్ లో చేర్చుకోవడం వల్ల చర్మంలో రోజురోజుకు మార్పు వస్తుంది . హెర్బల్ టీ ఫేస్ మాస్క్ ను ముఖానికి అప్లై చేయడానికి ముందు మీరు గుర్తుంచుకోవల్సిన కొన్ని విషయాలున్నాయి.

నాన్ టాక్సిక్ మరియు చాలా ఎఫెక్టివ్, వీటిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు , ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి, తర్వాత హెబర్బల్ టీని ఫేస్ మాస్క్ గా వేసుకోవాలి.

చమోమెలీ టీ:

చమోమెలీ టీ:

చమోమొలి టీ మొటిమలను ను నివారించే అనాక్సిలైటిక్ యాసిడ్ మరియు యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇది నేచురల్ బ్లీచ్ గా పనిచేస్తుంది, స్కిన్ కంప్లెక్షన్స్ ను మార్చుతుంది, మొటిమలను తగ్గిస్తుంది. చర్మంను టైట్ గా మార్చుతుంది . ఒక టేబుల్ స్పూన్ చామంతి రేకులను ఒక కప్పు నీటిలో వేసి ఉడికించాలి. 15నిముషాలు ఉడికిన తర్వాత , చల్లార్చి, వడగట్టి, ఫేస్ వాష్ గా ఉపయోగించాలి.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్ , డిటాక్సిఫికేషన్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి సన్ బర్న్, సన్ టాన్ ను నివారించడానికి చర్మంలో ఫ్రీరాడికల్స్ డ్యామేజ్ కు వ్యతిరేకంగే రక్షణ కల్పిస్తాయి.

ఒక టేబుల్ స్పూన్ ఓట్ మీల్ పౌడర్ లో, కొద్దిగా గ్రీన్ టీ మిక్స్ చేసి, స్మూత్ పేస్ట్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. ఈ మాస్క్ ముఖం, మెడకు అప్లై చేసి స్ర్కబ్ చేయాలి.అరగంట తర్వాత స్ర్కబ్ చేసి,నీటితో శుభ్రం చేసుకోవాలి.

బ్లాక్ టీ:

బ్లాక్ టీ:

బ్లాక్ టీలో ఉండే టానిన్ స్కిన్ కంప్లెక్షన్ ను లైట్ గా మార్చుతుంది, చర్మ రంద్రాలను తెరచుకునేలా చేసి, స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. బ్లాక్ టీని ఐస్ ట్రేలో నింపి, ఫ్రిజ్ లో ఫ్రీజ్ చేయాలి. దీన్ని ముఖం మొత్తం అప్లై చేసి, రబ్ చేయాలి. సర్క్యులర్ మోషన్ లో రబ్ చేసిప్లెయిన్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఈ ఆయుర్వేదిక్ ఫేస్ మాస్క్ ను రోజూ ప్రయత్నించవచ్చు.

లెమన్ గ్రాస్ టీ :

లెమన్ గ్రాస్ టీ :

లెమన్ గ్రాస్ టీలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు , యాంటీ ఆస్ట్రిజెంట్ లక్షణాలు అధికంగా ఉన్నాయి, ఇది చర్మంలోని మలినాలను డీప్ గా శుభ్రం చేస్తుంది. మూసుకున్న రంద్రాలు తెరచుకునేలా చేసి శుభ్రం చేస్తుంది. లెమన్ గ్రాస్ టీలో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖం,మెడకు అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

 ఊలాంగ్ టీ:

ఊలాంగ్ టీ:

ఊలాంట్ టీలో పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్, మినిరల్స్ ఉన్నాయి, ఇది పిగ్మెంటేషన్ , డార్క్ స్పాట్స్ ను తొలగిస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ ఓలాంగ్ టీలో ఒక టేబుల్ స్పూన్ శెనగపిండి , చిటికెడు పసుపు మిక్స్ చేసి, ముఖం, మెడకు ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత ముఖం స్ట్రెచ్ అవుతుంది. అప్పుడు తేమ చేసి, స్ర్కబ్ చేయాలి. తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ హేర్బల్ టీ మాస్క్ ను వారంలో ఒక సారి ఫాలో అవ్వాలి.

ల్యావెండర్ టీ:

ల్యావెండర్ టీ:

ల్యావెండర్ టీ నేచురల్ కూలెంట్ , ఇది చీకాకు కలిగించే చర్మం సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఒక ఫ్రెష్ కప్పు ల్యావెండర్ టీని , రిఫ్రిజరేటర్ లో స్టోర్ చేసి, 2గంటల తర్వాత బయటకు తీసి, అందులో కాటన్ బాల్ అద్ది, ఎక్సెస్ వాటర్ పిండేసి, ముఖానికి అప్లే చేస్తూ, 15 మర్దన చేయాలి.ఈ హెర్బల్ ఫేస్ మాస్క్ ను రోజుకు రెండు సార్లు అప్లై చేయొచ్చు.

వైట్ టీ:

వైట్ టీ:

వైట్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది చర్మంను లైట్ గా మర్చుతుంది. చర్మంను సాప్ట్గ్ గా మరియు బ్రైట్ గా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక టీస్పూన్ మిల్క్ క్రీమ్ ఒక టేబుల్ స్పూన్ వైట్ టీ తీసుకుని మిక్స్ చేసి ముఖానికి మెడకు అప్లై చేయాలి. అర గంట తర్వాత మసాజ్ చేసి, శుభ్రం చేసుకోవాలి.

అల్లం టీ:

అల్లం టీ:

అల్లం టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడం మాత్రమే కాదు, చర్మంలో స్కార్స్ ను లైట్ గా మార్చుతుంది. ఒక కప్పు జింజర్ టీ ని రెగ్యులర్ గా తాగాలి, జింజర్ టీలో కొద్దిగా తేనె మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి.

జాస్మిస్ టీ:

జాస్మిస్ టీ:

జాస్మిన్ టీలో స్ట్రాంగ్ ఆస్ట్రిజెంట్ ప్రొపర్టీస్ ఉన్నాయి, ఇది పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్, ఈ హెర్బల్ టీ మాస్క్ చర్మంలో ఎక్సెస్ ఆయిల్ ను తగ్గిస్తుంది, చర్మం రంద్రాలు ముడుచుకునేలాచేస్తుంది. అలసిన చర్మం కాంతివంతంగా మార్చుతుంది. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, తేనె తీసుకుని, జాస్మిన్ టీలో మిక్స్ చేయాలి. అందులో కాటన్ పాడ్ డిప్ చేసి, ముఖానికి అప్లై చేసి మర్ధన చేయాలి. 15 నిముషాల తర్వాత ఈ ప్రొసెస్ ను రిపీట్ చేయాలి. డ్రైగా మారిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

Story first published: Thursday, October 6, 2016, 8:00 [IST]
Desktop Bottom Promotion