For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్లోయింగ్ స్కిన్ పొందడానికి అలోవెర ఫేస్ ప్యాక్ రిసిపిలు

అలోవెరను ఇదివరకే మీరు ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. అదే కలబందలోని బ్యూటీ బెనిఫిట్స్ తెలియని వారు, దీన్ని ఉపయోగించకపోవడం వల్ల ఏదో మిస్ అవుతున్నట్లు గ్రహించాలి.

|

అలోవెర(కలబంద)గురించి తెలియని వారంటూ ఉండరు. ఎందుకంటే కలబంద పురాతన కాలం నాటి హోం రెమెడీ. ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుపరుచుకోవడానికి ఆకాలం నుండే దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు . ముఖ్యంగా అందం విషయంలో అన్ని రకాల చర్మ సమస్యలను నివారించుకోవడానికి డ్రై, డల్, డెడ్ స్కిన్ ను నివారించుకుని, చర్మంలో పునర్జీవంను తీసుకురావడానికి అలోవెర ఫేస్ ప్యాక్ గ్రేట్ గా సహాయపడుతుంది.

అలోవెరను ఇదివరకే మీరు ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. అదే కలబందలోని బ్యూటీ బెనిఫిట్స్ తెలియని వారు, దీన్ని ఉపయోగించకపోవడం వల్ల ఏదో మిస్ అవుతున్నట్లు గ్రహించాలి. అలోవెరలో స్కిన్ బ్యూటిబెనిఫిట్స్ ను అందించే అద్భుతమైన గుణాలున్నాయి. బ్యూటీ బెనిఫిట్స్ అందివ్వడంలో అలోవెర పవర్ హౌస్ వంటిది. చర్మంలో మొటిమలు, మచ్చలు, ఏజింగ్ లక్షణాలు, స్కిన్ టోన్, ఇంకా ఇతర సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.!

Aloe Vera Face Mask Recipes You Need To Try Today!

అలోవెరలో ఫాలీ సచార్డిన్స్, లెక్టిన్స్, మరియు మన్నన్ కాంపౌడ్స్, వంటి లక్షణాలు, చర్మంలోనికి డీప్ గా వెళ్ళి, చర్మం లేయర్స్ నుండి శుభ్రపరుస్తుంది, చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. చర్మంలో కోల్పోయిన కాంతిని తిరిగి తీసుకొస్తుంది . ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది.

అంతే కాదు, కలబందలో ఉండే విటమిన్స్, మినిరల్స్ చర్మంలో కొల్లాజెన్ లెవల్స్ ను పెంచుతుంది. ఇది స్కిన్ ఎలాసిటిని మెరుగుపరుస్తుంది. ఫైన్ లైన్స్ ముడుతలను నివారిస్తుంది . అలోవెరలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ హెర్బల్ ప్లాంట్ లో ని జెల్ ను కేవలం చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మంలో కాంతి పెరుగుతుంది, అంతే కాదు, అన్ని రకాల చర్మ తత్వాలకు సహాయపడుతుంది. మరి అలోవెరతో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం..

స్కిన్ లైటనింగ్ మాస్క్ :

స్కిన్ లైటనింగ్ మాస్క్ :

ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్ తీసుకుని అందులో నిమ్మరసం మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రమాన్ని బ్లెండ్ చేసి, ముఖం శుభ్రం చేసుకుని ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

స్మూతింగ్ యాంటీ ఏన్స్ మాస్క్

స్మూతింగ్ యాంటీ ఏన్స్ మాస్క్

అలోవెర జెల్ తీసుకుని అందులో అంతే క్వాంటిటి తేనె మిక్స్ చేసి, రెండూ బాగా మిక్స్ అయ్యే వరకూ బ్లెండ్ చేయాలి. తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడిగి, తర్వాత ఈ పదార్థాన్ని మాస్క్ వేసుకోవాలి. కొద్ది సేపటి తర్వాత స్ట్రెచ్ అవ్వడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో నార్మల్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

నైట్ క్రీమ్ తో మరో సింపుల్ రెమెడీ

నైట్ క్రీమ్ తో మరో సింపుల్ రెమెడీ

ఒక బౌల్లో అలోవెర జెల్ తీసుకుని, అందులో 5చుక్కల బాదం ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, బాగా మర్ధన చేయాలి. రాత్రుల్లో వేసుకుంటే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది

హైడ్రేటింగ్ మాస్క్

హైడ్రేటింగ్ మాస్క్

ఒక టీస్పూన్ పంచదార తీసుకుని,అందులో 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ అలోవెర జెల్ మిక్స్ చేయాలి. రెండూ బాగా కలిసే వరకూ బ్లెండ్ చేసి, తర్వాత ముఖం వాష్ చేసుకుని, తర్వాత మాస్క్ ను అప్లై చేసుకోవాలి. ఈ హోంమేడ్ ఫేస్ మాస్క్ వేసుకున్న అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

యాంటీ పింపుల్ మాస్క్:

యాంటీ పింపుల్ మాస్క్:

గుప్పెడు తులసి మెరవం ఆకులు తీసుకుని, కొద్దిగా నీరు చేర్చి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్ ను చేర్చి మిక్స్ చేయాలి. ఈ మాస్క్ ను ముఖం, మెడకు అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత స్ర్కబ్ చేసి శుభ్రం చేసుకోవాలి.

డీటానింగ్ మాస్క్:

డీటానింగ్ మాస్క్:

ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ తొక్క పౌడర్ తీసుకుని అందులో 10 చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి, ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్ మిక్స్ చేయాలి. స్మూత్ గా పేస్ట్ అయిన తర్వాత ముఖం శుభ్రం చేసి, ముఖానికి కోట్ వేసుకోవాలి. డ్రైగా మారే వరకూ ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది నల్లగా మారిన చర్మంను తేలకపరిచి, తెల్లగా మార్చుతుంది.

English summary

Aloe Vera Face Mask Recipes You Need To Try Today!

If you are looking to infuse life back into your dry, dull, dead and dud skin, we have one suggestion for you - aloe vera face mask. If you have been using aloe vera in your skin care routine, you know exactly what it can do, but if you are not, you may be missing out on something.
Desktop Bottom Promotion