For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్లాక్ టీలోని అమేజింగ్ బ్యూటీ సీక్రెట్స్

|

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో ఈ రోజుల్లో నార్మల్ మిల్క్ టీ త్రాగేవారితో పాటు బ్లాక్ టీ తాగే వారి సంఖ్య కూడా పెరిగింది. వివిధ రకాల టీ ఫ్లేవర్స్ లో బ్లాక్ టీ కూడా బాగా పాపులర్ అయిది . ఈ బ్లాక్ టీ హెల్తీ బెవరేజ్ మాత్రమే కాదు, అనేక బ్యూటీ బెనిఫిట్స్ కూడా దాగి ఉన్నాయి.

ఎస్! బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ మరియు పొటాషియం, మెగ్నీషియ, జింక్ మరియు టానిన్ వంటి మినిరల్స్ నిండి ఉన్నాయి . ఇవన్నీ కూడా చర్మం మరియు జుట్టుకు చాలా ప్రయోజనాలను అందిస్తాయి.

జింజర్ బ్లాక్ టీలోని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

ఈ బ్లాక్ టీని రెగ్యులర్ బ్యూటీలో చేర్చుకోవడం వల్ల జుట్టుకు మరియు చర్మానికి అందమైన లుక్ ను సొంతం చేస్తుంది. బ్లాక్ టీ వివిధ రకాలుగా అద్భుతాలను చేస్తుంది . బ్లాక్ టీని ఒక హెల్తీ పానీయంగా ఇంటర్నల్ గా తీసుకోవచ్చు. లేదా ఎక్స్ టర్నల్ గా చర్మానికి అప్లై చేసుకోవచ్చు.

బ్లాక్ టీ తీసుకోవడం వల్ల చర్మంలో దాగి ఉన్న చిన్న చిన్న ముడుతలను నివారిస్తుంది మరియు ప్రీమెచ్యుర్ ఏజింగ్ ను నివారిస్తుంది. కాబట్టి మీ ముఖ చర్మంలో ఏజింగ్ లక్షణాలు కనబడుతుంటే...వెంటనే బ్లాక్ టీక్ ఫ్లేవరెంట్ గా మారిపోండి . వెంటనే మీకు పరిష్కారం దొరుకుతుంది.

బ్లాక్ టీతో ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన లాభాలు

బ్లాక్ టీలో కెఫిన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల, బ్లాక్ టీ త్రాగడం వల్ల ఓరల్ వైరస్ నాశనం అవుతుంది మరియు దాంతో స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు . మరియు చర్మంలో మచ్చలు లేకుండా నివారిస్తుంది.

అదే విధంగా బ్లాక్ టీ తీసుకోవడం వల్ల వివిధ రకాల ప్రయోజనాలున్నాయి. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

ముఖంలో మచ్చలను తగ్గిస్తుంది:

ముఖంలో మచ్చలను తగ్గిస్తుంది:

బ్లాక్ టీ లో టానిన్ అధింగా ఉంటుంది. ఇది పొల్యూషన్ తో పోరాడి చర్మం మీద తిష్టవేసిన బ్యాక్టీరియాను తొలగిస్తుంది . బ్లాక్ టీని త్రాగడం కానీ లేదా టోనర్ గా ఫేస్ వాష్ చేసుకోవడం కానీ చేయాలి . ఇది ముఖంలోని అన్ని రకాల క్రిములను తొలగిస్తుంది మరియు చర్మంలో ఎలాంటి మచ్చలు లేకుండా క్లియర్ స్కిన్ అందిస్తుంది.

ముడుతలతో పోరాడుతుంది:

ముడుతలతో పోరాడుతుంది:

బ్లాక్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి చర్మంను సాప్ట్ గా మరియు సపెల్ గా ఉంచుతుంది . బ్లాక్ టీ ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది . దాంతో ముఖంలో మరియు కళ్లక్రింద ముడుతలను నివారిస్తుంది . మరియు ఏజింగ్ లక్షణాలను ఆలస్యం చేస్తుంది.

కళ్ళ ఉబ్బును తగ్గిస్తుంది:

కళ్ళ ఉబ్బును తగ్గిస్తుంది:

బ్లాక్ టీలో ఉండే కెఫిన్ బ్లడ్ వెసల్స్ ను టైట్ చేస్తుంది . దాంతో కళ్ల క్రింద భాగంలో కళ్ళ ఉబ్బును నివారిస్తుంది. బ్లాక్ టీ బ్యాగ్స్ ను చల్లటి నీటిలో డిప్ చేసి నీటితో సహా టీ బ్యాగులను కళ్ళ మీద అప్లై చేయాలి . కొద్దిసేపటి తర్వాత టీ బ్యాగులను తొలగించడం ద్వారా కళ్ళకు ఉపశమనం , ఉబ్బు తగ్గుతుంది.

ఆయిల్ స్కిన్ నివారిస్తుంది:

ఆయిల్ స్కిన్ నివారిస్తుంది:

బ్లాక్ టీని ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంలో అధికంగా ఉండే నూనె గ్రంథులను పూర్తిగా తగ్గిస్తుంది . దాంతో మీ ముఖం జిడ్డుగా ఉండదు. కాబట్టి వారంలో ఒక్కసారైనా బ్లాక్ టీతో ముఖంను శుభ్రం చేసుకోవాలి.

ఇది ఒక గొప్ప మాయిశ్చరైజర్:

ఇది ఒక గొప్ప మాయిశ్చరైజర్:

పొడి చర్మం ఉన్నవారు కేవలం చల్లటి, బ్లాక్ టీని ముఖంపై చల్లుకోండి. ఇది ఒక గొప్ప రిఫ్రెషర్ మరియు మలినాలను తొలగిస్తుంది. ఇది చర్మానికి అందమైన మెరుపును ఇస్తుంది.

స్కిన్ క్యాన్సర్ రిస్క్ నుండి రక్షణ కల్పిస్తుంది

స్కిన్ క్యాన్సర్ రిస్క్ నుండి రక్షణ కల్పిస్తుంది

బ్లాక్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ స్కిన్ క్యాన్సర్ రిస్క్ నుండి రక్షణ కల్పిస్తుంది

సన్ బ్లాకింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

సన్ బ్లాకింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

బ్లాక్ టీ ఎక్స్ ట్రాక్ట్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల సన్ బ్లాకింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

స్కిన్ రీజనరేషన్

స్కిన్ రీజనరేషన్

బ్లాక్ టీని తాగడం లేదా చర్మానికి అప్లై చేయడం వల్ల స్కిన్ రీజనరేషన్ జరిగి కొత్త చర్మాన్ని డెవలప్ చేస్తుంది.

సెల్యులైట్ ను తగ్గిస్తుంది:

సెల్యులైట్ ను తగ్గిస్తుంది:

బ్లాక్ టీని స్నానానికి ఉపయోగించడం వల్ల స్కిన్ టోన్ ను మార్చుతుంది. చర్మంలోని సెల్యులైట్ లక్షణాలను తొలగించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది . వారానికొకసారి బ్లాక్ టీతో స్నానం చేయడం వల్ల సెల్యులైట్ ను తొలగించుకోవచ్చు మరియు స్కిన్ టోన్ లో మెరగుదల కనబడుతుంది.

డల్ హెయిర్ ను నివారిస్తుంది:

డల్ హెయిర్ ను నివారిస్తుంది:

బ్లాక్ టీలో ఉండే అసిడిక్ లక్షణాలు జుట్టును బ్రైట్ గా మరియు షైనింగ్ తో మార్చుతుంది . తలస్నానం చేసిన తర్వాత చివరగా బ్లాక్ టీతో తలారాపోసుకోవాలి. దాంతో నిర్జీవంగా ఉన్న జుట్టు ఉత్తేజం అవుతుంది.

 జుట్టు రాలడం తగ్గిస్తుంది:

జుట్టు రాలడం తగ్గిస్తుంది:

బ్లాక్ టీ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది . బ్లాక్ టీలో ఉండే కెఫిన్ కంటెంట్ జుట్టు రాలడంతో పోరాడుతుంది . బ్లాక్ టీ తో తలస్నానం చేయడం వల్ల లేదా కండీషనర్ గా అప్లై చేయడం వల్ల జుట్టు స్ట్రాంగ్ గా మార్చి జుట్టు రాలడంతో పోరాడుతంది.

English summary

Amazing Beauty Benefits Of Black Tea

Black tea is one of the widely consumed teas across the globe. This tea is not only a healthy beverage, but also
Story first published: Tuesday, March 15, 2016, 9:47 [IST]
Desktop Bottom Promotion