Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
డార్క్ స్పాట్స్, ముడతలకు చెక్ పెట్టడానికి ఎఫెక్టివ్ రెమడీ.. జామ ఆకు..!!
మనలో చాలా మంది ముడతలు, మచ్చలు, మొటిమలతో బాధపడుతూ ఉంటాం. ముందుగా ఎదుటివారిని ఎట్రాక్ట్ చేసే ఫేస్ లో ఏ మాత్రం మచ్చ ఉన్నా.. గిల్టీగా ఫీలవుతుంటాం. అందుకే.. ఏ చిన్న చర్మ సంబంధిత సమస్య వచ్చినా.. అన్ని రకాలుగా పరిష్కారాల కోసం ఎదురుచూస్తూ ఉంటాం.
ముడతలు.. ముఖాన్ని నిర్జీవంగా మార్చేసి, యవ్వనపు సౌందర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. డార్క్ స్పాట్స్ ముఖాన్ని డల్ గా మారుస్తాయి. ఇలాంటి చర్మ సమస్యలన్నీ.. మిమ్మల్ని అలసిపోయినట్టు చూపిస్తాయి. అయితే.. ఇప్పుడు ఈ సింపుల్ రెమిడీస్ చూసి.. మీరు చాలా హ్యాపీగా ఫీలవుతారు. ఎందుకంటే.. ఈ సొల్యూషన్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ముడతలు, నల్లటి మచ్చలు నివారించడానికి ఇది న్యాచురల్ ఎక్సలెంట్ బ్యూటీ ట్రీట్మెంట్.
యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన జామ ఆకులు క్యాన్సర్ నివారణిగా పనిచేస్తాయని సైన్స్ నిరూపించింది. కాబట్టి డార్క్ స్పాట్స్, ముడతలు నివారించడానికి జామ ఆకులు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. అలాగే జామ ఆకులను బ్యూటీ ఎక్స్ పర్ట్ గా ఎలా ఉపయోగించాలో చూద్దాం..

ముడతలు
యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మంపై ఫ్రీ రాడికల్స్ ని పెంచుతాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ అందించడం వల్ల తగ్గించవచ్చు. కాబట్టి జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి ముడతలను నివారిస్తాయి.

డార్క్ స్పాట్స్
జామ ఆకులు న్యాచురల్ టోనింగ్ ఏజెంట్ లా పనిచేస్తాయి. ఇవి డార్క్ స్పాట్స్ నివారించడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అలాగే ఇందులో యాంటీ సెప్టిక్ గుణాలుంటాయి. చర్మంపై ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తాయి.

ఎలా ఉపయోగించాలి ?
ముందుగా జామాకులను క్రష్ చేయాలి. ఇప్పుడు బాగా మరుగుతున్న నీటిలో మిక్స్ చేయాలి. నీళ్లు బ్రౌన్ కలర్ లోకి మారేవరకు మరిగించాలి. తర్వాత చల్లరనివ్వాలి. ఇప్పుడు కాటన్ బాల్ ఉపయోగించి..ఈ నీటిని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

బ్లాక్ హెడ్స్
కొన్ని జామాకులు తీసుకుని నీళ్లు కలిపి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై స్క్రబ్ చేయడం వల్ల.. బ్లాక్ హెడ్స్ నివారించవచ్చు.

దురద
చర్మంపై దురదను వెంటనే నివారించకపోతే.. సమస్య ఎక్కువవుతుంది. జామాకాలు.. త్వరిత ఉపశమనాన్ని కలిగిస్తాయి.

యాక్నే
మొటిమలు నివారించడంలో జామాకులు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కొన్ని జామాకులను పేస్ట్ లా చేసి.. ముఖానికి పట్టించి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే.. మొటిమలు మాయం కావడమే కాదు.. చర్మం కాంతివంతంగా మారుతుంది.

హెయిర్ లాస్
ఒక లీటర్ నీటిలో గుప్పెడు జామ ఆకులు 20 నిమిషాలు ఉడకబెట్టాలి. చల్లారిన తర్వాత జుట్టుకి, స్కాల్ఫ్ కి పట్టించి మసాజ్ చేయాలి. రెగ్యులర్ గా ఇలా చేస్తుంటే.. జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.



Click it and Unblock the Notifications