For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్కిన్ వైట్ గా మార్చడంలో రోజ్ వాటర్ కంటే బెటర్ ఆరెంజ్ బ్లోసమ్ వాటర్

|

కొంత మందిని చూడగానే ఇట్టే ఆకర్షించేస్తుంటారు. అంత అందం వారికి ఎలా సొంతం.? ఆ చర్య సౌందర్యం వెనుక దాగున్న రహస్యం ఏంటి? అనే ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి. చర్మ సౌందర్యం మెరుగుపరిచే వాటిలో ఎన్నో సౌందర్య ఉత్పత్తులున్నా, వాటిలో ఆరెంజ్ బ్లోసమ్ వాటర్ ఒక అద్భుత బ్యూటీ ప్రొడక్ట్. సాధారణంగా బ్లోజం వాటర్ అంటే ఆరెంజ్ చెట్టులోని పువ్వుల నుండి తయారుచేసినదని అనుకుంటారు. అయితే అలా కాదు, ఆరెంజ్ సీడ్స్, తొక్క, ఆరెంజ్ ఆకులు, బెరడు మరియు ఆరెంజ్ గుజ్జుతోటి తయారుచేసిన డిస్టిల్డ్ వాటర్ .

ఆరెంజ్ బ్లోసమ్ వాటర్ రోజ్ వాటర్ లాగే పనిచేస్తుంది. చర్మానికి తగిన హైడ్రేషన్ మరియు గ్లోను అందిస్తుంది. దీన్ని చాలా కాస్మోటిక్స్ తయారీలో మరియు ఆరోమా థెరఫీల్లో ఉపయోగిస్తున్నారు. మరి ఈ ఆరెంజ్ బ్లోసమ్ వాటర్ అందించే బ్యూటీ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం..

చర్మ రంగును మెరుగుపరుస్తుంది:

చర్మ రంగును మెరుగుపరుస్తుంది:

చర్మ రంగును మెరుగుపరచడంలో గ్రేట్ టోనర్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆయిల్ స్కిన్ ఉన్నవారు, ఈ వాటర్ ను నేచురల్ టోనర్ గా , ఫేస్ ప్యాక్ లలో ఉపయోగించడం వల్ల చర్మంలోని మలినాలు తొలగిపోయి, చర్మం క్లియర్ గా, తెల్లగా కనబడుతుంది.

 స్కిన్ స్మూత్ గా మారుతుంది:

స్కిన్ స్మూత్ గా మారుతుంది:

ఆరెంజ్ బ్లోసమ్ వాటర్ ను అందుకే ఆరోమా థెరఫీలలో ఉపయోగిస్తుంటారు . ఇది నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తుంది. బాత్ వాటర్ లో మిక్స్ చేయడం వల్ల టెన్షన్స్ మరియు తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. స్ట్రెస్ మరియు ఆందోళన తగ్గిస్తుంది. చర్మం స్మూత్ గా మార్చుతుంది.

స్కిన్ సాప్ట్ అండ్ మంచి గ్లో ఇస్తుంది:

స్కిన్ సాప్ట్ అండ్ మంచి గ్లో ఇస్తుంది:

ఆరెంజ్ బ్లోసమ్ వాటర్ ను బాతింగ్ వాటర్ లో మిక్స్ చేయడం వల్ల చర్మం సాప్ట్ గా మరియు ప్రకాశవంతంగా మారుతుంది. ఇది స్కిన్ మాయిశ్చరైజింగ్ కు సహాయపడుతుంది . అందుకు బ్లోసమ్ వాటర్ 1/4కప్పులో 3 చెంచాల తేనె మరియు రెండు కప్పుల పాలు బాతింగ్ వాటర్ లో మిక్స్ చేసి స్నానం చేయడం వల్ల బ్యూటిఫుల్ అండ్ సాప్ట్ స్కిన్ పొందుతారు.

చర్మంలో రెడ్ నెస్ మరియు ఇరిటేషన్ తగ్గిస్తుంది:

చర్మంలో రెడ్ నెస్ మరియు ఇరిటేషన్ తగ్గిస్తుంది:

ఆరెంజ్ బ్లోసమ్ వాటర్ చర్మానికి అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా సెన్సిటివ్ మరియు ఆయిల్ స్కిన్ లకు అద్భుతంగా పనిచేస్తుంది . స్కిన్ ఇరిటేషన్ మరియు రెడ్ నెస్ ను నివారిస్తుంది . ఆరెంజ్ బ్లోసమ్ వాటర్ ను ఎఫెక్టివ్ హోం రెమెడీస్ గా ఉపయోగించాలి.

సన్ బర్న్ నివారిస్తుంది :

సన్ బర్న్ నివారిస్తుంది :

ఆరెంజ్ బ్లోసమ్ వాటర్ ను చాలా వరకూ అన్ని రకాల స్కిన్ లోషన్స్ మరియు క్రీమ్స్ లో ఎక్కువగా ఉపయోగించినట్లు కనుగొనవచ్చు . ఇందులో ఉండే సామర్థ్యం చర్మం చూడటానికి సాప్ట్ గా మరియు బ్యూటిఫుల్ గా మార్చుతుంది. సన్ బర్న్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. సన్ బర్న్ వల్ల చర్మంలో రెడ్ నెస్ ను మాయం చేస్తుంది.

హెయిర్ కండీషనర్ :

హెయిర్ కండీషనర్ :

ఆరెంజ్ బ్లోసమ్ వారట్ హెయిర్ కు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది. ఈ వాటర్ యొక్క స్మెల్ అద్భుతంగా ఉంటుంది. అందుకే దీన్ని హెయిర్ కండీషనర్స్ లో కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు . ఆరెంజ్ బ్లోసమ్ వాటర్ ను తలకు అప్లై చేయడం వల్ల జుట్టు స్ట్రాంగ్ గా మరియు ప్రకాశవంతంగా కనబడుతుంది. ఆరెంజ్ బ్లోసమ్ వాటర్ జుట్టును షైనీగా మార్చుతుంది.

English summary

Amazing Beauty Benefits Of Orange Blossom Water

Orange blossom water is a flavoring which is obtained from the distillation of orange blossoms. It's used widely in cooking, especially in baking, but it can also be found in beauty products. Orange blossom flowers are white and grow on orange, lemon and citron trees. You need dry flowers in order to prepare it as fresh flowers will not work.
Story first published: Tuesday, July 19, 2016, 17:20 [IST]
Desktop Bottom Promotion