Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
చర్మంపై ముడతలకు అమేజింగ్ సొల్యూషన్..! కుకుంబర్ మాస్క్..!
ఈ ఫేస్ ప్యాక్ చర్మంపై ఏర్పడిన ముడతలు, ఏజ్ స్పాట్స్ ని మాయం చేసి.. పెద్దగా ఏర్పడిన రంధ్రాలను నయం చేస్తుంది. అలాగే.. యూత్ ఫుల్ గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది. దోసకాయలో మినరల్ సిలికా ఉంటుంది. ఇది.. చర్మానికి నూతనోత్తేజాన్ని అందించి.. కనెక్టివ్ టిష్యూస్ ని స్ట్రాంగ్ గా మారుస్తుంది. దీనివల్ల చర్మం ఎలాస్టిటి కోల్పోకుండా ఉంటుంది. ముడతలను నయం చేస్తుంది.
అలాగే దోసకాయలో ఉండే.. ఆస్ట్రిజెంట్, సూతింగ్ పదార్థాలు.. చర్మాన్ని బిగుతుగా మార్చి.. దోసకాయలో ఎక్కువగా ఉండే.. నీటిశాతం హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్.. క్లియర్, గ్లోయింగ్, యంగ్ లుక్ ని అందిస్తాయి.

యాంటీ ఏజింగ్ కుకుంబర్ మాస్క్ లో అలోవెరా జెల్, నిమ్మరసం, రోజ్ వాటర్ ఉపయోగించడం వల్ల.. చర్మాన్ని టైట్ గా మారుస్తాయి. మరి ఈ అద్భుతమైన మాస్క్ ఎలా తయారు చేయాలి, ఎలా అప్లై చేయాలో చూద్దామా..
కావాల్సిన పదార్థాలు
సగం దోసకాయ
అలోవెరా జెల్
నిమ్మకాయ
రోజ్ వాటర్

తయారు చేసేవిధానం
దోసకాయను ముందుగా తొక్క తీసి కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి.. 2 టీస్పూన్ల అలోవెరా జెల్, అర టీస్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ రోజ్ వాటర్ కలపాలి. కొన్ని నిమిషాలు అన్నింటినీ బాగా బ్లెండ్ చేయాలి. అందులోకి 1టీస్పూన్ తేనె కలపాలి. ఇది.. చర్మానికి మాయిశ్చరైజింగ్ లా పనిచేస్తుంది.

అప్లై చేయడం ఎలా
ఈ మాస్క్ అప్లై చేయడానికి ముందు.. ముఖం, నెక్ శుభ్రం చేసుకుని తుడుచుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాక్ ని అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇందులోని అద్భుత ప్రయోజనాలు పొందాలంటే.. వారానికి రెండుసార్లు అప్లై చేయాలి.



Click it and Unblock the Notifications