Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
డ్రై స్కిన్ నివారించుకోవడానికి అమేజింగ్ సమ్మర్ ఫేస్ ప్యాక్స్...
వేసవి అంటే ఫన్ . వేసవి సీజన్ లో ఎంజాయ్ చేయాల్సిన సమయం ఎక్కువగా ఉంటుంది . ముఖ్యంగా మహిళలు వేసవి సీజన్ లో వారికి నచ్చిన, వారు మెచ్చిన కలర్ ఫుల్, ఫేవరెట్, ఫ్లోరల్ డ్రెస్సులో అలరించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు . చాలా రోజులు చల్లని వాతావరణం, చలికాలం, శీతాకాలం తర్వాత బయట ఎంజాయ్ చేయాల్సిన సమయం వేసవి..!
ప్రతి సీజ్ కొంత మందికి మంచి జరిగితే, మరికొంత మంది హాని జరుగుతుంటుంది. అయితే వేసవి మంచి న్యూస్ అనే చెప్పవచ్చు . ముఖ్యంగా డ్రై స్కిన్ కలవారు గ్రేట్ న్యూస్ అని చెప్పవచ్చు .
ఎందుకంటే వేసవిలో ఎక్కువ మాయిశ్చరైజర్ మరియు హుముడిటి లెవల్స్ వల్ల చర్మం డ్రై అవ్వకుండా చర్మం పగలకుండా, పొక్కులుగా స్కిన్ రాకుండా ఉంటుంది . వాతావరణ కాలుష్యం, చర్మంలో మలినాలను , యూవీర రేస్ మరియు పొల్యూషన్ వల్ల మన చర్మం చూడటానికి డల్ గా మరియు నిర్జీవంగా కనబడుతుంది . వేసవిలో ఎండ, వేడి, హుముడిటికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చర్మంలో ఏజింగ్ లక్షణాలు కనబడుతాయి , ఏజ్ స్పాట్స్ మరియు ఫైన్ లైన్స్ కూడా కనబడుతుంటాయి.
కాబట్టి వేసవిలో డ్రై స్కిన్ వారు, చర్మంను ఫ్రెష్ గా మరియు ప్రకాశవంతంగా మార్చడానికి పాటించాల్సిన మంత్రం ఏంటంటే సన్ స్క్రీన్ అప్లై చేయడం మరియు కొన్ని హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ వల్ల చర్మాన్ని రక్షించుకోవచ్చు .. మరి డ్రై స్కిన్ ఉన్న వారు అనుసరించాల్సిన కొన్ని ఫేస్ ప్యాక్ ఈ క్రింది విధంగా...

బొప్పాయి ఫేస్ ప్యాక్:
బొప్పాయి నేచురల్ ఎక్స్ ఫ్లోయేటర్ . ఇది డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది మరియు ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . డ్రై స్కిన్ లో మాయిశ్చరైజింగ్ కంటెంట్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇది ఒక్క బొప్పాయి ఫేస్ ప్యాక్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కొన్ని బొప్పాయి ముక్కలను మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే బొప్పాయి గుజ్జుకు కొద్దిగా పైనాపిల్ రసం జోడించి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం రంద్రాలు మాయమవుతాయి.

పెరుగు ప్యాక్:
పెరుగు మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది . డల్ స్కిన్ నివారిస్తుంది . ఇది నేచురల్ బ్లీచ్ గా పనిచేస్తుంది . తేనె మాయిశ్చరైజర్ మరియు చర్మాన్ని నేచురల్ గా సాఫ్ట్ గా మార్చుతుంది. రెండు చెంచాలా పెరుగులో 1 చెంచా తేనె మిక్స్ చేసి ముఖానికి పట్టించి పూర్తిగా డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. అదే విధంగా 1 చెంచా పెరుగుకు ఒక చెంచా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మానికి తగినంత హైడ్రేషన్ అందుతుంది.

గందం ఫేస్ ప్యాక్:
గందం చర్మాన్ని చల్లగా మార్చుతుంది. రోజ్ వాటర్ స్కిన్ టోన్ మార్చుతుంది . ఇది పురాతన కాలం నుండి వాడుకలో ఉన్న ఫేస్ ప్యాక్. ఈ రెండూ కూడా మనకు అందుబాటులో ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్. వేసవిలో డ్రై స్కిన్ నివారించడానికి ఇది ఒక బెస్ట్ ఫేస్ ప్యాక్. మూడు చెంచాల గందంను లో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి ఈ పేస్ట్ ను ముఖాకిని అప్లౌై చేయాలి. 15 నిముసాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. గోరువెచ్చని నీటిలో పుసుపు, గంధం, మిక్స్ చేసి ప్యాక్ లా వేసుకోవడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

ఓట్స్ అండ్ కీరదోసకాయ ఫేస్ ప్యాక్:
మూడు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడర్ కు ఒక టీస్పూన్ కీరదోస జ్యూస్ మరియు ఒక టీస్పూన్ పెరుగు మిక్స్ చేసి ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి . పూర్తిగా తడి ఆరిన తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. పెరుగు మరియు కీరదోసకాయ , తేనె మరియు ఓట్స్ ను చిక్కటి పేస్ట్ చేసి ముకానికి అప్లై చేసి 20 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి . ఇది బ్లాక్ స్పాట్స్ మరియు కళ్ళ ఉబ్బును తగ్గిస్తుంది.

బాదం మరియు రోజ్ వాటర్ మాస్క్:
ఆ రాయల్ ఫేస్ ప్యాక్ కొన్ని అద్భుతాలనే చేస్తుంది. బాదంలోనేచురల్ విటమిన్ ఇ ఉంటుంది మరియు స్కిన్ డ్రై నెస్ ను నివారిస్తుంది. 10 బాదంలను రాత్రి నీళ్ళలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత దీనికి రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత నార్మల్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఫ్రెష్ అండ్ గ్లోయింగ్ కాంప్లెక్షన్ కోసం మాస్క్ వేసుకోవచ్చు. 2 చెంచాలా రోజ్ వాటర్ , 2 చెంచాలా తేనె మిక్స్ చేసి ప్యాక్ వేసుకొని 20 నిముషాల తర్వాత వార్మ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి



Click it and Unblock the Notifications











