Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
సన్ ట్యాన్ తో కమిలిన చర్మానికి సింపుల్ హోం రెమిడీస్
ఎండ కారణంగా ముఖమంతా కమిలిపోయిందా ? మీ అసలు రంగు మారిపోయిందా ? మీకున్న కలర్ కాస్త నల్లగా మారి ఇబ్బంది పెడుతోందా ? అయితే మీకు సన్ ట్యాన్ బాగా ఉందని అర్థం. చర్మంపై పెచ్చులా నల్లగా ఏర్పడి ఉంటే.. మీరు సన్ ట్యాన్ తో బాధపడుతున్నారని గుర్తించాలి. సూర్యరశ్మి ప్రభావం చర్మంపై చాలా త్వరగా పడుతుంది.
ఈ మసాజ్ ఆయిల్స్ ఉండగా..చర్మం నల్లబడుతుందనే భయమెందుకు...?
చలికాలమైనా, ఎండాకాలమైనా ఎండలో బయటకు వెళ్లాల్సివచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చాలామంది సూచిస్తూ ఉంటారు. కాబట్టి ముఖాన్ని క్లాత్ తో కవర్ చేసుకోవడం, చేతులకు సన్ స్క్రీన్ లోషన్ వాడటం కంపల్సరీ చేయాలి. ఒకవేళ ఇప్పటికే మీరు సన్ ట్యాన్ తో బాధపడుతుంటే ? దాన్ని తొలగించడం కష్టమని భావిస్తూ ఉంటారు. అయితే ముఖంపైన మాత్రమే కాదు.. శరీరం మొత్తం సన్ ట్యాన్ తొలగించుకోవడానికి చక్కటి హోం రెమిడీస్ ఉన్నాయి. వాటిని ఫాలో అయితే... మీరు మునపటి కంటే.. మరింత గ్లోయింగ్ గా కనిపిస్తారు.

శనగపిండి, పసుపు
శనగపిండి, పసుపు ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల శరీరంపై ఉండే సన్ ట్యాన్ ని ఈజీగా తొలగించుకోవచ్చు. అలాగే గ్లోయింగ్ స్కిన్ కూడా పొందవచ్చు. 2 స్పూన్ల శనగపిండి, చిటికెడు పసుపు తీసుకుని రోజ్ వాటర్ లేదా నీటితో పేస్ట్ లా తయారుచేసుకుని ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

నిమ్మ, బొప్పాయి
కొద్దిగా పపాయ గుజ్జు తీసుకుని.. అందులో కొన్ని చుక్కల నిమ్మరసం చేర్చాలి. రెండింటినీ బాగా మిక్స్ చేసి.. ఫేస్, మెడకు అప్లై చేయాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే.. చర్మంపై ట్యాన్ తొలగిపోయి.. గ్లోయింగ్ స్కిన్ మీ సొంతమవుతుంది.

పెరుగు, ఓట్ మీల్
4స్పూన్ల పెరుగు, 2 స్పూన్ల ఓట్ మీల్ తీసుకుని బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా పసుపు కూడా కలుపుకోవచ్చు. దీన్ని తడిగా ఉన్న ముఖానికి పట్టించాలి. ఈ మాస్క్ రెగ్యులర్ గా వేసుకుంటే.. సన్ ట్యాన్ తొలగిపోవడమే కాదు.. యాక్నె, జిడ్డు చర్మం నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఆరంజ్, పెరుగు
ఆరంజ్ లో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని చాలా మంచిది. రెండు ముక్కల ఆరంజ్ ముక్కల గుజ్జుకి, 2 స్పూన్ల పెరుగు కలిపి.. మిక్స్ చేయాలి. ఫేస్ కి అప్లై చేసి.. శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.

పొటాటో జ్యూస్, లెమన్
బంగాళదుంపలో విటమిన్స్, ఫైబర్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి మంచిది. ఒక బంగాళదుంప తీసుకుని గ్రైండ్ చేసి.. రసం తీయాలి. ఇప్పుడు 4 స్పూన్ల నిమ్మరసం కలిపాలి. ఈ మిశ్రమంలో దూది ముంచి సన్ ట్యాన్ ఉన్న ప్రాంతంలో బాగా అప్లై చేయాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

టమోటా, పెరుగు, నిమ్మరసం
2 టేబుల్ స్పూన్ల టమోటా పల్ప్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని మిశ్రమం తయారు చేసుకుని ఫేస్ కి అప్లై చేయాలి. అరగంటపాటు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉంటే.. సన్ ట్యాన్ తొలగిపోతుంది.

గంధం, కొబ్బరినీళ్లు
టేబుల్ స్పూన్ గంధం పొడి, కొబ్బరినీళ్లు, కొన్ని చుక్కల బాదాం నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్, నెక్ కి అప్లై చేయాలి. 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.

పైనాపిల్, హనీ
రెండు టేబుల్ స్పూన్ల పైనాపిల్ గుజ్జు, టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ కి రాసుకుని 5 నిమిషాల తర్వాత చల్లటినీటితో కడిగేసుకోవాలి.

అలోవెరా
వారం రోజుల్లో అలోవెరా జెల్ మీ చర్మాన్ని మెరిపిస్తుంది. సన్ ట్యాన్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో రోజూ అలోవెరా జెల్ అప్లై చేస్తే.. చర్మానికి న్యాచురల్ గ్లో వస్తుంది. రాత్రి పడుకునే ముందు అలోవెరా జెల్ అప్లై చేసి.. ఉదయాన్నే శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.

దోసకాయ
రెండు టేబుల్ స్పూన్ల దోసకాయ రసం, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు కలపాలి. బాగా మిక్స్ చేసి.. అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. లేదా ఫ్రెష్ దోసకాయ ముక్కలతో ముఖంపై రుద్దుకున్నా సన్ ట్యాన్ తొలగించడం ఈజీ అవుతుంది.



Click it and Unblock the Notifications