For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నువ్వుల నూనె మీ సౌందర్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది...

By Super Admin
|

చర్మ ఆరోగ్యానికి నువ్వుల నూనె ఏంతో మంచిదని నిపుణులు చెప్తారు. నువ్వుల నూనె మన చర్మానికి సహజ ప్రకాశాన్ని ఇవ్వడమే కాకుండా మీ మొఖం మీద మొటిమలు లేకుండా చేస్తుంది.

నువ్వుల నూనెతో వారానికి రెండు సార్లు ముఖానికి మసాజ్ చేస్తే చర్మ సమస్యలు దూరం అవుతాయి. చర్మంపై నూనెను మసాజ్ చేసాక 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. గోరువెచ్చని నీరు లేదా రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

చర్మం నుండి నూనెను తొలగించటానికి రోజ్ వాటర్ ని ఉపయోగిస్తే చర్మం మృదువుగా మారుతుంది. నువ్వుల నూనె చర్మాన్ని ప్రకాశవంతంగా చేయటమే కాకుండా చర్మ టోన్ మెరుగుదలకు సహాయపడుతుంది.

మీ చర్మం ప్రకాశవంతంగా ఉండటానికి మరియు చర్మ సమస్యలకు గుడ్ బై చెప్పాలంటే ఈ వ్యాసాన్ని చదవండి. నువ్వుల నూనె ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చూద్దాం. అయితే నువ్వుల నూనె ఒక విచిత్రమైన వాసన కలిగి ఉంటుంది. అందువలన సమస్యల పరిష్కారానికి నువ్వుల నూనెను వాడటం ఆపవద్దు.

రంద్రాలు మూసుకుపోకుండా చేస్తుంది

రంద్రాలు మూసుకుపోకుండా చేస్తుంది

రంద్రాలు మూసుకు పోకుండా ఉండాలంటే వారంలో రెండు సార్లు ముఖానికి నువ్వుల నూనె రాసి మసాజ్ చేయాలి. ఈ విధంగా చేయుట వలన చర్మ రంద్రాలు తెరుచుకొని దుమ్ము మరియు మలినాలు తొలగిపోతాయి.

మొటిమలను తగ్గించటంలో సహాయం

మొటిమలను తగ్గించటంలో సహాయం

మీరు మొటిమలతో బాధపడుతూ ఉంటే కనుక ఈ చిట్కా బాగా సహాయపడుతుంది. కొంచెం గోరువెచ్చని నువ్వుల నూనెను తీసుకోని మొటిమలు ఉన్న ప్రాంతంలో నిదానంగా మసాజ్ చేసి పది నిముషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే ఒక వారంలో మొటిమలు మాయం అవుతాయి.

వయస్సు మచ్చలను తగ్గించటంలో సహాయం

వయస్సు మచ్చలను తగ్గించటంలో సహాయం

చర్మం మీద వయస్సు మచ్చలు ఉంటే ముఖం అసహ్యంగా కనపడుతుంది. గోరువెచ్చని నువ్వుల నూనెతో ముఖం మీద మసాజ్ చేస్తే వయస్సు మచ్చలు తగ్గిపోతాయి. ప్రతి రోజు మసాజ్ చేస్తే వయస్సు మచ్చలు తగ్గటమే కాకుండా చర్మం రంగు కూడా మెరుగు అవుతుంది.

చర్మాన్ని స్వచ్చంగా చేస్తుంది

చర్మాన్ని స్వచ్చంగా చేస్తుంది

మీ ముఖం దోషరహిత మరియు మనోహరంగా ఉండాలని కోరుకుంటున్నారా? గోరువెచ్చని నువ్వుల నూనెతో ప్రతి రోజు ముఖానికి మసాజ్ చేస్తే ముఖం స్వచ్చంగా ఉంటుంది.

రంగును మెరుగు పరుస్తుంది

రంగును మెరుగు పరుస్తుంది

భారత దేశంలో రంగు కోసం ఈ నూనెను వాడతారు. చర్మం మంచి చాయ ఉండాలంటే ఈ నూనెతో మసాజ్ చేసుకోవాలి.

మాయీశ్చ రైజర్ గా పనిచేస్తుంది

మాయీశ్చ రైజర్ గా పనిచేస్తుంది

వేసవి లేదా శీతాకాలంలో తేమను కలిగించే పదార్ధంగా నువ్వుల నూనెను వాడవచ్చు. చర్మ సంరక్షణకు సహాయపడే లక్షణాలు నువ్వుల నూనెలో సమృద్దిగా ఉన్నాయి.

దెబ్బతిన్న కణాలకు మరమత్తు

దెబ్బతిన్న కణాలకు మరమత్తు

దెబ్బతిన్న చర్మ కణాలకు క్రమం తప్పకుండా నువ్వుల నూనెను రాస్తే చర్మం అందంగా మారుతుంది. రెండు స్పూన్ల నువ్వుల నూనెలో కొంచెం కొబ్బరి నునెను కలిపి వేడి చేసి చర్మానికి రాయాలి.

English summary

Amazing Skin Care Benefits Of Sesame Seed Oil

Sesame seed oil is healthy for your skin, says experts. Sesame seed oil will provide your skin a natural sheen and will also make sure that you do not see that ugly looking zit for the rest of your life.
Desktop Bottom Promotion